S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

02/02/2019 - 18:33

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బావి ఉంది. అందులో పెద్ద తాబేళ్లు జంటగా నివసిస్తూ విడిపోయాయి. అలా విడిపోయిన తరువాత ఆడ తాబేలుకు సంతానం కలిగి చిన్న మగ తాబేలుకు జన్మనిచ్చింది.
ఆ బావిలో ప్రతిరోజూ తల్లి తాబేలు, పిల్ల తాబేలు, బావే తమ ప్రపంచంగా భావించి ఆడుకుంటూ ఉండేవి. ఎలా? ఆడుకున్నాయంటే తల్లి తాబేలు తన కొడుకు తాబేలును వీపుపై ఎక్కించుకుని బావిలో అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటూ ఉండేవి.

01/19/2019 - 19:56

అదో విశాలమైన అడవి.
అందులో ఎన్నో జంతువులతోపాటు అనేక పక్షులూ నివసించేవి. ఒక కొలనుకు సమీపంలో ఉన్న చెట్టుపై కొన్ని పావురాలు స్థావరం ఏర్పరచుకున్నాయి.
అందులో ఓ తెల్ల పావురాల జంట కూడా ఉండేది. వాటికి ఓ పిల్ల పావురం. పేరు గోవిందు. పూర్తిగా నలుపు రంగు. అది అంటే, తల్లికి ఎంతో ముద్దు.

01/12/2019 - 19:45

లోకజిత్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. బాగా ధనం సంపాదించాడు. మేడలు, మిద్దెలు ఒకటేమిటి సమస్త భోగభాగ్యాలు ఆయన ముంగిట ఉన్నాయి. అతనికి ఒక్కగానొక్క కుమారుడు విలాస్. కళాశాల చదువు పూర్తి చేసిన విలాస్ నిజంగానే విలాస పురుషుడిగా జీవితాన్ని గడపసాగాడు. పెద్దల యెడల అణకువ, గౌరవం చూపేవాడు కాదు. వాళ్ల నాన్న వద్ద ఫ్యాక్టరీలో పనిచేసే పెద్దల్ని సైతం లెక్క చేసేవాడు కాదు.

01/05/2019 - 20:05

ఇంద్రసేన మహారాజు సభలో న్యాయ విచారణ చేస్తున్నాడు. నేరస్తులను విచారించి, మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ శిక్షలు విధిస్తున్నాడు.
‘మహారాజా! ఇతని పేరు భూమయ్య. నారాయణ కొట్లో బియ్యం మూట దొంగిలించాడు’ అన్నాడు కొత్వాలు.
‘్భమయ్యా! ఏమంటావ్? నేరం చేశావా?’ అని రాజు ప్రశ్నించాడు.

12/29/2018 - 18:21

అది ఒక జిల్లా పరిషత్ హైస్కూల్. సుమారు మూడు వందల మంది విద్యార్థులు చదివే ఆ పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పిల్లలందరికీ సైన్స్ టీచర్ సతీష్ అంటే చాలా ఇష్టం. అతను యువకుడు కావడం చేత విద్యార్థులతో చాలా స్నేహంగా ఉంటాడు. విద్యార్థులందరికీ అర్థమయ్యేలాగా పాఠాలను ప్రయోగాత్మకంగా చెబుతాడు.

12/22/2018 - 20:07

గ్రామాధికారి చలమయ్య గారింట్లో హఠాత్తుగా కిలో బరువు తూగే వెండి కంచం మాయమై పోయింది. ఈ విషయం అతనికి, అతని భార్య సీతమ్మకి మాత్రమే తెలుసు. తమ ఇంట్లో ఎంతోమంది నౌకర్లు పని చేస్తుండటం వల్ల ఆ వెండి కంచాన్ని ఎవరు దొంగిలించారనేది తెలుసుకోవడం కష్టమనుకున్నారు ఆ భార్యాభర్తలిద్దరూ. అలా అని బయటికి దొంగతనం జరిగిందంటే గ్రామాధికారి ఇంట్లో దొంగతనం జరగడమా అంటూ ముక్కున వేలేసుకుంటారు.

12/15/2018 - 18:29

ఒక అడవిలో పెద్ద వేపచెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి. వాటిలో ఒక కాకి వుండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. దూరదూరంగా వుండేవి.

12/08/2018 - 19:35

గురుకులంలోని శాండిన్యుడు వద్ద అక్షయ, మురారి అనే ఇద్దరు రాజకుమారులు శిష్యరికం చేస్తున్నారు. శాండిన్యుడు ఇద్దరికీ అనేక విద్యాబుద్ధులు, యుద్ధ విద్యలు నేర్పిస్తున్నాడు. ఇద్దరిలో మురారి కొంచెం పిరికివాడిగా ఉన్నట్టు శాండిన్యుడు గమనించాడు. ఏది ఏమైనా మురారికి కూడా ధైర్య సాహసాలు అబ్బేట్టు చేయాలని నిశ్చయించుకొన్నాడు.

12/01/2018 - 22:05

నీలేష్ బడి నుంచి రాగానే టీవీ ముందో, కంప్యూటర్ ముందో, అదీ లేదంటే ఏ ఐపాడో పట్టుకుని ఆడుకుంటూ కూర్చునేవాడు. రాన్రాను బయటకు వెళ్లి ఆడుకునే ఆటలకన్నా ఆన్‌లైన్ గేమ్‌ల మీదే ఆసక్తి ఎక్కువై పోయింది.

11/24/2018 - 19:15

మాధవాపురంలో గొప్ప ధనవంతుడు గోపాలయ్య. అతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. రాబడి చాలా ఎక్కువగానే వస్తుంది. ఐనా పిల్లికి బిచ్చం పెట్టడు. ఎంగిలి చేత్తో కాకిని అదిలించడు. కడుపు నిండా తినటం తప్ప కడుపుకాలే వారికి పిడికెడు అన్నం పెట్టిన పాపాన పోడు. అతడి ఇంటికి ఊరి వారి రాకపోకలూ తక్కువే. బిచ్చగాళ్లు ఇంటి ముందు కనిపిస్తే చాలు నానా తిట్లూ తిడుతూ కర్ర పట్టుకు వచ్చి తరిమి కొడుతుంటాడు.

Pages