S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 00:43

పెదకూరపాడు, ఏప్రిల్ 29: స్థానిక రిటైర్డ్ ఎంపిడిఒ వేదాంతం రఘునాథాచార్యులకు చెందిన వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం మాజీ యార్డుచైర్మన్ బెల్లంకొండ రామగోపాలరావు, బ్యాంకు మేనేజర్ పతకమూరి రాములు, టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, డిసి చైర్మన్ వడ్లమూడి అప్పారావులు ప్రారంభించారు.

04/30/2016 - 00:43

గుంటూరు, ఏప్రిల్ 29: గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థినులు అసామాన్య ఫలితాలు సాధించడం పట్ల స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లేళ్ల అప్పిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కష్టపడి కాక ఇష్టపడి చదివినందునే మట్టిలో మాణిక్యాల్లాగా ప్రకాశిస్తున్నారన్నారు.

04/30/2016 - 00:40

ఖమ్మం, ఏప్రిల్ 29: అహంకారంతో టిఆర్‌ఎస్ పార్టీ విర్రవీగుతుందని టిపిసిసి నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత నామినేషన్ సందర్భంగా ఖమ్మం వచ్చిన వారు విలేఖరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు.

04/30/2016 - 00:40

ఖమ్మం, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తరిమేస్తామని, కొన్ని పార్టీలు ఓటమి భయంతోనే చీకటి రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, కడియం శ్రీహరిలు స్పష్టం చేశారు. శుక్రవారం టిఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మనుగడ లేకుండాపోతుందన్నారు.

04/30/2016 - 00:39

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29: పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో 16మంది బరిలో ఉండనున్నారు. శుక్రవారం వరకు మొత్తం 16నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. టిఆర్‌ఎస్ తరుపున తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరుపున రాంరెడ్డి సుచరిత, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సిపిఎం తరుపున పోతినేని సుదర్శన్‌రావు, బత్తుల లెనిన్, కాగా మరో 11మంది స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేశారు.

04/30/2016 - 00:39

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29 పాలేరు ఉప ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం దానకిషోర్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ఆర్ రమా రాజేశ్వరితో కలిసి కైకొండాయిగూడెం, దానవాయిగూడెం, రావన్నపేటల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

04/30/2016 - 00:38

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 29: వచ్చే నెల 20వ తేదీలోగా టెట్, ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన్ను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మే 1 టెట్, 2న ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం చేయటంతో ఆ కళాశాలలన్నీ జెఏసిగా ఏర్పడి పరీక్షకు సహకరించలేదన్నారు.

04/30/2016 - 00:37

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 29: భారత దేశానికి పట్టిన చీడ, శని కాంగ్రెస్ పార్టీయే అని, దానిని ఇక్కడి నుంచి పారద్రోలడమే టిఆర్‌ఎస్ ప్రధాన కర్తవ్యమని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటి, మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరిలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాయుడుపేటలో గల మద్ది యల్లారెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించిన టిఆర్‌ఎస్ ప్రత్యేక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

04/30/2016 - 00:37

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 29: పాలేరు ఉప ఎన్నికల్లో రాంరెడ్డి సుచరితను గెలిపించి సుచరిత్ర సృష్టించాలని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పివిఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే అది కాంగ్రెస్ చలవేనని, నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు.

04/30/2016 - 00:36

సత్తుపల్లి, ఏప్రిల్ 29 : గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో తీవ్రతను తట్టుకోలేక ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎదైనా పనుంటే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే జనం బయటకు వస్తున్నారు. నిత్యం రద్దీగా ఉంటే సత్తుపల్లి పట్టణం, రహదారి సైతం వాహనాలు తిరగక నిర్మానుష్యంగా మారింది. దీనికి తోడు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా ఎక్కడా రోడ్డుపై కనిపించడంలేదు.

Pages