S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 01:01

హైదరాబాద్, ఏప్రిల్ 29: నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు గాను మహానగర పాలక సంస్థ సమకూర్చిన 1772 ఆటో టిప్పర్లను నిర్దేశించిన లక్ష్యానికి మాత్రమే వినియోగించాలని, ఏ మాత్రం దుర్వినియోగం చేసినా, క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

04/30/2016 - 01:00

హైదరాబాద్, ఏప్రిల్ 29: సినిమా కార్మికుల కోసం కేటాయించిన డా. ఎం.ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి కాలనీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసేందుకు భారతీయ జనతాపార్టీ సినిమా సెల్ ఆధ్వర్యంలో ఓ నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు శుక్రవారం బర్కత్‌పురాలోని సిటీ బిజెపి ఆఫీసులో గ్రేటర్ బిజెపి అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నేతలు వెల్లడించారు.

04/30/2016 - 00:59

మేడ్చల్, ఏప్రిల్ 29: మేడ్చల్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గోదావరి జలాల ట్రయల్ రన్ విజయవంతం అయింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పండితుల ప్రత్యేక పూజల అనంతరం ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మచెరువు (ఏర్ర చెరువు)లో గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు.

04/30/2016 - 00:58

వికారాబాద్, ఏప్రిల్ 29: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై మున్సిపల్ సాధారణ సమావేశం దద్దరిల్లింది. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ సమావేశానికి శాసనసభ్యుడు బి.సంజీవరావు హాజరై మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారణకు జనరల్ ఫండ్‌ను ఖర్చు చేయరాదని, ప్రత్యేక నిధులను ఖర్చు చేయాలని సూచించారు.

04/30/2016 - 00:47

గుంటూరు, ఏప్రిల్ 29: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదు.. కేంద్రం సహకరించటంలేదు.. విభజన జరిగి రెండేళ్లయినా ఇప్పటి వరకు కేవలం రూ. 2వేల 500 కోట్లు మాత్రమే నిధులిచ్చింది.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో జాప్యం జరుగుతోంది.. అయినా తలకు మించిన భారంతో మొండిగా ముందుకు సాగుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు.

04/30/2016 - 00:46

దాచేపల్లి, ఏప్రిల్ 29: ఒకవైపు మట్టి, నీరు , చెట్టు వంటి సహజ వనరులను అభివృద్ధి చేసుకుంటూనే మరొవైపుటెక్నాలజీ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి తాను కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పిడుగురాళ్ళ మండల బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

04/30/2016 - 00:46

గుంటూరు, ఏప్రిల్ 29: మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్య విలువలపైనా ఏమాత్రం నమ్మకమున్నా తక్షణం ఎమ్మెల్యేల కొనుగోళ్లను చంద్రబాబు నాయుడు నిలుపుదల చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

04/30/2016 - 00:45

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 29: రాష్ట్రంలో నీరు-ప్రగతి కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంలా సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సన్నిధి కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చేపట్టిన పనులను వేగవంతంగా చేసేందుకు అందరూ సహకరించాలన్నారు.

04/30/2016 - 00:44

సత్తెనపల్లి, ఏప్రిల్ 29: పట్టణానికే గర్వకారణమైన ప్రగతి కళామండలి 68వ వార్షికోత్సవ, 43వ కళాపరిషత్ సాంస్కృతిక పోటీలు శుక్రవారం స్థాని క సరస్వతీ శిశుమందర్ ఉన్నతపాఠశాల ఆవరణలో జరిగాయి.

04/30/2016 - 00:44

మేడికొండూరు, ఏప్రిల్ 29: గుంటూరు- నరసరావుపేట రహదారిలోని డోకిపర్రులో గల యూనివర్సల్ కళాశాల వద్ద వరిగడ్డి ట్రాక్టర్, మిర్చిలోడ్ లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి...

Pages