S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/15/2016 - 01:38

ఈమధ్య కాలంలో ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్న హీరోయిన్ రెజీనానే. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతోంది. ఇటీవల చీరలమ్ముతానంటూ తిరిగింది. అది కూడా ఓ మంచి కాజ్ కోసం చేస్తున్నానని చెప్పింది. ఇవన్నీ ఎందుకూ? అన్న డౌట్ సాధారణంగా ఎవరికీ రాదు. ఎందుకంటే -ఆమెకు మంచి హిట్‌పడి చాలాకాలమైందన్న విషయం చాలామందికి తెలుసు కనుక.

03/07/2016 - 23:13

అవినీతిని నిలదీసిన అబలగా, విధిని, పోలీసు అకృత్యాలను ఎదిరించిన మానవతామూర్తిగా రేవతి నటించిన అంకురం సినిమా అంటే చాలా ఇష్టం. ఒక సాధారణ బడిపంతులు కూతురు అత్తారింటికి వెళ్లడం కోసం రైల్లో ప్రయాణిస్తుంటే సత్యం అనే గిరిజనుడు తన చంటిపాపను ఆమెకు అప్పగించి, నీళ్లకోసం కిందికి దిగుతాడు. తర్వాత అతను రాడు, పాపను తీసుకోడు. ఆ పాపను తండ్రికి అప్పగించాలని ఆమె పొందిన తపనే ఈ చిత్ర కథాంశం.

03/07/2016 - 23:10

పాండవ వనవాసం చిత్రంలో భీముడు, ద్రౌపది కలిసి ఆలపించిన డ్యూయెట్ ‘హిమగిరి సొగసులు/ మురిపించును మనసులు’. ఈ పాట ఇప్పటికీ రేడియోల్లో వినిపిస్తూనే ఉంటుంది. పాట వినగానే మనసంతా హిమగిరులవైపే వెళ్తున్నట్టు అనిపించేంత గొప్ప గీతమిది. ఘంటసాల, సుశీల అద్భుతమైన గానం ఒక వంతైతే, సముద్రాల వారి సాహిత్యం అద్భుతం. రెండూ కలగలిపి చిత్రంలో అద్భుత గీతాన్ని పొందుపర్చారు. వీనులవిందు చేసేలా తీయగా సాగుతుందీ పాట.

03/07/2016 - 23:08

- వెంకట్ మంచి
==========
టెన్త్‌లో లక్, ఇంటర్ కిక్, బిటెక్‌లో..? చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన దర్శకుడు మంచి వెంకట్. తొలి చిత్రంతోనే తన ప్రతిభతో గుర్తింపు పొందిన వెంకట్‌తో ఈ వారం చిట్‌చాట్..
============
మీ నేపథ్యం

03/07/2016 - 23:06

ఈ రోజుల్లో నటీనటుల మధ్య సఖ్యత అంతంత మాత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక తారల విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రెడ్షిప్ కొద్దీ పైకి లేదా మీడియా ముందూ ఎన్ని కబుర్లు చెప్పినా -వాళ్లమధ్య సఖ్యతకంటే ‘ఇగో’ ముందుంటుందనేది వాస్తవం. అది కొన్ని సందర్భాల్లో మీడియా ముందూ బయటపడిన సందర్భాలు కోకొల్లలు. స్వర్ణయుగ సినిమా కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి.

03/07/2016 - 23:04

ఈవారం మాళవికా నాయర్ కథానాయికగా నటించిన కళ్యాణ వైభోగమే చిత్రం విడుదలైంది. సినిమా మంచి టాక్ సంపాదించింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కథానాయిక మాళవికా నాయర్‌ను ప్రమోషన్‌లో పాల్గొనమని అడిగారట. అందుకు సింపుల్‌గా తాను పరీక్షలు రాస్తున్నానని, వీటిని డిస్ట్రబ్ చేసుకుంటూ రాలేనని చెప్పిందని సమాచారం.

03/07/2016 - 22:47

మోడరన్ థియేటర్స్ బ్యానర్‌పై ‘సతీ అహల్య’తో టిఆర్ సుందరం చిత్ర నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. మోడరన్ థియేటర్స్ పేరిట సేలంలో స్టూడియో నిర్మించారు.

03/07/2016 - 22:44

ఎప్పటినుంచో తన పెళ్లి గురించి పలు విశేషాలు చెప్పీ చెప్పక తప్పించుకు తిరుగుతున్న ప్రీతిజింతా చివరికి హాట్ న్యూస్ బయటపెట్టింది. తనకు జీన్‌గుడ్ ఇనఫ్ అనే వ్యక్తితో లాస్‌ఏంజిల్స్‌లో పెళ్లి జరిగిందని ప్రకటించింది. అయితే పెళ్లి రహస్యంగా జరిగిందన్నది ఆమె కథనం. అలా ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మరి రిసెప్షన్ ఎప్పుడని ఎవరైనా అడిగితే హనీమూన్ ముగిశాక అని బాంబు పేలుస్తోందట.

03/07/2016 - 22:43

గత వారం విడుదలైన ఎక్కడి సినిమాలు అక్కడే గప్‌చుప్. ఎటూ వారం రోజులకన్నా ఎక్కువ ఆడవన్న ధైర్యంతోనే విడుదల చేశారు. వారం ధైర్యానికి సినిమాలూ సలాంకొట్టాయి. ఇక ఈవారం దశరథ్ దర్శకత్వంలో శౌర్య, నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే, జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూర్ టాకీస్‌తోపాటుగా తమిళంనుండి అనువాదమైన శివగంగ చిత్రాలు విడుదలయ్యాయి.

03/01/2016 - 05:22

ఎన్టీఆర్ ఎస్టేట్ పతాకంపై నిర్మించిన ‘కోడలుదిద్దిన కాపురం’లోని ‘ఓం సచ్చిదానంద.. నీ సర్వం గోవింద’ అన్న పాట చాలా ఇష్టం. దర్శకుడు డి యోగానంద్ ఈ పాటను చక్కగా చిత్రీకరించారు. పాటలో సత్యనారాయణ -బాబా వేషంలో రక్తికట్టించారు.

Pages