S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 23:09

ధరూరు, సెప్టెంబర్ 23:్ధరూరులోని బీరప్ప ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. గ్రామస్థుల కనథం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని బీరప్ప ఆలయానికి రోజువారిగానే అర్చకుడు పూజలు నిర్వహించి రాత్రి తాళాలువేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం కాలనీవాసులు ఆలయం తాళాలు తెరిచి ఉండడాన్ని గమనించి అర్చకుడికి సమాచారం అందించారు.

09/23/2016 - 23:08

ధరూరు, సెప్టెంబర్ 23: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.400 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగవ ప్రాంతం నుంచి 70వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి దిగువకు 20,830 క్యూసెక్కుల శ్రీశైలం జలాశయంలోకి విడుదల చేస్తున్నారని జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

09/23/2016 - 23:08

వనపర్తి, సెప్టెంబర్23: వనపర్తి డివిజన్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారం రోజుల్లో 189 ఇళ్లు కూలినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈనెల 16న కొత్తకోట మండలంలో 4, పాన్‌గల్ మండలంలో1, పెబ్బేరు మండలంలో 15, గోపాల్‌పేట మండలంలో 24, వనపర్తి మండలంలో 10 మొత్తం 54 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

09/23/2016 - 23:07

గద్వాలటౌన్, సెప్టెంబర్ 23: నూతన జిల్లాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్వాలను జిల్లాగా ప్రకటించకపోవడంతో గద్వాల ప్రజలు, నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా జెఎసి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. గత మూడు రోజుల క్రితం గద్వాలలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు మోహన్‌రావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. గద్వాల జిల్లా అయ్యేంత వరకు దీక్షను విరమింపజేసేది లేదని వారు తెలిపారు.

09/23/2016 - 23:07

ఊట్కూర్, సెప్టెంబర్ 23 : ఊట్కూర్ మండల కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిదిలోని చిన్నపోర్ల, మల్లేపల్లి గ్రామాలలో గురువారం రాత్రి ఎలిగంళ్ల హన్మంతు, రాజేందర్ మట్టి ఇల్లు కులిపోయింది. మండలంలోని అయా గ్రామాలలో మట్టి మిద్దెలు కులుపోవడంతో పాటు కొన్ని ఇండ్లు గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అయా గ్రామాల ప్రజలు తెలిపారు.

09/23/2016 - 23:06

బాలానగర్, సెప్టెంబర్ 23: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన మృతి చెందాడు. బాలానగర్ మండలం నందారం గ్రామ పంచాయతీ పరిధిలోని మచారం తాండకు చెందిన తులసీనాయక్(33)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కకడే మృతి చెందాడు.

09/23/2016 - 22:43

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో చక్కగా అమలు పరిచి గ్రామాలను అభివృద్ధి పరచాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సర్పంచ్‌లపై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

09/23/2016 - 22:43

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: సోలార్ వాడకం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చని నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ ఎం.వి.కె.రాజు తెలిపారు. గురువారం ఈ మేరకు స్థానిక ఎపి ఇపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వాడకం బాగానే ఉన్నప్పటికీ, గృహావసరాలకు సోలార్ వాడకం ఉత్తరాంధ్రలోనే జిల్లా వెనుకబడి ఉందన్నారు.

09/23/2016 - 22:43

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రూపొందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా క్షేత్రస్థాయిలో నెహ్రూ యువకేంద్రం వాలంటీర్లు ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రచారాధికారి డాక్టర్ జి.కొండలరావు కోరారు.

09/23/2016 - 22:42

గార, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాధించింది ఏదీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. మండలం బోరవానిపేట పంచాయతీ గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో పార్టీ శ్రేణులు ఇంటింటా పర్యటించి కరపత్రాలను పంచిపెట్టారు.

Pages