S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 22:36

ఆత్మకూరు, సెప్టెంబర్ 22 : రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు ఆత్మకూరు అతలాకుతలమైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వంకలు, వాగులు ఉప్పొంగాయి. 80.5 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాల వల్ల చిన్నపాటి వర్షానికే గుండ్లకమ్మ వాగు పొంగి ఇళ్లల్లోకి నీరు చేరింది.

09/23/2016 - 22:36

నంద్యాల రూరల్, సెప్టెంబర్ 22: మండలంలోని పెద్దకొట్టాల, అబాండతాండ మధ్యలో ఉన్న పాలేరు వాగు ఉద్ధృతిని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఆర్‌ఐ శివ ప్రసాద్‌రెడ్డిలు విఆర్‌ఓలతో కలసి పరిశీలించారు. ఈ ఉద్ధృతి వల్ల ఈ గ్రామాల ప్రజలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

09/23/2016 - 22:35

కర్నూలు, సెప్టెంబర్ 22: జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ ఆధ్వరంలోని రహదారులపై అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేసే వాహనాన్ని కలెక్టర్ విజయమోహన్ గురువారం కలెక్టరేట్ ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల కండీషన్ సర్వే చేయడానికి ఇవాహనం ఉపయోగపడుతుందన్నారు.

09/23/2016 - 22:35

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 22: ఆళ్లగడ్డ నగరక పంచాయతీపై ప్రత్యేక శ్రద్ధ వుంచి మురికిని శుభ్రం చేసి స్వచ్చ ఆళ్లగడ్డ చేయడమే లక్ష్యం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నగడర పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశద్ధ్యంపై దృష్టి సారించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

09/23/2016 - 22:34

ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 22: గ్రామాల అభివృద్ధే టిడిపి ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో రూ.70 లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని, కొన్ని సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక్క టిడిపికే దక్కుతుందన్నారు.

09/23/2016 - 22:34

కృష్ణగిరి, సెప్టెంబర్ 22: మండల పరిదిలోని అలంకొండ గ్రామానికి చెందిన పుండుకూర లవన్న (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం లవన్న తన గ్రామం నుండి స్వంత పని మీద ఆటోలో డోన్‌కు బయలు దేరాడు. కటారుకొండ గ్రామం దాటిన తర్వాత ఆటో డ్రైవరు సడన్‌గా బ్రేక్ వేయడంతో లవన్న ఆటో నుంచి జారీ కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

09/23/2016 - 22:32

కడప, సెప్టెంబర్ 22:గత మూడురోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితం కాగా మరికొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కడప డివిజన్‌లోని అనేక మండలాల్లో గత మూడురోజులుగా పడుతున్న వర్షాలు రైతులను ఆనందింపచేస్తున్నాయి.

09/23/2016 - 22:31

రాజంపేట, సెప్టెంబర్ 22:రాష్ట్రంలో వాయిదా పడ్డ రాజంపేట మున్సిపాలిటీ ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు చేరువ అయ్యేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తుంది. తాజాగా రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రాజంపేట మున్సిపాలిటీలోని 20 వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

09/23/2016 - 22:31

కడప, సెప్టెంబర్ 22:గతనెలరోజులుగా అడప దడప కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పులకు గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, నిధులుంటే పారిశుద్ధ్యం పనులు చేపడతామని నిధులులేక గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పక్కనపెడితే అభివృద్ధే అభివృద్ధి జరగడం లేదని, తమకొచ్చేఅరకొర నిధులతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయలేకపోతున్నామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

09/23/2016 - 22:30

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22: ఆయా యుగాల్లో ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు వివిధ అవతారాలు దాల్చారని జ్ఞాన బ్రహ్మస్వామి స్వామి సుందరచైతన్యానంద అన్నా రు. 290వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మైదానంలో సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

Pages