S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/28/2016 - 12:55

విశాఖ: ఇక్కడి దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ రసాయన కర్మాగారంలో గురువారం ఉదయానికి మంటలు తగ్గుముఖం పట్టాయి. ఈ కర్మాగారంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు రెండురోజులుగా శ్రమించాయి. నేవీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి మంటలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు.

04/28/2016 - 12:54

గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టిడిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఇక్కడ స్వయంగా గాదె ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న దీక్షతో ముందుకు వెళుతున్న చంద్రబాబు నాయకత్వంలో తాను పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

04/28/2016 - 12:54

ఏలూరు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిఇగా పనిచేస్తున్న వివి సత్యనారాయణ భారీగా అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం సత్యనారాయణ, అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేసి పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుడివాడలోనూ ఇతనికి ఆస్తులున్నట్లు కనుగొన్నారు.

04/28/2016 - 12:52

తిరుపతి: ఇక్కడి శివారు ప్రాంతంలోని ఓ భవనంలో పోలీసులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడులు చేసి 17 మంది కూలీలను అరెస్టు చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

04/28/2016 - 12:51

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నీడపట్టునే ఉండాలని సూచించింది. ఒక్క బుధవారం నాడే ఆంధ్రాలో వడదెబ్బకు 41 మంది మరణించారు.

04/28/2016 - 12:51

విజయవాడ: అధికార తెలుగుదేశంలోకి విపక్ష ఎమ్మెల్యేల వలసల జోరు కొనసాగుతోంది. వైకాపాకు చెందిన విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం ఉదయం ఇక్కడ సిఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలో చేరారు. ఉదయం 9-05 గంటలకు మంచి ముహూర్తంగా భావించి బుడ్డా టిడిపి అధినేతను కలిసి కండువా వేయించుకున్నారు.

04/28/2016 - 04:09

తడ/వరదయ్యపాల్యెం, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌కు జపాన్‌తో విడదీయరాని అనుబంధం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రంగాల్లోనూ జపాన్‌తో కలిసి పనిచేస్తామని.. ఏపీలో పెట్టుబడి పెట్టే జపాన్ కంపెనీలకు అన్ని విధాలైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

04/28/2016 - 04:06

విజయవాడ, ఏప్రిల్ 27: ‘జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల కోసం వారి అవమానాలన్నీ భరిస్తున్నాన’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సిఎం నివాసం బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

04/27/2016 - 17:54

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ఇక్కడి ఎపి సచివాలయంలో దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులకు స్నానఘట్టాలు, వసతి సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, ఆలయాల ఆధునీకరణ వంటి పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.

04/27/2016 - 17:53

విశాఖ: రావికమతం మండలం అజేయపురం సమీపంలో 130 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కూలీలు గుర్రాలపై గంజాయి మూటలను తరలిస్తుండగా అడ్డుకున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న ఓ స్మగ్లర్‌ను కూడా అరెస్టు చేశారు.

Pages