S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2016 - 03:18

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడలో నిర్వహించే ఆత్మగౌరవ సభకు తాను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నట్టు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. హోదా కంటే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీయే ఉత్తమమైనదని త్వరలోనే అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని, తొందరపాటు పనికిరాదని అన్నారు.

09/09/2016 - 03:17

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు మంత్రులు ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సవరణ బిల్లులతో పాటు విలువ ఆధారిత పన్ను బిల్లు, ఎక్సైజ్ సవరణ బిల్లును, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

09/09/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ఇంతవరకు రూ. 143.67 కోట్లు ఖర్చయినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
జీవో 94, జీవో 50 ప్రకారం ఇంజనీరింగ్ ప్రొక్యూర్ మెంట్ కన్‌స్ట్రక్షన్ వ్యవస్థ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించినట్లుచెప్పారు.

09/09/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, నిర్మాణానికి ఎంపిక చేసిన స్విస్‌చాలెంజ్ పద్ధతిని సవాలు చేస్తూ దాఖలైన కేసులో పిటిషనర్లు,ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయని, ఈ నెల 12వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లుహైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రకటించారు.

09/09/2016 - 03:15

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్-1, 2 పరీక్షలను పా త పద్ధతిలోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలో చంద్రబాబును కలిసి గ్రూప్-2 పోస్టుల సంఖ్యను 750 నుంచి 3వేలకు పెంచాలని కోరారు.

09/09/2016 - 03:11

హైదరాబాద్, సెప్టెంబర్ 8:్ఢల్లీలో కేంద్రం, రాష్ట్రంలో చంద్రబాబు కలిసి లక్షలాది యువకుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేశారని విపక్ష నేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తమ బతుకులు బాగుపడతాయని యువత ఆశించిందని, వారి ఆశలపై అటు కేంద్రం, ఇటు చంద్రబాబు కూడా నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును అయోమయంలో పడేశారన్నారు.

09/08/2016 - 18:08

విజయవాడ: విశాఖకు రైల్వేజోన్, కడప జిల్లాకు స్టీల్‌ప్లాంట్‌ను మంజూరు చేయాల్సిందేనని బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు గురువారం అన్నారు. ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్రం తాజాగా ప్రకటించడం అభినందనీయమని, ఆ ప్యాకేజీని వెంటనే అమలు చేయాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

09/08/2016 - 18:08

హైదరాబాద్: రాజకీయంగా తనను ఎదుర్కొనలేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు దొడ్డిదారిన అన్యాయంగా విభజించారని సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు, కేంద్ర సాయం వంటి అంశాలపై ఆయన ప్రసంగిస్తుండా రామచంద్రయ్య అడ్డుతగిలారు.

09/08/2016 - 18:07

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీలో నాలుగు విషయాలపై స్పష్టత వచ్చిందని సిఎం చంద్రబాబు శాసనమండలిలో గురువారం తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడంలో కేంద్రం నుంచి కొంత ఆలస్యం జరిగిందన్నారు.

09/08/2016 - 17:32

విజయవాడ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఈనెల 10న జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తూ కూడా ప్రత్యేక హోదాపై నిలదీయకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటే కేంద్ర మాత్రం ఎపి ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.

Pages