S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/24/2017 - 06:38

కాకినాడ, ఏప్రిల్ 23: ఎపి ఎంసెట్-2017ను సోమవారం నుంచి నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాకినాడ జె ఎన్‌టియు పర్యవేక్షణలో మొత్తం 267 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్-2017కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జెఎన్‌టియులో సోమవారం ఉదయం విడుదలచేస్తారు.

04/23/2017 - 04:05

విజయవాడ, ఏప్రిల్ 22: దేశంలోని చేనేత, హస్త కళాకారులందరికీ ప్రత్యక్షంగా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీచేస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.

04/23/2017 - 04:03

నంద్యాల, ఏప్రిల్ 22: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్నేహపూర్వక పోలీసు వ్యవస్థకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పోలీసుల వసతి గృహాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్నారు.

04/23/2017 - 04:01

మచిలీపట్నం, ఏప్రిల్ 22: ఇంజనీరింగ్, మెడిసిన్ ఒక్కటే జీవితం కాదని, అంతకన్నా ఉన్నతమైన కోర్సులు మన దేశంలో ఉన్నాయని, వాటి పట్ల విద్యార్థులు మక్కువ కనబర్చి ప్రయోజకులు కావాలని రాష్ట్ర గవర్నర్, విశ్వ విద్యాలయాల కులపతి ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు.

04/23/2017 - 03:59

అనంతపురం, ఏప్రిల్ 22 : రాయలసీమ రైతుల పాలిట వరప్రదాయిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రధాన కాలువ ఫేజ్-1ను వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వడంతో సీమ రైతుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా నిత్య కరవు కాటకాలతో కునారిల్లుతున్న అనంతపురం జిల్లాకు హంద్రీనీవా కాలువ వెడల్పు ద్వారా సాగు, తాగునీరు లభించి అత్యంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

04/23/2017 - 03:58

విశాఖపట్నం, ఏప్రిల్ 22: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని, కాంగ్రెస్ నాయకుడు, సామాజిక వేత్త బొలిశెట్టి సత్యనారాయణ (సత్య) ఆరోపించారు. విశాఖలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)ని తప్పుదోవ పట్టించిందన్నారు.

04/23/2017 - 03:03

అమరావతి, ఏప్రిల్ 22: ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ధిపొందేలా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రష్యాలోని చెల్యాబినిస్క్ ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చాయి. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి వరి, మామిడి, మసాలా దినుసులు, సిరామిక్ తదితర ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

04/23/2017 - 03:00

విజయవాడ, ఏప్రిల్ 22: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతుల కోసం ఈనెల 20 తేదీ నుంచి అన్ని రకాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయటంతో చిరు వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా సిఎం నివాస గృహం ఉన్న కరకట్ట పరిసరాల్లో పండే అరటి, పలు రకాల పండ్లు, కూరగాయలు విజయవాడ మార్కెట్‌కు తరలించడానికి సామాన్య రైతులు ఎనె్నన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.

04/23/2017 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 22: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్వరి చేరికతో తూర్పుగోదావరి జిల్లాల్లో పార్టీకి మరింత బలం పెరుగుతుందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

04/23/2017 - 02:55

పార్వతీపురం, ఏప్రిల్ 22: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలం బందుగాం పంచాయతీ బొరిగి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు పీడిక రథు (42)ను శనివారం వేకువ జామున 4 గంటల సమయంలో మావోయిస్టులు దాడి చేసి హతమార్చారు. ఈదాడిలో దాదాపు 40 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో రథును ఇంటి బయటకు తీసుకువచ్చి కొట్టి హతమార్చినట్టు తెలుస్తోంది.

Pages