S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/29/2017 - 04:30

శ్రీకాకుళం, జనవరి 28: వైకాపా అధినేత జగనే తన పసుపు కుంకాలు తీసేసాడని పౌర సరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత ఆరోఫించారు. శనివారం ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో ఆమె మాట్లాడుతూ పరిటాల రవిని హత్య చేసింది జగన్ కుటుంబీకులేనని, అతను ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం చెప్పారు.

01/29/2017 - 04:29

విజయనగరం, జనవరి 28: రాష్ట్రంలోని విద్యార్థులకు, యువతకు క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలను నెలకోల్పుతామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 37 క్రీడావికాస కేంద్రాలు పూర్తయ్యాయని, మరో 18 వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఏడాది మరో 60 క్రీడా వికాస కేంద్రాలను ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు.

01/29/2017 - 04:29

భద్రాచలం, జనవరి 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా సమీపంలోని ఢోల్‌కల్ పర్వతంపై ఉన్న గణేశ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన నేపథ్యంలో శనివారం అరుణ్‌శర్మ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. బృందం నేరుగా ఫర్సాపాల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు ఏర్పాటు చేసి, వివరాలు సేకరించింది.

01/29/2017 - 04:28

అమరావతి, జనవరి 28: పేద ప్రజలకు జనరిక్ ఔషధాలను తక్కువ ధరకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్న సంజీవిని ప్రభుత్వ జనరిక్ మందుల షాపులు సత్ఫలితాలిస్తున్నాయి. 2016 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 నాటికి రూ.17 కోట్ల 71లక్షల 46వేల 711 మొత్తానికి మందుల విక్రయాలు జరిగాయి. ఇవే మందులు సాధారణ మెడికల్ షాపుల్లో కొంటే ఐదు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

01/29/2017 - 03:45

ఆదోని, జనవరి 28: హిందూ దేవాలయ వ్యవస్థపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో జరిగిన సంఘటన దీనికి బలం చేకూరుస్తోందన్నారు. తిరుమలలో ఓ ముస్లిం వ్యాపారి నమాజు చేయగా అధికారులెవరూ పట్టించుకోలేదన్నారు.

01/29/2017 - 03:40

విజయవాడ, జనవరి 28: జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల ప్రచారంలో భాగంగా ఆర్‌టిసి బస్టాండులు, బస్సులు, ఇతర ప్రాంతాల్లో ప్రచారాన్ని చేపడుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర అతిధి గృహంలో శనివారం జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ, జిల్లా కలెక్టర్ బాబు. సదస్సు సమన్వయకర్త రామలక్ష్మి, కార్పొరేటర్ షేక్ షహారాబానులతో కలిసి సమావేశాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

01/29/2017 - 03:39

విజయవాడ (క్రైం), జనవరి 28: బాలల హక్కుల రక్షణ బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జువెనైల్ జస్టిస్ యాక్టు 18ఏళ్లలోపు పిల్లలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు.

01/29/2017 - 03:36

పోలవరం, జనవరి 28: పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సిడబ్ల్యుసి ఛైర్మన్ పరమేశ్వరన్ శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఉదయమే చేరుకున్న ఛైర్మన్ బృందానికి ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు స్వాగతం పలికారు.

01/29/2017 - 03:34

మంగళగిరి, జనవరి 28: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప అన్నారు.

01/29/2017 - 03:33

విజయవాడ, జనవరి 28: విశాఖలో జరుగుతున్న రెండో భాగస్వామ్య సదస్సుకు గత ఏడాదికన్నా రెట్టింపు స్పందన లభించిందని ఎపి ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ సి.కుటుంబరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాదిలో 328 ఎంవోయులు కుదరగా, అందులో 42 శాతం వాస్తవరూపం దాల్చాయన్నారు. పెట్టుబడులు 42 శాతం ఉన్నాయన్నారు.

Pages