S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/05/2016 - 05:09

విజయవాడ, ఆగస్టు 4: ప్రత్యేక హోదా కోసం ఎవరినీ యాచించనవసరం లేదని, అది ఎపి ప్రజల హక్కు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ అజీజ్ పాషా, జల్లి విల్సన్, జి ఓబులేసు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతో కల్సి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

08/05/2016 - 05:08

తిరుపతి, ఆగస్టు 3: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సౌకర్యం అందజేయడానికి తమ కమిషన్ మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర శాసనసభ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగిత వెంకటరావు తెలిపారు.

08/05/2016 - 05:08

విశాఖపట్నం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు త్వరగా వేతనాలు చెల్లించడం ద్వారానే ఆ పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి తెలిపారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వద్దని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై 3వ అంతరాష్ట్ర అవగాహన సదస్సును ఆమె విశాఖలో గురువారం ప్రారంభించారు.

08/05/2016 - 05:03

విజయవాడ, ఆగస్టు 4: పుష్కరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమర్థత నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాత్రికుల సేవకు, ప్రజా సేవకు కృష్ణా పుష్కరాలు ఒక అవకాశం అని అన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు.

08/05/2016 - 05:03

విశాఖపట్నం, ఆగస్టు 4: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రప్రథమంగా మహిళ తొలిసారిగా గూడ్స్ గార్డుగా విధుల్లో చేరి వార్తల్లో నిలిచారు. విశాఖ మర్రిపాలెం మార్షలింగ్ యార్డు నుంచి రాయగడకు వెళ్ళే గూడ్స్‌రైలులో ఆమె గార్డుగా గురువారం విధులు ప్రారంభించారు.

08/05/2016 - 04:21

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద ఉద్ధృతి పెరిగింది..గోదావరి ప్రవాహం పెరిగి వడివడిగా సముద్రంలోకి మళ్లుతోంది భక్త జనం అదే ఉరవడిలో అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చారు. అంత్య పుష్కరం గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్ధేశించిన అన్ని ఘాట్లలో సుమారు ఐదు లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించారు.

08/05/2016 - 04:19

నెల్లూరు, ఆగస్టు 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు.

08/04/2016 - 18:23

విజయవాడ: ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఇతర పార్టీలతో పాటు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు ఇపుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే చట్టాలను సవరించైనా ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అవసరాల మేరకు మార్చడం కొత్తేమీ కాదన్నారు.

08/04/2016 - 18:22

ఏలూరు: ఎపికి ప్రత్యేక హోదా కావాలని టిడిపి ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండగా ఇందుకు విరుద్ధంగా ఎపి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

08/04/2016 - 18:15

హైదరాబాద్‌: జీఎంఆర్‌ సంస్థ విజయ్‌మాల్యాపై పెట్టిన రెండు చెక్‌ బౌన్స్‌ కేసులను సెప్టెంబర్‌ 2వ తేదీకి వాయిదా వేశారు. రూ.50లక్షలు విలువైన రెండు చెక్‌ బౌన్స్‌కేసుల్లో మాల్యా మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించారు. శిక్షకు సంబంధించిన తీర్పు ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ కేసులో విజయ్‌మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. కానీ వీటిని అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.

Pages