S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2016 - 08:01

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రివిల్లేజస్ కమిటీ ముందుకు హాజరవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో మంగళవారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు.

03/23/2016 - 08:00

హైదరాబాద్: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆల యం, విజయవాడ కనకదుర్గ గుడి అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలపై సిఎం చంద్రబాబునాయుడు సచివాలయంలో సమీక్షించారు. శ్రీశైలం ఆలయాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని, కృష్ణా పుష్కారాలలోగా ప్రణాళికలు అమలు జరగాలని ఆదేశించారు. శ్రీశైలం ఆలయం కేంద్ర బిందువుగా సమీపంలోని ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో నాలుగు లేదా ఐదు టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని కోరారు.

03/23/2016 - 05:39

హైదరాబాద్: ఈ నెల 29,30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించే సమయంలో సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ వైకాపా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంగళవారం విప్ జారీ చేసింది. పలమనేరు ఎమ్మెల్యే, పార్టీ విప్ ఎన్ అమరనాథ్ రెడ్డి పేరిట ఈ విప్ జారీ అయింది. 29,30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు వచ్చే సమయంలో సభలో ఉండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

03/23/2016 - 05:35

విజయవాడ: 3అమరావతి2కి శంకుస్థాపన జరిగే వరకూ రాజధాని నిర్మాణాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్న విదేశీ కంపెనీలు ఇప్పడిప్పుడే తమ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అమరావతి నిర్మాణంలో కీలక భాగస్వాములమవుతామన్న సింగపూర్ ప్రతినిధులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. శంకుస్థాపనకు ముందే జపాన్ అమరావతి గురించి భారత విదేశీ వ్యవహారాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

03/23/2016 - 05:31

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో లేబర్ కోర్టు(ట్రిబ్యునల్) ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వచ్చినప్పుడు లేబర్ కోర్టు సత్వర న్యాయం జరగడం లేదనే అభిప్రాయం కార్మికుల్లో ఉందన్నారు. దేశ వాప్తంగా 22 ట్రిబ్యునల్స్ ఉంటే 22 వేల కేసులు పెండింగ్‌లోఉన్నాయన్నారు.

03/23/2016 - 05:23

అనంతపురం/కడప, మార్చి 22 : రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ తీవ్రతకు సీమ జిల్లాల్లో రోడ్లు నిప్పులకొలిమిని తలపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కర్నూలు జిల్లా అవుకు, కడప జిల్లా చిట్వేలు మండలాల్లో మంగళవారం 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడబెబ్బకు ఐదుగురు మృతి చెందారు. కడప జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లా తెనాలిలో ఒకరు మృతి చెందారు.

03/23/2016 - 05:22

విజయవాడ, మార్చి 22: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి నివాసముంటున్నవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజధాని విజయవాడ నగరంలో మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపచేస్తామంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు.

03/23/2016 - 05:20

చింతూరు, మార్చి 22: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులను మంగళవారం హతమార్చారు. వివరాలిలావున్నాయి. సుకుమా జిల్లా సోలంపల్లి గ్రామానికి చెందిన కిచ్చే ముక్కా (42) పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా మావోయిస్టులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. ముక్కా గతంలో మావోయిస్టులను ఏరివేసేందుకు ఏర్పడిన సల్వాజుడుంలో పనిచేశాడు.

03/23/2016 - 05:20

కాకినాడ, మార్చి 22: ఎపి ఎంసెట్-2016కు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తుచేసుకునే అవకాశాన్ని ఉన్నత విద్యామండలి కల్పించింది. ఎపి ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవతో ఈనెల 24వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఎపి ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ‘మంగళవారం తెలిపారు.

03/23/2016 - 05:19

కాకినాడ, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్టాలతో పని లేదని, పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటనే ఒక చట్టమని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వడం ఒక్కటే మార్గమన్నారు.

Pages