S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2016 - 02:24

మైదుకూరు, మార్చి 24: పదవ తరగతి పరీక్ష జరుగుతుండగా తల్లి మరణించడంతో విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా టీచర్లు ఆ విషయాన్ని పరీక్ష రాయించారు. ఈ సంఘటన గురువారం కడప జిల్లా మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. మైదుకూరు మండల పరిధిలోని విశ్వనాథపురం పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన కొవ్వూరు రఫి గత కొనే్నళ్లుగా మైదుకూరు పట్టణంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు.

03/25/2016 - 02:23

విజయవాడ, మార్చి 24: యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మండల స్థాయిలో నిరుద్యోగుల డేటా సేకరించాలని ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల సమక్షంలో ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

03/25/2016 - 02:23

కడప, మార్చి 24: రాయలసీమలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకురానుందని రాష్ట్ర డిజిపి జెవి రాముడు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి టాస్క్ఫోర్స్, సిసి కెమెరాలు, డాగ్‌స్వ్కాడ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిజిపి రాముడు గురువారం కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

03/25/2016 - 02:22

కడప, మార్చి 24: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం అన్నివిధాలా కష్టాల్లో ఉందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు కాపుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను టిడిపిలో చేరానని కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట మాజీ ఎంపి ఏ.సాయిప్రతాప్ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘ఆంధ్రభూమి’తో ఫోన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారన్నారు.

03/25/2016 - 02:21

మార్కాపురం టౌన్/పొదిలి, మార్చి 24: ముష్కరులు దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు పాల్పడుతున్నారని, దేశ విచ్ఛిన్నతకు పాల్పడుతున్న ముష్కరులకు బుద్ధిచెప్పి సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బిజెపి జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి అన్నారు.

03/25/2016 - 02:20

తిరుపతి, మార్చి 24: టిటిడి సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రవణం అతి ముఖ్యమైందని, వినికిడి లోపంతో ఉన్న మూడు సంవత్సరాల్లోపు పిల్లలు ఎంతమందికైనా ఈ ప్రాజెక్టులో అడ్మిషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని టిటిడి ఇఒ డి సాంబశివరావు అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర వినికిడిలోపం ఉన్న చిన్నారుల శిక్షణ సంస్థ పదో వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది.

03/25/2016 - 02:19

పలాస, మార్చి 24: ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధి సూదికొండ ప్రాంతానికి చెందిన కోతి మహేంద్ర (11), వడ్ల కార్తీక్ (10) జయరామచంద్రపురంలోని కీర్తిసాగరంలో గురువారం మునిగి మృతి చెందినట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ సురేషు తెలిపారు.

03/25/2016 - 02:18

వాల్మీకిపురం, మార్చి 24 : సంబంధం లేని కేసులో విచారణ, అంతకుమించి పోలీసులు పదేపదే ఒత్తిళ్లు తీసుకురావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఓ నిందితుడి విషయమై వాల్మీకిపురానికి వచ్చారు.

03/25/2016 - 01:56

హైదరాబాద్, మార్చి 24: రాయలసీమలో మంచి పేరున్న వ్యక్తి , రాజంపేట నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎంపిగా ఎన్నికైన ఎ సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు.

03/25/2016 - 01:37

గుంటూరు, మార్చి 24: పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి లా పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డారు. గురువారం గుంటూరు నగరంలోని ఎసి న్యాయ కళాశాలలో జరిగిన లా మొదటి సంవత్సరం చివరి పరీక్ష సందర్భంగా ఈ సంఘటన జరిగింది. మస్తాన్‌వలితోపాటు, బిజెపి నాయకుడు భాస్కరరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎస్‌కె జిలానిలు మిగిలిన అభ్యర్థులతో కలిసి ఒకే గదిలో పరీక్షలు రాస్తున్నారు.

Pages