S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

03/08/2016 - 05:17

దేశ ప్రయోజనాల దృష్టా ఇస్రత్ జెహాన్ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

03/01/2016 - 06:26

పార్లమెంటు ఉభయ సభలు చాలా సంవత్సరాల తరువాత సజావుగా కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు గత వారం 23 తేదీ ప్రారంభమైన నాటి నుండి అత్యంత ముఖ్యమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంతోపాటు ఇతర అన్ని కార్యకలాపాలు వాడి,వేడి చర్చలతో ముందుకు సాగటం ముదావహం. గత మూడు, నాలుగు సంవత్సరాల నుండి పార్లమెంటు ఉభయ సభలు సజావుగా జరగటం లేదు.

02/15/2016 - 23:30

దేశం కోసం సియాచిన్‌లో పహరాకాస్తూ మంచు తుపాను కారణంగా 25 అడుగుల లోతు మంచులో కూరుకుపోయిన వీర సైనికుడు హనుమంతప్ప ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే సరిగ్గా అదేరోజు రాత్రి ప్రతిష్టాత్మక జె.ఎన్.యు క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులు హిందుస్తాన్ ముర్దాబాద్, అఫ్జల్‌గురు జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తున్నారు.

02/09/2016 - 05:39

మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లే కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించినంత మాత్రాన రాజకీయంగా ఎదగవచ్చని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన వ్యూహకర్తలు భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. రాహుల్ గాంధీ చాలా కాలం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ రాజకీయ దాడి చేస్తున్నారు.

02/02/2016 - 01:36

కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చండీపై అవినీతి ఆరోపణలు రావటం పెద్దగా ఆశ్చర్యపడవలసిన విషయం కానేకాదు. ఎందుకంటే మన దేశంలో అవినీతికి పాల్పడని ముఖ్యమంత్రులు లేరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మీకు అబ్దుల్ రహామాన్ అంతూలే జ్ఞాపకం ఉండే ఉంటారు. అవినీతి ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అబ్దుల్ రహమాన్ అంతూలే. అంతూలే చేసిన ఆవినీతితో పోలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రులు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు.

01/27/2016 - 03:24

ప్రతి అంశాన్ని ప్రతికూల రాజకీయాల కోసం దుర్వినియోగం చేయటం మన రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలం పరిశోధనా విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనను కూడా మన నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు తప్ప సమస్యను లోతుగా పరిశీలించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించలేదు.

01/18/2016 - 23:45

విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగా నిర్వహించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఇదే విధానం కొనసాగింది. ఇజ్రాయిల్‌తో స్నేహం చేస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారని కాంగ్రెస్ భయపడింది. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్‌తో స్నేషం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

01/12/2016 - 06:58

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జైషె మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం అసాధ్యమనే అభిప్రాయం మరింత బలపడుతోంది.

01/05/2016 - 04:48

ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా పార్టీ సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించినంత కా లం వామపక్షాలకు మోక్షం లేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ప్లీనంలో లోతు గా ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ వ్యవస్థల్లో సమూల మార్పులు చేయటంలోనూ,వ్యూహాన్ని మార్చుకోవటంలో సీపీఎం విఫలమైంది.

12/28/2015 - 22:51

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న సాహస దౌత్యం ఆశించిన ఫలితాలు ఇస్తుందా? హిందూత్వవాదిగా ముద్ర పడిన నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు నేల విడిచిసాము చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Pages