S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/12/2018 - 00:02

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మావోయిస్టుల హడావుడి ఉంటుందని ప్రచారం జరిగినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన 13 నియోజకవర్గాలలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరగడం గమనార్హం.

12/09/2018 - 02:35

చెన్నైకి చెందిన శ్రవణ్, సంజయ్ అనే బడిపిల్లలు ‘్ఫర్త్ డైమెన్షన్’ అన్న కంపెనీకి సీఈఓలుగా పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ డిజైన్లు చేస్తూ అనేక అప్లికేషన్లు సిద్ధం చేస్తున్నారు. యాపిల్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు వాటిని విక్రయిస్తూ ఈ ఇద్దరూ శ్రీమంతులవుతున్నారు.

12/06/2018 - 23:56

గత కొన్నివారాలుగా మన దేశంలో ఉష్ణతాపం గణనీయంగా పెరిగింది. వర్షపాతం అనూహ్యంగా వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా తగ్గిపోయింది. వర్షాకాలం ఎండాకాలాన్ని తలపించడంతో ప్రజలు వేడిని భరించలేక మలమల మాడిపోతున్నారు. భూఉష్ణోగ్రత 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకూడదని పర్యావరణ శాస్తవ్రేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టడం భూతాపానికి ప్రధాన కారణం. వాతావరణ అసమతుల్యతకు మానవ తప్పిదమే కారణం.

12/06/2018 - 23:55

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుచెబితే చాలు అందరి హస్తాలు ముకులితమై నమస్కరిస్తాయి. ఆయన ఆలోచనాపథాన్ని గుర్తుచేస్తే చాలు అగ్రవర్ణ కాఠిన్యులు కూడా ‘బడుగుజీవుల ఉద్దరణ’ కోసం మాట్లాడతారు. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకూ అంబేద్కర్ జయంతి సభలను బడుగు వర్గాలవారు జరిపేవారు. వెలివాడలోనో, నాలుగురోడ్ల కూడలిలోనో ఉన్న ‘చూపుడు వేలు’ దగ్గరికి వెళ్ళి స్తుతించేవాళ్ళు. నివాళులర్పించేవాళ్ళు.

12/02/2018 - 00:23

‘రాజుకంటే మొండివాడు ఘనుడు’ అని సామెత. కానీ కాంగ్రెస్ చరిత్ర చూస్తే ప్రజావాక్యం కంటే పార్టీ అధినాయకత్వమే ఘనమనే కొత్త సామెత లాంటి ఒక దౌర్భగ్య నిర్ణయానికి మనం రావాల్సొస్తుంది.

12/01/2018 - 00:54

ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నిక కావడాన్ని ప్రజాస్వా మ్యం’ అంటారని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఏనాడో సెలవిచ్చారు. ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పాలన సాగిస్తున్నాయి. మన దేశంలో కూడా వంశానుక్రమ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు వచ్చాము. దేశ, రాష్ట్ర అభివృద్ధి అనేది అక్కడ వుండే పాలకుడు (ప్రధాని లేదా ముఖ్యమంత్రి) మీద ఆధారపడి ఉన్నది.

11/30/2018 - 00:18

(నేడు జగదీశ్‌చంద్ర బోస్ జయంతి.....)

11/27/2018 - 23:08

బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించండి’ అని మావోయిస్టు పార్టీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ప్రచారం చేస్తోంది. కరపత్రాలు పంచుతూ, బ్యానర్లు కడుతూ మావోయిస్టులు తమదైన శైలిలో ముందుకు పోతున్నారు. ప్రజలను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ రకమైన ప్రచారం, ఎత్తుగడ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.

11/27/2018 - 01:47

మానవులకు ఏవైనా కష్టాలు వస్తే వారు దేవుడికి మొరపెట్టుకుంటారు. మరి దేవుడే కష్టాలు కలిగిస్తే ఏమవుతుంది? ఇంకెవరికి చెప్పుకోవాలి? దేశంలో ఎక్కడైనా భారీగా అవినీతి ఆరోపణలు వస్తే- వాటిలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సిబిఐ) రంగంలోకి దిగుతుంది. ఐతే- సిబిఐలోనే అవినీతి వ్యవహారం రచ్చకెక్కితే ఇంకెవరికి చెప్పుకోవాలి...?

11/25/2018 - 01:06

‘ప్రజా గాయకుడు’ గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి భంగపాటు ఎదురయింది. వ్రతం చెడినా అతనికి ఫలితం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌కు కొంత ప్రచారం చేసినా అంతిమంగా ఆయనకు మొండి ‘చెయ్యి’ మిగిలింది. తనకుతాను అతిగా ఊహించుకుని గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించినా, నామినేషన్ వేసే అవకాశం మాత్రం రాలేదు.

Pages