S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/28/2017 - 02:05

ఏ దేశంలోనైనా ఆర్థికాభివృద్ధికి మూలధనం, శ్రామిక శక్తి, సాంకేతిక విజ్ఞానం అవసరం. అభివృద్ధి ఫలాలు అర్హులకు అందాలంటే సుపరిపాలన అనివార్యం. దారిద్య్ర నిర్మూలన, ఉపాధి కల్పన కార్యక్రమాలపై మన దేశం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా, ఈ సమస్యలు ఇంకా తొలగిపోలేదు. దీనికి ప్రధాన కారణం కార్యక్రమాల అమలులో లోపాలే. సుపరిపాలనను కచ్చితంగా అందించకపోయినా దీనిపై మనకు కొంత అవగాహన ఉంది.

06/24/2017 - 01:02

ఏ దేశం అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యం, అక్షరాస్యతలపై ఆధారపడి ఉంటుంది. దేశాభివృద్ధిలో విద్య, వైద్య రంగాలు అత్యత కీలక పాత్ర వహిస్తాయి. ఈ రెండు రంగాలలో ప్రభుత్వ పెత్తనం ఎంతగా ఉంటే విద్య, వైద్య సౌకర్యాలు ప్రజలకు అంతగా అందుబాటులో ఉంటాయి. విద్య, వైద్య రంగాలలో పెట్టే పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ఆదాయం లభించదు. పరోక్షంగా లభించే ఆదాయం వేలకోట్ల రూపాయలలో వుం టుంది.

06/21/2017 - 01:46

దేశ ఆర్థిక వ్యవస్థలో పొదుపును, పెట్టుబడులను పెంచడంలో బ్యాంకులదే కీలకపాత్ర. బ్యాంకుల జాతీయకరణ లక్ష్యం కూడా ఇదే. సామాజిక రంగంలోనూ బ్యాంకులు పేదలకు అనేక కార్యక్రమాలు అమలు చేశాయి. అయితే, ఇటీవల ఈ దిశగా ప్రగతి మందగించింది. బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగాయి.

06/18/2017 - 01:25

‘హ్యాపీ బర్త్‌డే’ అనగానే గుర్తు వచ్చేది ‘కేక్’. చిన్నాపెద్దా అని తేడా లేకుండా పుట్టిన రోజున ‘కేక్’ కట్ చేయడం ఆంగ్లేయులు నేర్పించిన అ లవాటుగా చెప్పుకోవ చ్చు. ఈ నెల 16న కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు బర్త్‌డే అ యినప్పటికీ ‘కేక్’ కట్ చేయనని ఆయన భీ ష్మించుకుని కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రె డ్డి (జగ్గారెడ్డి) విహెచ్‌కు ‘బొకే’ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

06/17/2017 - 02:05

చిన్నారుల్లో ఊబకాయానికి సంబంధించి ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానం ఆక్రమించింది. భారత్‌లో 14.4 మిలియన్ల మంది పిల్లలు వయసుకు మించిన బరువుతో సతమతమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. పిల్లల్లో ఊబకాయానికి సంబంధించి ప్రస్తుతం చైనా మొదటి స్థా నంలో నిలిచింది. అధిక బరువు కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రెండు బిలియన్లు దాటింది.

06/15/2017 - 01:30

ఇది డిజిటల్ యుగం. ఈనాటి తరానికి భిన్నమైన నైపుణ్యాలు అవసరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను వాడుతున్న సెల్‌ఫోన్ పాడైంది. అది మా అచ్చుకు ఇచ్చి దాన్ని సరిచేయమన్నాను. అచ్చు కూడా ఆ పని చేయలేకపోయాడు. అచ్చు చిన్నకొడుకు ఆ సెల్‌ను మా చేతుల్లోంచి గుంజుకున్నాడు. దాన్ని ఏం చేశాడో తెలియదు. ‘ఇదిగో.. సెల్ బాగైంద’ని రెండు నిమిషాల్లో నా చేతుల్లో పెట్టాడు.

06/13/2017 - 00:38

ఒక అనర్గళ సాహతీ గళం మూగవోయింది
ఒక కవితా క్షేత్ర కృషీవల హలం ఆగిపోయింది
ఒక సాహితీ సవన జ్వాల ఆరిపోయింది
ఒక రసధునీ ప్రవాహం శుష్కించిపోయింది
ఒక మధుర మకరంద మందారం గగనానికి ఎగిరిపోయింది
ఒక సరస సాహితీ సరస్వతీ పుత్రుడు పరమపదించాడు
కఠిన, కర్కశ కాలం కరుణమాలి కాటేసింది
సాహితీ బంధువులకు విషాదాన్ని మిగిల్చింది
అయితేనే ఆ కవి ఆత్మబలం అపారం

06/10/2017 - 00:27

వ్యవసాయం నష్టదాయకంగా మారడంతో తమ సమస్యలు తీర్చాలంటూ ఇపుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఉద్యమబాట పట్టారు. మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

06/08/2017 - 00:36

పసిపిల్లలు ఏ స్కూలుకూ వెళ్లకుండానే తమ ప్రయత్నంలోనే కొం త జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానమే సమాజం ఇచ్చిన కానుక. దానినే ‘నేచురల్ క్యాపిటల్’ అంటాము. ఏ బడికీ వెళ్లకుండా ఒక భాషలో తన భావాన్ని వ్యక్తీకరించటం వల్ల ఆ పిల్లవానికి, సమాజానికి మధ్య వంతెన ఏర్పడినట్టే కదా! ఈ వంతెన ‘ఇంజనీరింగ్’కు కారకుడు ఎవరిని అడిగితే ఈ బిడ్డే కదా! కేవలం ఒక భాష మాత్రమే నేర్చుకోవటం లేదు.

06/07/2017 - 00:01

మన దేశంలో గోవు లేదా గోజాతికి చెందిన పశువుల వధ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. వీటి మాంసాన్ని విదేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావానే్న చూపిస్తోంది. పశువధ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఎద్దు మాంసం తినే వారి సంఖ్య పెరగడంతో కలిగే దుష్ప్రరిణామాలలో పచ్చని భూములు ఎడారులుగా మారిపోవడం కూడా ఒకటి. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు.

Pages