S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

06/10/2016 - 21:07

పనస తొనలు సువాసనగానే కాకుండా ఎంతో రుచిగా ఉంటాయి. తొనలు బంగారపు రంగులో ఉంటాయి. అవి ఆరోగ్యకరమే కాక, అనారోగ్య నివారణకు ఔషధంలా ఉపయోగిస్తాయి. పనసకాయ పొట్టులోనూ, పనసపండు తొనలలోనూ పోషక పదార్థాలు లభిస్తాయి.

06/09/2016 - 00:46

పెద్ద రేగుపండు వలే నిగనిగలాడుతూ కనిపించే ఆల్‌బుకరా పండు సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. దీన్ని ప్లమ్ అంటారు. ప్లమ్‌కేక్‌లో ఈ పండు వాడతారు. ఎండిన ఆల్‌బుకరా పండు డ్రైఫ్రూట్‌గా వాడతారు. తాజా పళ్ళు ఎరుపు రంగులో ఉండి, రుచిగా ఉంటాయి. డ్రైఫ్రూట్ గోధుమ రంగులో వుంటుంది. దీనిలోపలి గింజ బాదంను పోలి వుంటుంది. ఈ పండ్లలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

06/01/2016 - 22:13

వేసవికాలంలో పుచ్చకాయలకు మంచి గిరాకీ వుంటుంది. శరీరానికి చల్లదనం కలిగించటమే కాక దాహార్తిని కూడా ఈ పుచ్చకాయ తీరుస్తుంది. అంతేకాక, చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి పుచ్చకాయ ఎంతో మంచిది. ఒక కప్పు పైతొక్క, గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, ఒక చెంచా కలబంద జెల్ తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకుని రెండు నిముషాలపాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల ముఖ కాంతి పెరిగి వెలిగిపోతున్నట్లవుతుంది.

05/31/2016 - 23:24

పాలు సంపూర్ణమైన ఆహారం. ఇది అక్షరాల నిజం. చంటి పిల్లలనుంచి వృద్ధులవరకు అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో వివిధ రకాల పోషక పదార్థాలు విరివిగా లభించడమే దీనికి కారణం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వారి సిఫారసు మేరకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 283 గ్రాముల పాలు తీసుకోవాలి. పాలు మానవ శరీరానికి పోషకాల ఖని.

,
05/28/2016 - 23:13

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఎర్రటి ఆవకాయ, ఇంత నెయ్య వేసుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. దీనికిసాటి మరొకటి రాదు. ఆవకాయ లేనిదే ముద్ద దిగినవారెందరో ఉన్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఆవకాయ పెట్టుకోవటం తెలుగిళ్ళల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ కాలంలో దొరికే మామిడి, మునగ కాయలతో వివిధ రకాల ఆవకాయలు ఇలా పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.

05/27/2016 - 21:27

మునగ చెట్టును పెరట్లో పెంచడం వలన ప్రయోజనమే. మునగ ఆకు పప్పుకూరలో వాడడం ఎంతో శ్రేయస్కరం. మునగఆకు ఆకు కూరగా ఉపయోగించడం మంచిదే. విటమిన్ ఏ, మరియూ కంటికి మేలు చేసే గుణం మునగ ఆకులో మెండుగా వున్నాయి. ఆకులో విటమిన్-సి, కాల్షియం అధికంగా ఉన్నాయ. తాజా మునగకాయలో సైతం విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా వున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇవి శరీరానికి మేలు చేస్తాయ.

05/22/2016 - 00:00

మామిడికాయ సీజన్ వచ్చిదంటే పచ్చి పచ్చడి, ఉరువు పచ్చడి, మామిడికాయ పప్పు, తియ్యమామిడి పులుసు, పులిహోర, వడ తప్పనిసరిగా వండుతారు. స్వీట్సులో అయితే బంగినపల్లి మామిడితో హల్వ, ఖీర్, బట్టర్ షేక్, యోగర్ట్ చేస్తారు.

మామిడికాయ పచ్చడి

05/20/2016 - 22:05

ప్రకృతి వరప్రదాయినీ, ఎండవేడిమికి సరైన ప్రత్యామ్నాయం తాటిముంజల సీజన్ వచ్చేసింది. శరీరానికి ఎంతో మేలు చేసే ముంజలు ఇప్పుడు సిటీ అన్ని ఏరియాల్లోనూ అందుబాటులోకి వచ్చేసాయి. ఎండనుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే తాటిముంజలను తినడంలో అసలు మజా ఉంది. చెక్కిన ముంజలకు రెండు లేదా మూడు కన్నులు ఉంటాయి. వీటిని మన బొటనవేలితో పొడుచుకుని తినాలి. ముంజల రసం బట్టలమీద పడిందంటే మరకపడిపోతుంది.

05/14/2016 - 23:07

అనాసపండ్ల ముక్కలు
- 2 కప్పులు
పంచదార - 1/2 కప్పు
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - చిటికెడు
ఐస్ ముక్కలు - కాసిన్ని
దానిమ్మ గింజలు -
1/2 కప్పు
తేనె - 1/2 కప్పు

05/14/2016 - 23:05

అనాసపండ్ల ముక్కలు - 12
జిలేబీ పిండి -
2 కప్పులు
మైదాపిండి - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
పంచదార - 1 కప్పు
యాలకులు - 5
నూనె - 250 గ్రా.
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 5 చెంచాలు

Pages