S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

09/18/2018 - 19:20

‘ఎందుకమ్మా అంత డల్‌గా ఉన్నావు’అడిగింది సరిత
‘ఏం లేదమ్మా!మనకు డబ్బులు ఉంటే బాగుండేదికదా’ అంది పదిహేనేళ్ల వాణి
సరిత కాస్త ఆశ్చర్యపోయింది. ‘వాణీ! నువ్వు ఏదైనా కొనుక్కోవాలి అనుకొంటున్నావా..’ అనునయంగా అడిగింది సరిత.
‘నేనా! ఏమీ అనుకోలేదే ’అంది వాణి నిర్లిప్తంగా

08/02/2018 - 19:28

అనీల్ ముభావం లలితను కలవరపెడుతున్నది. ఎన్ని సార్లు పిలిచినా అంతగా మాట్లాడడం లేదు. అడిగిన దానికి జవాబు చెబుతున్నాడు. పెట్టింది తింటున్నాడు. స్కూల్‌కు వెళ్తున్నాడు. వస్తున్నాడు. ఆటలు ఆడడానికి కూడా వెళ్లడం లేదు. ఎందుకురా అంటే ‘నీవే గదా చదువుకో అన్నావు అందుకే ఆటకు వెళ్లడం లేదు’అన్నాడు.

06/12/2018 - 22:11

రోజా, రవి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. రోజా వాళ్ల తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూసి చూసి ఎన్నో కోణాలనుంచి అబ్బాయి వాళ్లను తరిచి చూసి ఎంతో బాగుంటారు అనుకొన్న తరువాత మాత్రమే వారి పెళ్లి చేసారు.కాని రోజా రోజో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్లల్లో అశాంతి కలిగింది. ఏమిటి ఇన్ని చూశాము. పైగా వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు.

06/05/2018 - 22:13

‘ఏంటీ అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు’అడిగింది సంధ్య
‘ఏమని చెప్పను. రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను. రాణి ఒకటే అబద్ధాలు చెబుతోంది. ఎందుకు అలా చెబుతున్నావని అడిగితే నేను నిజమే చెబుతున్నాను అంటోంది’ అంది సంజన.
‘అసలు రాణి అబద్ధాలు చెబుతోందని నీకెందుకు అన్పించింది’
‘ఏమని చెప్పేది. నిన్న అసలు స్కూల్‌కు వెళ్లలేదు. కాని వెళ్లాలని టీచర్ రాలేదని చెప్పింది’

05/17/2018 - 22:03

ప్రతి తరంలోని పెద్దలు మా కాలం లో నైతే... మేమైతే... అంటుంటారు. ఇప్పటి జనరేషన్ వాళ్లను చూసి వాళ్లు చేసేవి చూసి .. కాని ఏదైనా మితిమీరితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ విషయం పైన దృష్టి పెట్టకుండాచాలామంది ఎదేదో చేసేసి చివరకు మేము ఎంత చేశాం. కాని ఇదంతా ఇదిగో వీళ్ల వల్ల ఇలా అయింది అనేస్తుంటారు.

05/16/2018 - 22:35

‘అమ్మా అమ్మా నాకు మాథ్స్‌లో 99 మార్క్స్ వచ్చాయి’ పరుగెత్తుకు వచ్చాడు అనీల్
‘గుడ్.. సరే కానీ ఆ సురేష్‌కు ఎన్ని వచ్చాయి?’అడిగింది అంజని.
‘నన్ను మెచ్చుకోవు అమ్మా నువ్వెప్పుడూ ఆ సునీల్ గురించే అడుగుతావు’ కోపంగా అన్నాడు అనీల్.
‘అది కాదు నాన్న నాకు నువ్వొక్కడివే క్లాస్ ఫస్టు రావాలి అనిపిస్తుంది. అందుకే అలా అడుగుతాను’అంది అంజని.

05/15/2018 - 21:36

ఆటో తన గమ్యస్థానం చేరుకోగానే అందులోంచి దిగిన చలపతి డ్రైవర్‌కు మీటర్ డబ్బులు ఇవ్వబోయాడు. ఆని ఆ డ్రైవర్ ‘మాస్టారూ! మీరు నన్ను గుర్తు పట్టలేదా? నేను శేఖరిని. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను ఆరోజుల్లో మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మా అందరికీ మీరు పదేపదే చెప్పేవారు’అన్నాడు
గుర్తు వచ్చినట్టు రానట్టుగా ఉంది చలపతికి. అందుకే సాలోచనగా చూస్తున్నాడు.

05/11/2018 - 23:01

పూర్వకాలంలో ఎక్కడ చూసినా ఉమ్మడి కాపురాలుండేవి. ఇంటినిండా మనుష్యులు.. ఎప్పుడూ ఎవో ఒక పండుగలు, పబ్బాలు.. జన్మదినమో, పెళ్లిరోజో ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఉండేది దానితో ఇంట్లో ఎపుడూ పండుగ వాతావరణం ఉండేది.

05/02/2018 - 22:55

ప్రశాంతి ఒకటే ఆలోచిస్తోంది. ఎంతకీ ఏమి చేయాలో తోచడం లేదు. అంతలో
‘పేరుకే ప్రశాంతి నిజానికి ఎప్పుడూ ఆలోచనా స్రవంతిలోనే మునిగిపోయి ఉంటావు’ విశ్వాస్
‘ఆఁ మీరు మాత్రం విశ్వాస్ అని పెట్టుకున్నారు. కదా మిమ్మల్ని పూర్తిగా నమ్మవచ్చా. విశ్వాసం చూపిస్తారా’ ఉక్రోషంతో అంది ప్రశాంతి.
‘్భషుగ్గా.. నాపై విశ్వాసం ఉన్నవాళ్లకు ఎన్నడూ నేను కీడు చేయను’ విశ్వాస్.

04/29/2018 - 21:21

ఆలయ పై అంతస్థుపై తన తాతయ్య అపార్ట్‌మెంట్ కి వెళ్లింది. డోర్‌బెల్ విని తలుపు తెరచిన తాతయ్య అడిగాడు
‘ఉత్త చేతలతో రావుకదా? ఇవాళేం తెచ్చావు?’
అరిటాకులో చుట్టిన ఓ పార్సెల్ ని టీపాయ్ మీద ఉంచి ఆలయ చెప్పింది.
‘‘నేను త్వరగా వెళ్లాలి’’
‘‘ఎందుకు అంత తొందర?’’

Pages