S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

09/09/2016 - 20:52

ఆ పార్కు ఉదయం సాయంత్రం వాకర్స్‌తో బాగా సందడిగా వుంటుంది. ఏ యోగా గురువు చెప్పని సొంత విన్యాసాలు చేసే వాళ్ళు, పది నిముషాలే నడిచి మిగిలిన యాభై నిముషాలూ కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు, నడిచినంతసేపూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవాళ్ళు అక్కడ తారసపడతారు. కానీ నడకతోపాటు నడవడిలో కూడా సాధన చేస్తూ ఓ ఆరుగురు అక్కడున్నారు.

09/02/2016 - 21:10

‘‘రమణి మేడమ్, మీ జడలో మల్లెపూలు ఎంత బాగున్నాయి? గుప్పెడే అయినా ఇంకా ఫ్రెష్‌గా ఉండి ఒకటే చక్కటి సువాసన వస్తోంది..’’ ప్రశంసించింది భువన నా జడ వంక చూస్తూ.

08/26/2016 - 21:03

నీ కూతురు ఉష నీకు నమస్కరించి రాస్తున్నది- మనింట్లో నీ వాటాలో నువ్వు, రెండో వాటాలో నాన్నా క్షేమమే కదా! అమెరికాలో తమ్ముడు క్షేమమేనట, నిన్న స్కైప్‌లో కనిపించి చెప్పాడు. నేను క్షేమమేనమ్మా..

08/19/2016 - 20:51

ఆనందరాముడు లోపలికి వచ్చాడు హుషారుగా. ప్రిన్సిపల్ మల్లయ్యతో మాట్లాడుతున్న రవీంద్ర మాటలు ఆపి విషయం ఏమిటన్నట్లు అతని వంక చూశాడు. అతని చేతిలో ఒక కాగితం వుంది.
‘‘సార్! మీరు చెప్పినట్లుగా అన్ని పరీక్షలు చేసి క్యాంపస్ సెలక్షన్‌కు అర్హులైన అభ్యర్థులను తేల్చాము సార్!’’ చిన్నగా చెప్పాడు.
‘‘ఏదీ, మీ చేతిలో లిస్టు ఉందా?’’ అడిగాడు మల్లయ్య.

08/05/2016 - 21:24

రాఘవరావుగారికి నిద్రపట్టడం లేదు. టైమెంతైందో తెలీటం లేదు. గదిలో వెలుగుతున్న గుడ్డి బల్బువల్ల గడియారంలో టైము తెలీటంలేదు.
‘సుజీ.. సుజీ. టైమెంతైంది.?’ నెమ్మదిగా పక్కనే పడుకున్న భార్యని తట్టి లేపుతూ అడిగారు.
‘‘అబ్బబ్బ.. యిప్పటికి యిది నాలుగోసారి అడగడం.. తెల్లవారితే నేనే లేపుతాగా.. నాకిప్పుడే నిద్ర పట్టింది.. అయినా లేచి చేసే నిర్వాకం ఏవిటంట..’ విసుక్కుంది ఆవిడ.

07/29/2016 - 21:16

‘‘అల్లుడూ! నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి’’ ఫోన్‌లో చెప్పాడు దామోదరం.
‘‘చెప్పు మామా!’’ అన్నాడు రంగనాయకులు.
‘‘్ఫన్‌లో కాదు, పర్సనల్‌గా మాట్లాడతా!’’
‘‘కొత్త కమీషనర్ వచ్చాడు మామా! ఆయనకంతా కొత్త. అన్నీ నన్ను బ్రీఫ్ చేయమంటాడు. ఆఫీసులో లేటవుతుంది మామా! ఆదివారం కలుద్దాం’’.
‘‘లేటైతే ఇంకా మంచిది. ఆఫీసు నుంచి సరాసరి కృష్ణా హోటల్‌కి వచ్చెయ్! గుటకలేస్తూ మాట్లాడుకుందాం.’’

07/22/2016 - 20:39

తలుపు చప్పుడయ్యింది. రామభద్రం నిద్రనుండి మెలకువలోకి వచ్చాడు. ఆయన మంచం దిగి తలుపును సమీపించే లోపుగా మరోసారి తలుపుమీద బాదిన చప్పుడయ్యింది. ఈసారి ఆయనను ‘బాబాయ్!’ అని పిలిచారు.
తలుపు తెరచాడు రామభద్రం.
మేడమీద అద్దెకు ఉంటూన్న కుమార్.

07/15/2016 - 21:21

ఏ క్షణాన మొదలైందో ఆ ఆలోచన వదలటంలేదు. అలా అని, ఓ నిర్ణయానికీ రాలేకపోతున్నాడు నిరంజన్‌రావు. ప్రతిసారీ ఆతృతే.. ఓ రకం జంకు, అపరాధ భావన.. ఉదిగ్న ఊష్ణం కమ్ముకున్నట్టు.. మనసుకి, శరీరానికి ఆరాటమే.

07/08/2016 - 20:47

సిద్ధరామయ్యకి వరసగా నాలుగోసారి కూడా వర్షాభావంచేత పంట దెబ్బతినేసింది. తాకట్టుపెట్టిన భార్య బంగారు నగలు బ్యాంక్ వారి పరమైపోయాయి. రాములమ్మ చెరువు ఆయకట్టు కింద చుట్టుప్రక్కల రైతుల ఐదువేల ఎకరాలవరకు సాగుబడి జరిగేది. అయిదెకరాల చెరువు మధ్యస్థంగా లోతు మూడు నలుమలు పదిహేను అడుగుల పైమాటే. చెరువుకి చుట్టూ పొలాలు. బోదె కాలువల ద్వారా పొలాలకి నీరందేది.

07/01/2016 - 21:04

చిరు చీకటి తొలి వెలుగులో మెల్ల మెల్లగా తప్పుకొంటున్న వేళ, పక్కనే ఉన్న కోవెల స్పీకర్స్‌నుంచి మంద్రంగా వినిపిస్తున్న తిరుప్పావై. మంచు దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్ధకంగా కళ్ళు తెరుస్తోంటే కిటికీలోంచి పడుతున్న కిరణాలు నన్ను తడుపుతున్న అనుభూతి.

Pages