S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

12/18/2015 - 22:24

పాలకడలి ప్రశాంతంగా ప్రవహిస్తున్న వేళ.. ఆ లాహిరికి ఆనంద పరవశుడై ఆదిశేషువు డోలికలూపుతూండగా.. చిరునవ్వులు చిందిస్తూ రమారమణి తన కరపద్మాలతో సుతిమెత్తగా పతి పాదములొత్తుతూన్న సమయాన.. జగన్నాటక సూత్రధారి చిన్ముద్రలో చిరు మెదలిక..

12/11/2015 - 22:25

సత్యప్రసాద్ చనిపోయాడు. అయితే, ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను ఇతరుల విషయం పట్టించుకోను. ఎవరితోనూ పరిచయాలు పెంచుకోను. చిన్నతనం నుంచి ఒంటరి బతుక్కి అలవాటు పడ్డాను. ఆర్మీలో పదిహేనేళ్లు పనిచేశాను. ప్రతి నెలా పెన్షను వస్తుంది. చిన్న ఉద్యోగం కూడా ఉంది. మరి నాకు ఇతరులతో ఏం పని?

12/12/2015 - 21:04

‘మేము హైద్రాబాద్ వచ్చేశామమ్మా.. మావూళ్లో పనులు దొరకడం లేదు.. మీ ఇంట్లో పనిమనిషి కావాలన్నారంట.. 501 ఫ్లాట్లో కూడా చేస్తున్నాను..’ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది సావిత్రి.
‘ఏమేం పనులు చేస్తావు? పొద్దునే్న రాగలవా?’ అడిగాను.
‘అన్ని పనులూ చేయగలనమ్మా.. మీకేమేం చేయాలి?’ వినయంగా ఆరా తీసింది సావిత్రి.
ఆమె వినయ విధేయతలకి ముచ్చపడి- ‘మీ ఆయన ఏం చేస్తుంటాడు? పిల్లలెంతమంది?’అని అడిగాను.

11/28/2015 - 03:22

భాగ్యనగరం ఇంకా చలి చీకటి ముసుగు పూర్తిగా తొలగించుకోలేదు. తెల్లవారబోతున్నవేళ.. హుస్సేన్ సాగర్ జలాలు కూడా చలికి వణికిపోతూ నిశ్శబ్దంగా నీరెండ కోసం ఎదురుచూస్తున్నాయి. దూరంగా ఓ స్ర్తిమూర్తి ఆకారం టాంక్‌బండ్ రెయిలింగ్ వెంబడి మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. తలపైనుంచి ముందుకి ముసుగు జార్చుకున్న ఆమె మొహం సరిగ్గా కన్పించటం లేదు. ఆమె చేతిలో పసిపాప- ఏదో పీడకల వచ్చినట్లు కెవ్వుమంది.

11/20/2015 - 23:30

గుడిమెట్ల ముందు ఆటో దిగాను. నా వెనుకనే భార్య సుజీ, నా పధ్నాలుగేళ్ళ కూతురు మైథిలి దిగారు. మెట్లవైపు చూసాం. అన్ని మెట్లెక్కాలా? అనిపించింది. ముగ్థమనోహరుని దివ్య మంగళ రూపం దర్శించుకునే భాగ్యం అంత సులువుగా దొరికితే ఇక అతని గొప్ప తనమేముంది? ‘ఎంతో శ్రమపడి నీ దగ్గరకొచ్చాం స్వామీ!’ అని నిరూపించుకోకపోతే భక్తుని తపన స్వామివారికి తెలిసేదెలా? మెట్లదారిలో దారిపొడవునా యాచకులే! ‘అమ్మా! బాబూ!

06/26/2015 - 22:43

ఒకప్పుడు పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటపుడు పెద్ద కుటుంబాన్ని చూసి ఇచ్చేవారు. ఆడపడుచులు, మరుదుల చెణుకులతో హాయిగా, ఆనందంగా గడిపేవారు. ఇప్పుడలా కాదు. పెద్దలే ఆడపిల్లకు అన్నీ నచ్చచెపుతున్నారు. తల్లి కల్పించుకుని, ‘‘మంచి సంబంధం ఒప్పుకో అమ్మా..’’ అని బతిమాలుతూ- ‘‘ఆడబిడ్డలు లేరు, అత్తగారు కిందటేడే పోయిందట.. మామగారు మొన్ననే రిటైరైపోయాడు.. మరిది హైదరాబాదులో బ్యాంక్ ఉద్యోగి...

06/26/2015 - 22:41

కథల పోటీలో ఎంపికైన రచన
------------------
అదిరిపడ్డాడు చైతన్య.
ఎదుట వ్యక్తి చెప్పింది వినేసరికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి.
‘‘ఇదంతా నిజమేనా? నువ్వు చెప్పిందంతా యధార్థమేనా?’’ ఆందోళనగా అడిగాడు చైతన్య. అతను దేవునిమీద ప్రమాణం చేసి మరీ చెప్పాడు.
ఇదే నిజమైతే? అమ్మో! ఇంకేమైనా ఉందా? ఊరంతా ఒల్లకాడు కాదూ?

06/01/2015 - 16:01

test

03/18/2015 - 11:25

కథల పోటీలో ఎంపికైన రచన
...............

Pages