S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

06/24/2016 - 22:06

ఫోన్ రింగవుతోంది. సూర్యారావు మెలకువ తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మెల్లగా కళ్లు తెరిచి దిండు పక్కనున్న మొబైల్ తీసుకుని ‘‘హలో.. హలో..’’ అన్నాడు. అటు పక్కనుంచి జవాబు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఏదో తెలియని నంబర్. ‘‘ఇంత రాత్రిపూట ఫోనెవరు చేసారో?’’ తిరిగి పక్కమీదకి వాలాడు. కళ్ళు మూసుకున్నాడో లేదో మళ్లీ రింగయ్యింది.

06/17/2016 - 22:42

‘‘కమాన్ స్వరూపా.. మాట్లాడు సిగ్గెందుకు?..’’ అంది వింధ్య.
‘‘వద్దక్కా. నాకు భయం..’’ అంది స్వరూప.
‘‘హే.. ఇదంతా కామన్.. నివాస్ మనకు సీనియర్.. ఆ మాటకొస్తే లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఇంకా సతాయించేవాళ్లు. ‘లైట్’ తీస్కో’’ అంది వింధ్య. భయం.. భయంగా ఫోన్ అందుకుంది స్వరూప..
‘‘ఎందుకు అంత బెట్టుచేస్తున్నావ్.. నినే్నమైనా కొరుక్కుతిన్నామా.. నీ ఫ్యామిలీ డీటైల్స్ చెప్పు చాలు..’’ అన్నాడు నివాస్.

06/10/2016 - 21:00

ఆ వీధి వీధంతా ఎంతో కోలాహలంగా, చాలా సందడిగా వుంది. పండగో, ప్రళయమో తెలియని పరిస్థితి. జనమంతా బయటకు వచ్చి ప్రేక్షకుల్లా చూస్తున్నారు. అతి త్వరలో విడుదలయ్యే స్పీడున్నోడో, దమ్మున్నుడో తరహా సినిమా ప్రమోషన్‌కై కుర్ర హీరో హీరోయిన్లు రోడ్లనుండి వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నారా! వారిని చూడ్డానికి పిల్లా పాపలతో సహా ఇంటిల్లిపాది ఎదురుచూస్తున్నారా! అన్నట్లుగా ఉందా దృశ్యం.

06/03/2016 - 21:24

‘‘ఉత్తేజ్ సర్, మీరు కొంచెం ఫాస్ట్‌గా ఉండాలి సర్!’’ అంటూ ఉంటాడు నా కొలీగ్ ఆకాశ్.
ఆకాశ్‌కీ నాకూ అయిదేళ్ళే తేడా అయినా నేను వెనుకబడి ఉన్నాననిపిస్తుంది. గత మూడేళ్ళుగా నా దగ్గరే జూనియర్‌గా పని నేర్చుకుంటున్నాడు కాబట్టి అతని విమర్శ నా పని విషయంలో కాదు. కానీ నాకిలానే ఉండాలనిపిస్తుంది. తనకేమో అలానే ఉండటం తప్పనిసరి అనిపిస్తుంది.

05/27/2016 - 21:41

పరుగులాంటి నడకతో ఆయాసపడుతూ బ్యాంకు బ్రాంచ్‌లోకి అడుగుపెట్టిన సబ్ మానేజర్ మూర్తి.. ఓవైపు కొలీగ్స్‌కి విష్ చేస్తూ.. చీఫ్ కాబిన్‌వైపు ఓ లుక్కేసి... బాస్ దృష్టిలో పడకపోవటతో, ‘‘హమ్మయ్యా.. ఫైవ్ మినిట్స్ లేట్ అయినా యముడి దృష్టిలో పళ్ళేదు’’ అనుకుంటూ హడావుడిగా వెళ్లి తన సీట్లో కూర్చోబోతుండగా.. మందలిస్తూన్నట్టు వినిపించిందో గొంతు..

05/20/2016 - 22:09

మోటార్ సైకిల్‌ను ఇంటి గేటుముందు ఆపి, తాళం వేసి, లోపలికి అడుగుపెట్టాను. పొద్దున ఏడింటికి ఇంటినుండి బయలుదేరినవాడిని.. ఇప్పుడు సాయంత్రం ఏడు అయ్యింది. చాలా తిరుగుడు అయ్యింది కాని చాలా తృప్తిగా ఉంది. రెండు కొత్త కాంట్రాక్ట్‌లు దొరికాయి ఇవాళ.

05/13/2016 - 22:02

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
....................................................................

05/06/2016 - 21:12

కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది.
‘ఎక్కడెక్కడికో వెళ్లాలి, ఎవరి దాహార్తినో తీర్చాలి’- అని కంకణం కట్టుకున్నదాన్లా ఉరవళ్ళతో పరుగులు పెడుతోంది.
దిగులుగా భయంగా నదీపాయ వంకే చూస్తూ కూర్చుంది ఎల్లవ్వ.
ప్రవాహ వేగం ఆమె గుండెల్లో సుడిగుండాలు సృష్టిస్తోంది.
దీనంగా చూసింది. కనికరించమని ప్రార్థిస్తూ చూసింది. చేతులూ జోడించింది.

04/29/2016 - 21:49

దేశంలో శిశు మరణాల సంఖ్య నానాటికి అధికమవుతోంది. శాస్ర్తియ అవగాహన కొరవడటం వల్ల పురిట్లోనే పిల్లలకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. వెయ్యి మంది పిల్లలు పుడితే 40 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే అపుడే పుట్టిన వెయ్యి మంది శిశువుల లో 28 మంది చనిపోతున్న ట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు మనదేశంలో ఎక్కువగా ఉంది.

04/29/2016 - 21:44

‘ఇది విన్నారా?... విద్యానగర్‌లో ఓ కాలేజీ లెక్చరర్ నుంచి లక్షా యాభై వేలు కాజేశారుట..’ స్ట్ఫా రూమ్‌లో పిచ్చాపాటీకి తెరతీస్తూ అన్నాడు ఫిజిక్స్ చెప్పే మాధవ్.
‘బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెడుతుంటే బ్యాగ్ లాక్కున్నారా?’ అడిగాడు కెమిస్ట్రీ లెక్చరర్ సతీశ్.

Pages