S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం కథ

10/28/2016 - 21:09

అందమైన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. ఎక్కడి వస్తువులు అక్కడ నీట్‌గా సర్దివున్నాయి. కిటికీలకు, ద్వారాలకు లేత నీలిరంగు డిజైన్‌లో కర్టెన్స్ వేలాడుతున్నాయి. ఓ పక్కగా అమర్చబడిన అక్వేరియంలో రంగు రంగుల చేపలు చురుగ్గా కదులుతున్నాయి. అది మధ్యగా సీలింగ్‌కు వేళ్లాడుతూన్న చిన్న షాండ్లియర్ గదికే ఓ కొత్త అందాన్ని తెస్తోంది. అక్కడ ప్రతి వస్తువూ గది అందాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఆ ఒక్క గదే కాదు ఇల్లంతా చక్కగా..

10/22/2016 - 00:28

‘‘ఒరేయ్ రాజా!.. గదిలో ఫేను వృధాగా తిరుగుతోంది’’ అంటూ మా ఆవిడ మా అబ్బాయిని గట్టిగా కేకేసింది. వాష్‌బేసిన్ ముందు నిలబడి పళ్ళు తోముకుంటున్న రాజా గబగబా పరుగెత్తాడు ఫేను తిరుగుతున్న గదిలోనికి..

10/15/2016 - 02:44

ప్రసాద్ ఆఫీసును నుంచి ఇంటికొచ్చి తలుపుకొట్టాడు. వెంటనే అతడి ఎడమ కన్ను అదిరింది. దూరంగా ఎక్కడో తీతువు అరిచినట్టు, నక్క ఊళలు వేసినట్టు భ్రమకలిగింది.
‘‘అయ్యబాబాయ్ నాకేదో మూడింది. బతుకు బస్టాండు అయిపోతుందేమో..’’ అనుకున్నాడు.
అతడి శ్రీమతి తలుపు తీసింది. ఆమెను చూసి జడుసుకున్నాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. జుట్టు విరబోసుకుంది. నుదుటిమీద ఎర్రబొట్టు. ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి కదిలింది.

10/07/2016 - 21:02

ఉత్తమకుమార్‌కు ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం అతను రాసిన కథల్ని, పుస్తకంగా తీసుకువచ్చాడు. ఆ పుస్తకాల ఆవిష్కరణకు అతను అమితంగా ఇష్టపడే ఆముదాలవలసలో జరగడంతో ఆ ఉత్సాహం రెట్టింపయ్యింది. ఉత్తమకుమార్ సొంతపేరు కాదు కలం పేరు. అతని అసలు పేరు కుమార్. దానికి ఉత్తమ తగిలించాడు. దానికి కారణం సంఖ్య శాస్త్ర, జ్యోతిషం మీద అతనికి గల అమిత నమ్మకం.

09/30/2016 - 21:08

ఉదయం ఏడుగంటలవుతూంది.
ఇంటిముందు లాన్‌లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్న సుధాకర్- వినిపించిన అడుగుల చప్పుడకి తలెత్తి, తన మేడ పక్కన ఓ మూడు గదుల పోర్షన్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి శంకరాన్ని గుర్తుబట్టి.. ‘ఏవిట’న్నట్టు ప్రశ్నార్థంగా మొహం పెట్టాడు. ‘‘రండి..కూర్చోండి’’ అని కూడా అనలేదు.

09/23/2016 - 21:37

‘‘చుట్టాలందరూ వెళ్లిపోతున్నట్టున్నారు. అమ్మ దగ్గరెవరైనా ఉన్నారా?!’’ అడిగింది ప్రియ.
‘‘పిన్ని ఉంది పెద్దక్కా!’’ జవాబుగా చెప్పింది ప్రణీత.
‘‘ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్కా’’ ప్రియను చూస్తూ చెప్పింది పావని.

09/16/2016 - 22:53

‘‘సుందరీ!’’
గడ్డిమేస్తున్న ఆవులను చూస్తూ ఏదో ఆలోచనలలో ఉండిన సుందరి తల తిప్పి చూసింది.
దొంగరాముడు నవ్వుతూ తనకేసే వస్తూ కన్పించాడు.
‘నాతో నీకేం పని?’ అన్నట్లుగా విసుగ్గా చూసింది సుందరి.

09/09/2016 - 20:52

ఆ పార్కు ఉదయం సాయంత్రం వాకర్స్‌తో బాగా సందడిగా వుంటుంది. ఏ యోగా గురువు చెప్పని సొంత విన్యాసాలు చేసే వాళ్ళు, పది నిముషాలే నడిచి మిగిలిన యాభై నిముషాలూ కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు, నడిచినంతసేపూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేవాళ్ళు అక్కడ తారసపడతారు. కానీ నడకతోపాటు నడవడిలో కూడా సాధన చేస్తూ ఓ ఆరుగురు అక్కడున్నారు.

09/02/2016 - 21:10

‘‘రమణి మేడమ్, మీ జడలో మల్లెపూలు ఎంత బాగున్నాయి? గుప్పెడే అయినా ఇంకా ఫ్రెష్‌గా ఉండి ఒకటే చక్కటి సువాసన వస్తోంది..’’ ప్రశంసించింది భువన నా జడ వంక చూస్తూ.

08/26/2016 - 21:03

నీ కూతురు ఉష నీకు నమస్కరించి రాస్తున్నది- మనింట్లో నీ వాటాలో నువ్వు, రెండో వాటాలో నాన్నా క్షేమమే కదా! అమెరికాలో తమ్ముడు క్షేమమేనట, నిన్న స్కైప్‌లో కనిపించి చెప్పాడు. నేను క్షేమమేనమ్మా..

Pages