S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:31

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 3: ఫిలిప్పైన్స్ మనీలాలో ఈనెల 6,7 తేదీల్లో జరగనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫిడెన్షియల్ ఏసియన్ పసిఫిక్ రీజనల్ సమావేశానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఐఎన్‌టియుసి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గారా ఉషారాణి ఎంపికయ్యారు. ఈ సమావేశంలో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు.

07/03/2016 - 23:31

పెదనందిపాడు, జూలై 3: పెదనందిపాడు వ్యవసాయ ఉప మార్కెట్‌యార్డు కార్యాలయ భవనాలను ఆదివారం మార్కెటింగ్ ఎస్‌ఇ ఎం శ్రీనివాస్ సందర్శించారు. శిథిలమైన రైతు విశ్రాంతి భవనానికి త్వరలో 9 లక్షల రూపాయలతో మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 400 చెక్‌పోస్టులు ఉన్నాయని, వీటిలో ప్రాధాన్యతాక్రమంలో 200 చెక్‌పోస్ట్‌లను ఒక్కొక్కదానికి 2 లక్షల రూపాయలతో ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

07/03/2016 - 23:31

మంగళగిరి, జూలై 3: కృష్ణాజిల్లా నందిగామలో ఈనెల 16,17 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2016, బెంచిప్రెస్ పోటీలకు ఆదివారం మంగళగిరిలోని హెల్త్‌జిమ్‌లో జిల్లా పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొనే లిఫ్టర్లను ఎంపిక చేసి వివరాలను అసోసియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు వెల్లడించారు.

07/03/2016 - 23:30

తాడేపల్లి, జూలై 3: రహదారుల విస్తరణ ఫలితంగా ఇప్పటి వరకూ తాడేపల్లిలో మొత్తం 253 ఇళ్ళు తొలగించామని, ప్రత్యామ్నాయ భద్రత కోసం అర్హులైన 133 కుటుంబాలకు స్లిప్‌లు పంపిణీ చేశామని, మిగిలిన వారికి సైతం గూడు కల్పించటం కోసం తాడేపల్లిలో యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి తెలిపారు.

07/03/2016 - 23:28

సిద్దిపేట, జూలై 3: చట్టవ్యతిరేకంగా రిజర్వాయర్ నిర్మించాలనుకోవడం సరికాదని, అధికారులు, పోలీసులతో భూసేకరణకు 123జిఓ ప్రకారం చేయడాన్ని వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా తొగుట మండలం తిరుమలాపూర్‌లో బిఎస్పీ, ఆర్‌ఎస్‌పి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నేతలు శ్రీనివాస్ బహద్దూర్, జానకిరాములు, మురహరిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు.

07/03/2016 - 23:27

గజ్వేల్, జూలై 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ బగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్ మండలపరిదిలోని కోమటిబండలో చేపట్టిన మిషన్ బగీరథ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండలాలవారిగా సంబందిత అధికారులతో వివరాలు సేకరించడంతోపాటూ జాప్యానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

07/03/2016 - 23:27

సంగారెడ్డి, జూలై 3: నమ్మి పట్టం కట్టిన రైతులను నట్టేట ముంచ చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు మల్లన్న సాగర్ ముంపు బాధితుల మందుకు వచ్చి తేల్చుకోవాలని ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు.

07/03/2016 - 23:26

మెదక్ రూరల్, జూలై 3: పక్కజిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా..మెదక్ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండు బలమైన కార్తులు పూర్తయినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. ఈసారి మనకు కరవేనా అన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

07/03/2016 - 23:26

సంగారెడ్డి టౌన్, జూలై 3: ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకరావాలని ఎబివిపి జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలను దోపిడి సంస్థలు తయారు చేస్తున్నారని విమర్శించారు.

07/03/2016 - 23:25

చిన్నశంకరంపేట, జూలై 3: అసైండ్‌మెంట్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు జెసిబితో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 345 సర్వే నంబర్‌లో లంబాడి శ్రీనివాస్ శోభ ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ పనులను నిలిపివేయాలంటూ తహశీల్దార్ విజయలక్ష్మీ ఆదేశించారు. అయినప్పటికీ బెస్మెంట్ వరకు నిర్మించారు.

Pages