S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/04/2018 - 00:05

జనగామ టౌన్, ఆగస్టు 3: తల్లి మృతి చెందితే తలకొరివి పెట్టాల్సిన చిన్నకుమారుడే ఆమె పాలిట యముడయ్యా డు. క్రిమిసంహారక మందు తాగించి ప్రాణంతీసి, తానూ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జనగామ మండలం పెద్దపహడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపహడ్ గ్రామానికి చెందిన పోతుల శ్రీశైలం(50) తన తల్లి పోతుల ఉప్పలమ్మ(80)కు బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించి ప్రాణం తీశాడు.

08/03/2018 - 23:58

దేవరకొండ, ఆగస్టు 3: మున్సిపల్ సిబ్బంది సహకారంతో పట్టణంలోని పఠాన్‌వాడీలో ఓ ఇంటిని కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో దేవరకొండకు చెందిన నలుగురు వ్యక్తులను శుక్రవారం కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు. ఈ కేసులో మొత్తం నలుగురు మున్సిపల్ సిబ్బందితో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.

08/03/2018 - 23:48

కురిచేడు, ఆగస్టు 3: స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం గూడ్స్‌రైలు కిందపడి దుర్మరణం చెందిన సంఘటన కురిచేడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన మనె్నం కోటయ్య కుమారుడు వెంకటరావు (16) కురిచేడులోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల పరిధిలోని హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు.

08/03/2018 - 23:45

ఒంగోలు, ఆగస్టు 3: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 46 మంది వాహన చోదకులకు కోర్టు జైలుశిక్ష విధించింది. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొత్తం 5లక్షల 62వేల 100 రూపాయలు కోర్టు జరిమానా విధించినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి కె వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. జిల్లా వాసుల్లో కొందరు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల పాలవుతున్నట్లు తెలిపారు.

08/03/2018 - 23:41

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 3: ఫేస్‌బుక్ ప్రేమ వ్యవహారం ముగ్గురి అత్మహత్యలకు కారణమయ్యింది. సినిమా స్టోరీని తలపించేలా సాగిన ఈ ముక్కోణపు ప్రేమ వ్యవహారం మూడు కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న లక్కవరం కానిస్టేబుల్ కంపా వెంకటరమణ కుమారుడు వెంకటేష్ (23) శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

08/03/2018 - 23:18

వీపనగండ్ల, ఆగస్టు 3: మండలంలోని గోపల్‌దినె్న గ్రామంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని వ్యక్తి తనకు పింఛన్ కావాలంటూ అడగడంతో పక్కనే ఉన్న టీ ఆర్ ఎస్ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ భర్త కుర్మయ్య అతనిని తోసేయడంతో బలమైన గాయాలు అయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్ అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఊరిలో తిరిగే వాడని గ్రామస్థులు తెలిపారు.

08/03/2018 - 23:15

మక్తల్, ఆగస్టు 3: అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులు తాళలేక వివాహిత ఉరివేసుకుని తనవు ఛాలించిన ఘటన మక్తల్ మండలం కాచ్‌వార్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్ల కథనం ప్రకారం.. 5 సంవత్సరాల క్రితం పెద్దలు చేసిన పెళ్లితో అన్యోన్య జీవనం గడపిన వారి దాంపత్య జీవితంలో చిచ్చురేగింది. చివరికి భార్యభర్తల మధ్య వరకట్నపు పిషాచి వెంబడించి భర్త అకృత్యాలను భరించలేని ఆమహిళ ఉరివేసుకుంది.

08/03/2018 - 23:01

బేతంచెర్ల, ఆగస్టు 3: అభం శుభం తెలియని యువత ఆకర్షణకు లోనై ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కులాల పేరుతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయం, వత్తిడి నుంచి బయట పడలేక ఓ ప్రేమజంట గూడ్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం బేతంచెర్ల పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు..

08/03/2018 - 22:36

గుంటూరు, ఆగస్టు 3: క్రికెట్‌బెట్టింగ్‌కు పాల్పడుతున్న 16 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను శుక్రవారం రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు విలేఖర్లకు తెలియజేశారు.

08/03/2018 - 22:24

అనంతపురం, ఆగస్టు 3 : నగరంలో ఓ చర్చికి సంబంధించిన భూ తగాదాలో తాను చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఓ పోలీసు అధికారికే ఫోన్ చేసి దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడిన నకిలీ ఐఏఎస్ అధికారి అనంతపురం పోలీసులు అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడు గుంటూరు పట్టణం వల్లూరు వారి తోట పరిధిలోని అరండల్‌పేట్, బృందావన్ గార్డెన్‌కు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్ (32).

Pages