S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/05/2018 - 22:28

అద్దంకి, ఆగస్టు 5: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ యువకులను మోసగించి, వారి నుండి 95లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠాను ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసు విషయమై ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

08/05/2018 - 22:10

పెద్దతిప్పసముద్రం, ఆగస్టు 5: వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ రైతుకు పంటలు వేయడానికి చేసిన అప్పులు పెనుభారం కావడంతో వాటిని తీర్చే దారి కనిపించక పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా, పెద్దతిప్పసముద్రం, తుమ్మరకుంట పంచాయతీ, నవాబుకోటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/05/2018 - 22:07

తిరుపతి, ఆగస్టు 5: ఆడికృత్తికను పురస్కరించుకుని కార్వేటి నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లిన తిరుపతికి చెందిన దేవి(40) అనే మహిళ స్కంద పుష్కరణిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె స్వామివారి దర్శనానికి ముందు కొలనులో స్నానానికి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు మునిగి పోతున్న ఆమెను కొందరు కాపాడారు.

08/05/2018 - 22:04

పెనుకొండ, ఆగస్టు 5: మండల పరిధిలోని గోనిపేట క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరు జేపీ నగర్‌కు చెందిన కమలమ్మ (76), అనిల్‌కుమార్ (50), ఆదిత్య (22)లు దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు నుండి బళ్లారికి కమలమ్మకు వైద్యం చేయించేందుకు కారులో వెళుతుండగా ప్రమాదవశాత్తు ముందు వెళుతున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది.

08/05/2018 - 00:37

గచ్చిబౌలి, ఆగస్టు 4: ఇంట్లో కుర్చుని నెలకు 15నుంచి 20వేల రూపాయలు సంపాదించవచ్చు.. ఇల్లు కదల కుండా వేల రూపాయలు సంపాదించాలంటే మాసంస్థలో సభ్యులుగా చేరాలని ప్రకటనలు ప్రచారం చేసుకుని అనంతరం బోర్డు తిప్పెస్తున్నావారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు చెప్పిన ప్రజలలో మార్పు రావడం లేదు.

08/05/2018 - 00:24

విజయవాడ (క్రైం), ఆగస్టు 4: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన కేసులో ముగ్గురిని భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

08/05/2018 - 00:07

మల్లాపూర్, ఆగస్టు 4: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ వీఆర్వో మహ్మద్ రఫీ నడికుడ గ్రామానికి చెందిన రైతు గడ్డం మహిపాల్‌రెడ్డి నుంచి పట్టాదారుపాసుపుస్తకం విరాసత్ చేయడం కోసం రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ శనివారం వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

08/05/2018 - 00:06

తిమ్మాపూర్, ఆగస్టు 4: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాలని చూసాడు ఓ కసాయి భర్త. అందుకు నేపాల్ నుంచి నాటు తుపాకీ తీసు కువచ్చాడు. ఆ తుపాకీతో భార్యను కాల్చిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గల బుడిగ జంగాల కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

08/04/2018 - 23:59

ఆదిలాబాద్, ఆగస్టు 4: జిల్లాలోని నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో యధేచ్ఛగా కల్తీ మద్యం తయారీ చేస్తూ మహారాష్టత్రో పాటు ఉమ్మడి జిల్లాల్లో అక్రమ మద్యం దందా కొనసాగిస్తున్న ముఠా రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల దాడిలో ప్రాణహానికి దోహదంచేసే విష పూరిత రసాయనాలు, ప్రభుత్వం నిషేదించిన దేశీదారు మద్యం నిల్వలు పట్టుబడ్డాయి.

08/04/2018 - 23:56

బెల్లంపల్లి, ఆగస్టు 4: పట్టణంలోని మంచిర్యాల చందా జాతీయ రహదారి కాల్ టెక్స్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 50క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు.

Pages