S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/13/2018 - 22:37

తడ, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని రామాపురం పంచాయతీ వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ముకరంబాకం మదన్(22) ప్రియురాలు తన ప్రేమను తిరస్కరించిందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వెంకటాద్రిపాలెంకు చెందిన మదన్ తమిళనాడులోని గుమ్మడిపూండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు.

02/13/2018 - 04:11

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 12: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంలో డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పై వచ్చిన టౌన్ కంట్రీ ప్లానింగ్ డైరక్టర్ పురుషోత్తంరెడ్డి బినామీలపై ఎసిబి అధికారులు దృష్టి సారించారు.

02/13/2018 - 04:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్య, మరో ముగ్గురిపై ప్రత్యేక న్యాయస్థానం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 7 కోట్ల రూపాయల మనీలాండరింగ్‌లో వారి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. నిందితులందరూ మార్చి 22న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మాన్ ఆదేశించారు.

02/13/2018 - 00:25

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్‌కు గురైన ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమెకు పదేళ్ల కిందటే పెళ్లైందన్న ప్రచారం సోషల్ మీడియాకెక్కింది. పెళ్లి ఫోటోలు సైతం చక్కర్లు కొడుతున్నాయ. అయితే అవి సునీతారెడ్డివా? కాదా? అనే అంశంపై స్పష్టత లేదు.

02/12/2018 - 22:26

హైదరాబాద్, ఫిబ్రవరి 12: హవాలా రాకెట్‌ను నగర టాస్క్ఫోర్స్ ఉత్తరమండల బృందం గుట్టు రట్టు చేసింది. రూ.1,40,80,000 స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/12/2018 - 22:24

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఎయిర్‌పోర్టుల్లో, మేకిన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఢిల్లీ నివాసిని హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.02 లక్షల నగదు, 16 మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్‌లు, ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/12/2018 - 22:13

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ పోలీసులు నిర్వహించిన సకల నేరస్తుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోని నేరస్తులు, నేరచరితుల వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇటీవల సకల నేరస్తుల సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇలా నేరస్తుల వివరాలను సేకరించడంపై హైకోర్టు కనె్నర్ర చేయడంతో ఇక నుండి ఇలాంటి సర్వే చేయబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి నివేదించారు.

02/12/2018 - 03:44

గచ్చిబౌలి, ఫిబ్రవరి 11: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్‌లో నివాసముంటున్న మహారాష్టల్రోని నాగ్‌పూర్ వాసిగా పోలీసులు భావిస్తున్నారు.

02/12/2018 - 03:42

మేడ్చల్, ఫిబ్రవరి 11: మండలంలోని కోణాయిపల్లిలో భారీ చోరీ జరిగిన సంఘటన జరిగింది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొణాయిపల్లి గ్రామ వాస్తవ్యుడైన నరేందర్ సింగ్ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో దొంగలు చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు. ఇంటిలోనికి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి నరేందర్‌సింగ్ నిద్రిస్తున్న గది తలుపులను బయటి నుంచి మూసివేశారు.

02/12/2018 - 02:03

జూలూరుపాడు, ఫిబ్రవరి 11: మొదట చిల్లర దొంగల పనిలే అని అనుకున్నారు..తెల్లారే సరికి మరొక దొంగతనం జరగటంతో పోలీసులు దృష్టి సారించారు... ఇంతలోనే సరిగ్గా వారం రోజులకి మండల కేంద్రంలో దొంగలు మరొక పెద్ద దొంగతనానికే పాల్పడ్డారు.

Pages