S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/10/2018 - 00:21

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 9: రోడ్డుప్రమాదంలో ఇద్దరు శివస్వాములు మృతిచెందిన సంఘటన మండలంలోని రోళ్ళపెంట వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా గూడెంపల్లి గ్రామానికి చెందిన ఎదురుశెట్టి చంద్రప్ప (22), తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరిగం మధు (18) ప్రమాదంలో మృతి చెందారు.

02/10/2018 - 00:09

దేవరపల్లి, ఫిబ్రవరి 9: మండలంలోని యర్నగూడెంలో శుక్రవారం ఉదయం చేపల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో యర్నగూడెంకు చెందిన గెంజి మురళి (12) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. విజయవాడ నుంచి చేపల లోడుతోపాటు ఆ పై ఉల్లిపాయలు, నిమ్మకాయల లోడుతో విశాఖ వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న మురళీపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మురళి 7వ తరగతి చదువుతున్నాడు.

02/10/2018 - 00:00

పాల్వంచ, ఫిబ్రవరి 9: స్థానిక కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలో ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా, అస్సాపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌సింగ్ గత సంవత్సరం క్రితం ఎస్‌విఐఇపిఎల్ కంపెనీ వారు 7వ దశ కర్మాగారంలో వెల్డింగ్ పనులు నిర్వహించేందుకు తీసుకొచ్చారు.

02/09/2018 - 23:59

ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 9: వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గత కొంతకాలంగా కార్యాలయంలో పనిచేస్తున్న వేణుగోపాల్ ప్రతి పనికి డబ్బులు కావాలని బాధిత వికలాంగులను వేధించడంతో వారు ఏసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసిబి అధికారులు అతనిపై దృష్టి సారించారు.

02/09/2018 - 23:09

హైదరాబాద్, ఫిబ్రవరి 9: విశాఖ జిల్లా ఏజన్సీ వాకపల్లి ఘటనకు సంబంధించి విచారణ కోర్టులో ప్రత్యేక పీపీగా పి.త్రినాథరావు నియామకాన్ని సవాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం వచ్చే సోమవారం విచారించనున్నట్లు ప్రకటించింది.

02/09/2018 - 23:09

హైదరాబాద్‌లో అసమాన్‌ఘడ్ ప్రాంతంలో ఉన్న రైమండ్స్ సమాధి పరిరక్షణకు ఆర్కియాలజీ శాఖ నిర్మించిన ప్రహరీగోడను కూల్చివేయాలని సివిల్ కోర్డు ఆదేశాలను ధృవీకరిస్తూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్ట్ధుర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

02/09/2018 - 23:08

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర డెట్ రిలీఫ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మూడు నెలల్లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలియచేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది బీజేపీ సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

02/09/2018 - 22:13

అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 9: కర్ణాటక రాష్ట్రం హుబ్లి కేంద్రంగా మట్కా కంపెనీ నిర్వహిస్తున్న అంతరాష్ట్ర నిర్వాహకుడు వినాయక్ మేత్రాని అనే కీలక నిందితునితో పాటు గంజాయి విక్రేతలు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్ తెలిపారు. వీరి నుంచీ నాలుగు కిలోల గంజాయితో పాటు రూ.20,25,010 నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు, మట్కా సామాగ్రిని స్వాధనం చేసుకున్నారు.

02/09/2018 - 22:12

గుడిబండ, ఫిబ్రవరి 9 : మండల పరిధిలోని మద్దనకుంట, గుడిబండ రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

02/09/2018 - 04:09

మహబూబాబాద్, ఫిబ్రవరి 8: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళం బయ్యా రం మండలం అల్లిగూడెం శివారులోని మూలపోచారం గుట్టల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన మెరుపుదాడిలో ఆ దళానికి చెందిన మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి బండారి అయిలయ్య అలియాస్ వీరన్న, అతని అంగరక్షకుడు బానోత్ రాము అలియాస్ బీముడు పోలీసులకు చిక్కారు.

Pages