S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/06/2018 - 22:22

రాయచోటి, ఫిబ్రవరి 6: పట్టణంలోని మాసాపేట వేంపల్లె రోడ్డు సమీపంలో గల అజ్మత్ ట్రేడర్స్‌పై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. మాసాపేటలోని వేంపల్లె మార్గంలో గల అజ్మత్ ట్రేడర్స్ దాదాపు ఆరు సంవత్సరాలుగా అస్సాం బ్రాండ్ టీ ప్యాకెట్లను అమ్ముతున్నాడని తెలిపారు.

02/06/2018 - 03:51

పుల్లంపేట, ఫిబ్రవరి 5: మిఠాయి ప్యాకెట్ల పేర గల్ఫ్‌కు ప్రయాణికుల సాయంతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

02/06/2018 - 03:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ, కేసు దర్యాప్తులో యూపీ పోలీసులు అనుసరించిన విధానంపై హైకోర్టు తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. ఘజియాబాద్‌లో 2013లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తీర్పునిస్తూ ‘పోలీసుల్లో మానవత్వం మంటగలిసిందా?’ అని ప్రశ్నించింది.

02/06/2018 - 03:46

నెల్లూరు, ఫిబ్రవరి 5: మయన్మార్ నుండి చెన్నైకు బంగారాన్ని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని నెల్లూరు రైల్వేస్టేషన్‌లో డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రూ.1.43కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు..

02/06/2018 - 03:48

చోడవరం, ఫిబ్రవరి 5: విశాఖ జిల్లా చోడవరం నీటిపారుదల శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. సాగునీటి పారుదల శాఖ వడ్డాది విభాగంలో జేఈగా పనిచేస్తున్న ఆకుల ప్రకాష్‌ను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకోగా, ఈ వ్యవహారంలో అతనికి సహాయకుడు ప్రసాద్ కూడా దొరికిపోయాడు.

02/06/2018 - 01:55

హైదరాబాద్/ బాలాపూర్, ఫిబ్రవరి 5: నగర శివారులోని బాలాపూర్ మండలం జిల్లేలగూడలో ఓ యువకుడు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హరీందర్ గౌడ్ తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత భార్యను పిడిగుద్దులతో కొట్టి చంపేశాడు.

02/06/2018 - 01:55

అల్వాల్, ఫిబ్రవరి 5: నగర శివారులోని ప్రతిష్టాత్మక బిట్స్ ఫిలాని కళాశాల్లో ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం జవహర్‌నగర్ పోలీసులకు హస్టల్ వార్డెన్ హరిదాసు ఫిర్యాదు చేయటంతో సిఐ చలపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ కథనం ప్రకారం చెన్నైకి చెందిన రాఘవన్ శాంతారాం బిట్స్ పిలాని ఇఇఇలో మూడో ఏడాది చదువుతున్నాడు.

02/06/2018 - 01:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పరువు హత్యలపై సుప్రీం కోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమించుకున్న యువతీ యువకులు మేజర్లయతే, వాళ్ల పెళ్లిలో తలదూర్చే హక్కు ఏ వ్యక్తికీ, సమాజానికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులైనా, పంచాయితీ అయినా ఇంకెవరైనా ప్రేమికుల పెళ్లి విషయంలో జోక్యం చేసుకునే హక్కులేదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విస్పష్టంగా ప్రకటించింది.

02/05/2018 - 01:35

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4: మహిళను కత్తితో బెదిరించి ఇల్లు లూటీ చేశారు. ముసుగులు ధరించి ఇంట్లో చొరబడ్డ ఇద్దరు దుండగులు 20 తులాల బంగారు నగలు, రూ.10 వేలు దోచుకెళ్ళారు. ఈ చోరీ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

02/05/2018 - 01:29

చందుర్తి, ఫిబ్రవరి 4: రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో 28 సంవత్సరాల మతిస్థిమితం లేని యువతిపై ఇదే గ్రామానికి చెందిన రామచంద్రం (50) అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువతి ఇంటిలో ఎవరు లేని సమయంలో తలుపులు వేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.

Pages