S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/31/2017 - 02:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఏ ఖాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఎంపికయ్యారు. జాతీయ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది సభ్యులుంటే 15 మందిని లోక్‌సభ నుంచి, ఏడుగురిని రాజ్యసభ నుంచి ఎంపిక చేస్తారు.

12/31/2017 - 02:58

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 30: ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి మొన్నటి గుజరాత్ ఎన్నికల వరకు ఈవీఎంమ్‌లను ట్యాంరింగ్ చేయడంతోనే యుపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని సమజ్‌వాదీ పార్టీ ఏపి ఇన్‌ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రాయ్ ఆరోపించారు.

12/31/2017 - 02:58

లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పాతబస్తీలో ఒక మదర్సాపై దాడి చేసి అందులోని 51 మంది బాలికలకు విముక్తి కలిగించారు. మదర్సాలో చదువు పేరిట విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు లక్నో పాతబస్తీలోని యాసిన్‌గంజ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న జమై ఖదీజ్‌తుల్ కుబ్రా లిలాబ్‌నత్ మదర్సాపై దాడి చేశారు.

12/31/2017 - 02:57

ముంబయి, డిసెంబర్ 30: గురువారం అర్ధరాత్రి ముంబయి కమలా మిల్స్‌లోని ఓ పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కళ్లు తెరిచింది. నగరంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలకు శ్రీకారం చుట్టింది. ఒక్క శనివారమే దాదాపు 100 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మంది అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

12/31/2017 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వచ్చే ఎన్నికల్లో ఓట్లకోసమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఢిల్లీలో శనివారం హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ బీసీలను కులాల వారీగా విభజించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

12/30/2017 - 04:15

ఏడాది చివరి క్షణాలు దగ్గరపడుతున్నాయ. 2017 చివరి రోజు అంటే డిసెంబర్ 31న సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం ప్రకటన వెలువడుతుందన్న అంచనాలు మరింత బలపుడుతున్నాయ. దీంతో ఆయన అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. చెన్నైలో నిర్వహిస్తున్న ఆరు రోజుల ఫొటో సెషన్‌లో భాగంగా నాల్గవరోజు శనివారం అభిమానులను ఇలా అలరిస్తున్న తమిళనటుడు రజనీకాంత్

12/30/2017 - 03:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తెలంగాణలో అతి పెద్ద జాతర సమ్మక్క- సారక్క జాతరను మరో కుంభమేళాగా గుర్తించేందుకు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయేల్ ఓరాం వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ కోట్లాది మంది గిరిజనులు, భక్తులు హాజరయ్యే ఈ జాతర గురించి తెలంగాణ బీజేపీ నాయకులు తనకు వివరించినట్టు తెలిపారు.

12/30/2017 - 02:23

ముంబయి, డిసెంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చారిత్రక రీతిలో జిఎస్‌టి అమలు అన్నవి పటుతరమైన నరేంద్రమోదీ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నరు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అందులో భాగంగానే 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేశారని, అలాగే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వస్తుసేవల పన్నును కూడా అమలులోకి తీసుకొచ్చిన ఘనత మోదీనేనని అన్నారు.

12/30/2017 - 02:21

న్యూఢిల్లీ, డిసెంబరు 29: రాజ్యసభలో వివిధ మంత్రిత్వా శాఖల, వివిధ కమిటీలకు సంబంధించిన పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు ‘ఐ బెగ్ టూ’ పదాన్ని ఉపయోగించవద్దని ఛైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి ఆదేశించారు. శుక్రవారం కేంద్ర న్యాయ కార్పొరైట్ వ్యవహరాల సహాయ మంత్రి పిపి చౌదరి తన మంత్రిత్వాశాఖకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టే సమయంలో ‘ఐ బెగ్ టూ’ అని పలికారు.

12/30/2017 - 02:19

చెన్నై, డిసెంబర్ 29: రాష్ట్రంలోని పళనిస్వామి ప్రభుత్వం మరో మూడు నాలుగు నెలల్లో దిగిపోవడం ఖాయమని అన్నాడిఎంకె శశికళ వర్గం నాయకుడు దినకరన్ అన్నారు. ఇటీవల ఆర్.కె.నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన ఆయన ఎమ్మెల్యేగా శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.

Pages