S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/03/2017 - 02:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: లోక్‌పాల్‌ను నియమించడంలో, భారత్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే విమర్శించారు. ప్రధాని వైఖరికి నిరసనగా మళ్లీ ఆందోళన కార్యక్రమాన్ని చేపడతానని ఆయన హెచ్చరించారు.

10/03/2017 - 02:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ముక్త్యాల నుండి విజయవాడ వరకు గల కృష్ణా నదిని నాలుగో జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన పథకానికి ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం శంకుస్థాపన చేస్తారు. కేంద్ర జల వనరులు, రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

10/03/2017 - 02:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్వచ్ఛ భారత్ ఓ మహోద్యమంగా, ప్రజోద్యమంగా సాగినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను సాకారం చేసుకోగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 125కోట్ల మంది భారతీయుల క్రియాశీలక ప్రమేయం లేకుండా వెయ్యి మంది మహాత్మా గాంధీలు వచ్చినా స్వచ్ఛ భారత్ అన్నది సాధ్యం కాదని మోదీ విస్పష్టంగా తెలియజేశారు.

10/03/2017 - 02:06

పాట్నా/ముజాఫర్‌పూర్, అక్టోబర్ 2: బిహార్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు దాన్ని సెల్‌ఫోన్లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు యువకులతోపాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. నలుగురు యువకులు అత్యాచారం చేయగా మిగతా ముగ్గురు వారికి సహకరించారని అన్నారు.

10/03/2017 - 02:06

అహ్మదాబాద్, అక్టోబర్ 2: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడాలని షా తనదైన రీతిలో ధ్వజమెత్తారు. గుజరాతీ గ్లాసులు ధరించి చూస్తే గుజరాత్‌లో బిజెపి ఎంత అభివృద్ది చేసిందో కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. పోర్‌బందర్‌లో రెండో విడత గుజరాత్ గౌరవ్ యాత్రను షా ప్రారంభించారు.

10/03/2017 - 02:05

సేలం (తమిళనాడు), అక్టోబర్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామిల ప్రతిష్టను దిగజార్చే అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసినందుకు ఎఐఎడిఎంకె నుంచి బహిష్కృతుడయిన టిటివి దినకరన్‌పై సోమవారం కేసు నమోదు అయింది. మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం, ఎఐఎడిఎంకె స్థానిక నాయకుడు శరవనన్‌సహా దినకరన్ అనుచరులు పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

10/03/2017 - 02:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నేరస్థులు కూడా కొత్త గాలిని పీల్చాల్సిందేనని, వారికున్న కుటుంబ, సామాజిక సంబంధాలను కొనసాగించడానికి వీలుకల్పించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేరస్థులను సంస్కరించేలా నిబంధనలు ఉండాలని పేర్కొంది.

10/03/2017 - 01:59

బెంగళూరు, అక్టోబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పరుష వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు సంబంధించి తీవ్రంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ తనకొచ్చిన ఐదు జాతీయ అవార్డుల గురించి ప్రస్తావిస్తూ ‘వీటికి ప్రధాని మోదీ సహా అర్హులైన పెద్ద నటులే ఉన్నారు. ఈ అవార్డులను నేను వారికి ఇచ్చేయాలా?’ అని అన్నారు.

10/03/2017 - 20:34

125కోట్ల మంది భారతీయుల క్రియాశీలక ప్రమేయం లేకుంటే స్వచ్ఛ భారత్ విజయం సాధ్యంకాదు. జనం పూనుకోకుంటే, వెయ్యి మంది గాంధీలు, లక్షమంది మోదీలొచ్చినా స్వచ్ఛ విజయం సాధించగలిగే వాళ్లం కాదు. ఇది మరింత మహోద్యమంగా, ప్రజోద్యమంగా సాగితే నిర్దేశిత లక్ష్యాలను సాకారం చేసుకోవడం సులభం. స్వచ్ఛ్భారత్ మొదలుపెట్టినపుడు నేను చీపురు పట్టడాన్ని అనేకమంది విమర్శించారు. నన్ను తిట్టాలనుకుంటే విపక్షాలకు ఎన్నో అంశాలున్నాయి.

10/02/2017 - 02:53

చెన్నై, అక్టోబర్ 1: సినీ ప్రపంచంలో సంపాదించిన పేరు ప్రతిష్ఠలు రాజకీయ రంగంలో రాణించడానికి తోడ్పడవని, ప్రజా జీవితంలో రాణించడానికి వాటికన్నా మించినది ఉండాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తన సమకాలికడు కమల్‌హాసన్‌కు బహుశా అదేమిటో తెలిసి ఉండవచ్చని, అయితే ఆయన ఆ సీక్రెట్ తనతో పంచుకోవాలనుకోవడంలేదని కూడా ఆయన అన్నారు.

Pages