S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/07/2017 - 01:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మహాత్మా గాంధీ హత్య కేసును తిరిగి విచారించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఎ బోబ్డే, ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొద్ది సేపు ఈ కేసును విచారించిన అనంతరం ఈ కేసులో న్యాయస్థానానికి సహకరించడానికి సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది.

10/07/2017 - 01:45

అనంతగిరి, అక్టోబర్ 6: కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలో శుక్రవారం బండరాళ్లు పడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతగిరి మండలం సిమిలిగుడ- బొర్రా స్టేషన్ల మధ్య 67/18,19 మైలు రాయి వద్ద (గత్తర్) ఉదయం ఒకసారి బండ రాయి పడడంతో రైల్వే అధికారులు దీనిని తొలగించారు.

10/07/2017 - 01:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత సరుకుల నౌకను కొల్లగొట్టేందుకు పైరెట్లు జరిపిన దాడిని భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్ తిప్పికొట్టింది. ఏడెన్ జలసంధిలో భారత సరుకుల నౌక ఎంవి జగ్‌అమర్‌పై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పైరెట్లు దాడి చేయడానికి ప్రయత్నించారని అయితే ఐఎన్‌ఎస్ త్రిశూల్ వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిందని నౌకాదళ ప్రతినిధి డికె శర్మ తెలిపారు.

10/07/2017 - 01:18

న్యూఢిల్లీ, అక్టోబరు 6: సదావర్తి సత్రం భూముల హక్కులు ఎవరివో ఉమ్మడి హైకోర్టు పరిష్కరిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సదావర్తి భూముల కేసును హైకోర్టుకు డిస్పోజ్ చేస్తూ, భూములు ఆంధ్ర దేవాదాయశాఖ సంబంధించినవా? లేక తమిళనాడు ప్రభుత్వానివో తేల్చాలని ఆదేశించింది.

10/07/2017 - 01:17

ఇటానగర్/ న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 హెలీకాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో శుక్రవారం కూలిపోవడంతో అందులోని ఏడుగురు సైనిక సిబ్బంది దుర్మరణం చెందారు. ఇద్దరు పైలెట్లు సహా ఐదుగురు వైమానిక సిబ్బంది ఉన్నారని, మరో ఇద్దరు జవాన్లని అధికారులు తెలిపారు.

10/07/2017 - 01:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 6:దేశంలో విప్లవాత్మక రీతిలో అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో తలెత్తుతున్న వ్యాపార, వాణిజ్య, వర్తక, వినియోగదారుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొంత మేర ఊరట కలిగించింది. కొన్ని వస్తువులకు సంబంధించి పన్నులను తగ్గించింది. ఎగుమతిదారులకూ వెసులుబాటు కల్పించింది. గ్రానైట్ పరిశ్రమపై పన్నును 28శాతం నుంచి 18శాతానికి కుదించింది.

10/06/2017 - 03:10

హరిద్వార్, అక్టోబర్ 5: మద్యానికి యువత బానిస కావడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని అదుపు చేయకపోతే రానున్న పాతికేళ్లలో సామాజిక పరిస్థితులు మరింత దుర్భరంగా మారతాయంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించారు.

10/06/2017 - 03:12

ఆగ్రా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 5: రెండు రోజుల పాటు సాగే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) జాతీయ కార్యవర్గ సమావేశం, జాతీయ సదస్సుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, అతని సోదరుడు శివపాల్ యాదవ్ గైర్హాజరు అయ్యారు. గురువారం ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు వారిద్దరు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.

10/06/2017 - 03:01

ముంబయి, అక్టోబర్ 5: ముంబయిలోని పరేల్-ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ రైల్వే బ్రిడ్జిపై జరుగుతున్న అన్ని రకాల చిల్లర వ్యాపారులను వెంటనే ఖాళీ చేయించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) డిమాండ్ చేసింది. ఎన్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై సెప్టెంబర్ 29న జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించిన విషయం తెలిసిందే.

10/06/2017 - 02:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా ఢిల్లీలోని ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌ఒ) కుర్చీలో కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో పోలీసు స్టేషన్‌లోనూ ఆమె తన అధికార దర్పాన్ని ప్రదర్శించగా, పోలీసు సిబ్బంది ఆమెకు అనుచరుల్లాగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది.

Pages