S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/31/2015 - 16:33

చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జర్నలిస్టులు గురువారంనాడు విజయ్‌కాంత్ నివాసం ఎదుట ఆందోళన చేశారు. జర్నలిస్టులపై డీఏండీకే కార్యకర్తలపై దాడి చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

12/31/2015 - 16:19

న్యూఢిల్లీ : 2016 నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలకు, పర్యావరణానికి అనుబంధం ఏర్పడి దేశం సస్యశ్యామలంకావాలని ఆయన ఫేస్‌బుక్ ద్వారా ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని పేర్కొన్నారు.

12/31/2015 - 16:18

చెన్నై : రేపటి నుంచి తమిళనాడు దేవాలయాలలో డ్రెస్స్‌కోడ్ అమలుకానుంది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పురుషులైతే ఫైజామా, దోతి, లేదా ఫ్యాంట్ షర్ట్ ధరించాలి. మహిళలైతే చీర లేదా చుడీదాల్ (చున్నీ తప్పనిసరి), పరికిణి ఓణీ వేసుకుని గుడికి వెళ్లాలి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఈ నిబంధనల గురించి వివరిస్తూ బోర్డులు ఏర్పాటుచేశారు.

12/31/2015 - 13:48

లక్నో : అభివృద్ధితో అనుసంధానం అవ్వాలంటే గ్రామాలకు రహదారులు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన గురువారంనాడు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యరహితంగా దీని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, మహేష్‌శర్మ హాజరుకాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారు.

12/31/2015 - 13:47

చెన్నై : ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ముఖ్యమంత్రి జయలలితను ఎన్నుకున్నారు. గురువారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమెను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సమావేశం 14 తీర్మానాలను ఆమోదించింది.

12/31/2015 - 11:41

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నగరంలో 14 రోజుల శీతాకాల విడిది అనంతరం గురువారం ఉదయం దిల్లీకి పయనమయ్యారు. హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. కాగా, జనవరి 3 నుంచి వారం రోజులపాటు బొల్లారంలోని రాష్టప్రతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలకు అనుమతిస్తారు.

12/31/2015 - 11:39

చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో గురువారం ఉదయం ఆటోను మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు.

12/31/2015 - 11:37

శ్రీనగర్: పుల్వామ జిల్లా గుస్సు గ్రామం వద్ద గురువారం ఉదయం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ గ్రామానికి ఉగ్రవాదులు వస్తున్నారన్న సమాచారం అందడంతో సాయుధ దళాలు, పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని దాడులు ప్రారంభించాయి. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.

12/31/2015 - 07:16

వర్కాల (కేరళ), డిసెంబర్ 30: మత విద్వేషాలు, అనుమానాలను వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రముఖ సంఘ సంస్కర్త నారాయణ గురు వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి మతతత్వ శక్తులు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం పరోక్షంగా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.

12/31/2015 - 07:13

ఇండోర్, డిసెంబర్ 30: మూగ, చెవిటి అమ్మాయి గీతను తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్తాన్‌లో ప్రవేశించిన గీతను అక్టోబర్ 26న భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాక్‌లోనే ఓ స్వచ్ఛంద సంస్థ వద్ద ఆశ్రయం పొందిన ఆమెను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది.

Pages