S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపికి వెలంపల్లి గుడ్‌బై!

పాతబస్తీ, డిసెంబర్ 10: మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ బిజెపికి రాజీనామా చేసి ఈ నెల 13, లేదా వచ్చే జనవరి 26న అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2009లో సినీహీరో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరఫున ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటంతో వెలంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో ఆఖరి నిమిషంలో బిజెపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి తగిన మద్దతు లభించక పోవటంతో ఆయన ఓటమిపాలయ్యారు. అంతకుముందు టిడిపిలోకి రావడానికి యత్నించినా అసెంబ్లీ సీటు గ్యారంటీ లేక బిజెపిలో చేరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సిఎం పెద్దపీట

పటమట, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని సాంఘిక, గిరిజన సంక్షేమం, సాధికారత శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శనివారం 4వ డివిజన్ మాచవరం యారం వారి వీధిలో 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కల్యాణ మండపానికి ఆయన శంకుస్థానన చేశారు. అనంతరం పసుపు, కుంకమ కింద 153 డ్వాక్రా సంఘాలకు 46 లక్షల రూపాయల బ్యాంకు పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో కలిసి మంత్రి అందచేశారు.

బ్యాంకులకు సెలవులతో సామాన్యులు సతమతం

పాయకాపురం, డిసెంబరు 10: పెద్దనోట్ల రద్దు, అవసరానికి తగ్గట్లు కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం, పాత వంద నోట్లు తగినన్ని లేకపోవడం.. కలగలిసి సామాన్యుడికి నరకం చూపిస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుండి పాల ప్యాకెట్‌తో మొదలుకుని రాత్రి నిద్రించడానికి ముందు మస్కిటోకాయిల్ వరకు ప్రతిదీ రూపాయితో ముడిపడి ఉండటంతో అవసరానికి అనుగుణంగా నగదు సమకూరకపోవడంతో సామాన్యులు సతమతవౌతున్నారు. తమ డబ్బును బ్యాంక్ నుండి తీసుకోవాలన్నా గంటల తరబడి క్యూలైన్లలో కష్టాలు పడాల్సిరావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

నానక్‌రాంగుడా బాధితులకు ఆర్థిక సాయం

విజయనగరం, డిసెంబర్ 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగుడాలో ఏడంతస్తుల భవనం కూలిన సంఘటనలో జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాతపడిన విషయం విధితమే. శనివారం ఉదయం రెండు అంబులెన్స్‌లు, సాయంత్రం ఒక అంబులెన్స్‌లో మృతదేహాలను ఆయా స్వస్థలాలకు తరలించారు. మృత్యువాత పడిన వారిలో బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నేతేటి సాంబయ్య (45), పైడమ్మ (40), గౌరీశ్వరి (13) ఉన్నారు.

గీతాబోధ

భగవద్గీతను అవగాహన చేసుకొంటే సులభంగా ఈ భవసాగరాన్ని ఈదవచ్చు. భగవద్గీతను పఠిస్తే చాలు సగుణాకార పూజనుంచి నిర్గుణపూజ విధానానికి మారుతారు. ప్రతి రోజు అతిశ్రద్ధతో పూలుపరిమళాలద్ది పూజించే పరమాత్మను నిస్సంగునిగా తెలుసుకొంటారు. వారు సంసారజీవితంలో ఉంటూనే నిస్సంగత్వాన్ని అలవర్చుకుంటారు. అందరిలో ఉన్న పరమాత్మ అంశాన్ని గుర్తించే నైపుణ్యాన్ని అలవాటుచేసుకొని అందరియెడ సమబుద్ధిని ప్రదర్శించే చిత్తాన్ని ఏర్పరుచుకుంటారు.

- సాయకృష్ణ

పోలవరం నిర్వాసితుల కోసం 18 కాలనీలకు ప్రణాళిక

ఏలూరు, డిసెంబర్ 10 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకోసం కొత్తగా 18 ఇళ్లకాలనీలను ఆధునిక వసతిసౌకర్యాలతో ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

కాశీఖండం 85

అశ్వమేథ రాజసూయాధ్వరాలు చేసి సముపార్జించిన పుణ్యఫలాలు కాశీపురిలో మూడు రాత్రులు శయనించినంత మాత్రాన సమకూరుతాయి. తులా పురుషదానం (మానవుడు త్రాసులో తూగి ఆ ఎత్తు ధనం దానమివ్వడం) చేసిన ఫలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే సిద్ధిస్తుంది.

శ్రీపాద కృష్ణమూర్తి

తాడోపేడో...

శ్రీకాకుళం: తమ సమస్యలపై తాడోపేడో తేల్చుకునేందుకు కాంట్రాక్టు లెక్చరర్లు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరవధిక సమ్మెలు వంటి నిరసనలకు సైతం ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారంతా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన బూటకపు భరోసా అంటూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.

కొత్త స్నేహితులు 39

చివరకు అనుకున్న రోజు వచ్చేసరికి అతడి మానసిక ఆందోళన మరింత పెరిగింది. అందుకే.. ఆమెనక్కడ చూడడంతో అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
అదే ఊపులో ఆమె ముందుకు వెళ్లి, ‘‘సాహిత్యా’’ అని పిలిచాడు. అతడి మనసులో ఉప్పొంగుతోన్న సంతోషం అతడి కంఠస్వరాన్ని అదుపు చేయలేకపోవడంతో అతడి పిలుపు కూడా అరుపులా వినిపించింది సాహిత్యకూ, ఆమె పక్కన కూర్చున్నవాళ్లకూ.
సాహిత్యకు ఓవైపు ఒక నడి వయసు ఆవిడా, మరోవైపు ఇంచుమించు సామ్రాట్ వయసే వున్న ఒక యువకుడూ కూర్చుని ఉన్నారు. సాహిత్యతోపాటు వారిద్దరూ కూడా సామ్రాట్ పిలిచిన తీరుకు ఓసారి అతడివైపు చూశారు.

సీతాసత్య

ఎటిఎంల్లో నోక్యాష్

ఒంగోలు,డిసెంబర్ 10:బ్యాంకులకు మూడురోజులు సెలవులు కావటంతో ఆయాశాఖల పరిధిలోని ఎటిఎంలన్నీ నోక్యాష్‌బోర్డులు పెట్టేశాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు నగదుకోసం పడిగాపులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుండే కొన్ని ఎటిఎంల వద్ద ఖాతాదారులు క్యూకట్టినప్పటికీ గంటల వ్యవధిలోనే నగదు అయిపోయి నోక్యాష్ అంటూ బోర్డులు దర్శనమివ్వటంతో ప్రజలు ఏమిచేయాలో అర్ధంకాక కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల తీరుపై తూర్పురపడుతున్నారు.

Pages