S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీళ్లని చూసి గర్విస్తున్నా

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి, దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసిన అమ్మాయిలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలను గెల్చుకున్న పివి సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లర్) తోపాటు, జిమ్నాస్టిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ఈఏడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన షూటర్ జీతూ రాయ్ ఆదివారం ప్రధానిని కలిశారు. సోమ వారం క్రీడా పురస్కారాల ప్రదానం జరగను నేపథ్యం వీరు ఇక్కడికి వచ్చారు. కాగా, ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అమ్మాయిల శక్తిసామర్థ్యాలు ఏమిటో సింధు, సాక్షి, దీప నిరూపించారని అన్నారు.

కళాత్మక టెన్నిస్ విందు రెడీ

న్యూయార్క్, ఆగస్టు 28: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఒకటి, ప్రతి ఏడాదీ ఆఖరు జరిగే యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. పవర్ ప్లేకు కాకుండా కళాత్మక విలువలకు అద్దం పట్టే ఈ టోర్నమెంట్‌లో విజేతలు ఎవరైనా, ప్రతి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ వేటను కొనసాగించనున్నాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఫ్లావియా పెనెట్టా కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ హాట్ ఫేవరిట్‌గా మారింది.

ఇది ఆరంభమే

హైదరాబాద్, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ ప్రస్థానంలో ఇది ఆరంభం మాత్రమేనని, వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత ‘లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ అన్నాడు. బాడ్మింటన్ స్టార్, తెలుగు అమ్మాయి సింధు రియోలో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని గెల్చుకున్న విషయం తెలిసిందే. మూడో స్థానాన్ని తృటిలో చేజార్చుకొని, నాలుగో స్థానంతో సంతృప్తి చెందినప్పటికీ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ లక్షలాది మంది అభిమానులను సంపాదించింది. చివరి క్షణం వరకూ ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

సానియాకు కనెక్టికట్ టైటిల్

న్యూ హవెన్ (అమెరికా), ఆగస్టు 28: భారత టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా ఇక్కడ జరిగిన కనెక్టికట్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రుమేనియాకు చెందిన మోనికా నికులెస్క్యూతో కలిసి బరిలోకి దిగిన ఆమె ఫైనల్‌లో కాతెరినా బొండరెన్కో (ఉక్రెయిన్), చువాంగ్ చియా జంగ్ (తైవాన్) జోడీని 7-5, 6-4 తేడాతో ఓడించింది. యుఎస్ ఓపెన్ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, సానియా మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం.

chitram.. కనెక్టికట్ ట్రోఫీతో మోనికా, సానియా జోడీ

వర్షంతో రెండో టి-20 రద్దు!

లాడెర్‌హిల్ (అమెరికా), ఆగస్టు 28: భారత్, వెస్టిండీస్ జట్ల ఆదివారం నాటి చివరి, రెండో టి-20 మ్యాచ్‌కి వర్షం కా రణంగా రద్దయంది. వర్షం వల్ల కొంత, అవుట్ ఫీల్డ్‌పై గుంట లు ఏర్పడడం వల్ల మరికొంత ఇబ్బంది తలెత్తడంతో, ఆట జ రగడం అసాధ్యంగా మారింది. ఆదివారం ఉదయం జల్లులు కురుస్తుండడంతో ఆట ఆలస్యంగా ఆరంభమైంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసే వరకూ ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. అయతే, భారత్ ఇ న్నింగ్స్ ఆరంభమై, కేవలం రెండు ఓవర్లు బౌల్ అయన వెంటనే మళ్లీ వర్షం కురవడంతో ఆటకు అంత రాయం ఏర్పడింది.

లంక క్రికెటర్లపై దాడి చేసిన ఉగ్రవాదుల కాల్చివేత!

లాహోర్, ఆగస్టు 28: లాహోర్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వెళుతున్న శ్రీలంక క్రికెటర్లపై దాడికి తెగబడిన నలుగురు ఉవ్రాదులను హతమార్చినట్టు పాకిస్తాన్ పోలీస్ అధికారులు ప్రకటించారు. 2009లో జరిగిన ఆ సంఘటనలో తొమ్మిది మంత్రి పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా, ఆరుగురు క్రికెటర్లు స్వల్పంగా గాయపడ్డారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే లంక ఆటగాళ్లు పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కెన్యా, జింబాబ్వేలను మినహాయిస్తే, ఏ జట్టూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు. ఫలితంగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో పాక్ హోం సిరీస్‌లను ఆడుతున్నది.

‘ఒప్పందం’ లేదని ఒప్పుకున్న కాంగ్రెస్

మహారాష్టత్రో ఒప్పందాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 24న బేగంపేట విమానాశ్రయం వద్ద చేసిన సవాలు, అందుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అదేరోజు మీడియా సమావేశంలో చెప్పిన మాటలు, మరునాటి ఉదయం టివి చానళ్లలో జరిగిన చర్చల తర్వాత ఒక విషయం సందేహాలకు అతీతంగా స్పష్టమైంది. లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ్మిడిహట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు మహారాష్టత్రో ‘ఒప్పందం’ జరిగిందనే మాట నిజం కాదు. ‘ఒప్పందం’ జరిగిందంటూ ఇంతకాలం వాదించిన కాంగ్రెస్ నే తలు ఇపుడు కెసిఆర్ సవాలు తర్వాత వెనక్కు తగ్గి అది ‘‘సూత్రప్రాయ అంగీకారం’’ మాత్రమేనని ఒప్పుకుంటున్నారు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)

అవినీతి చైనా

చైనాలో రాజకీయ, అధికార అవినీతికి వ్యతిరేకంగా భారీ ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయన్నది ఇటీవల ప్రముఖంగా ప్రచారవౌతున్న సమాచారం. అవినీతి దశాబ్దులపాటు విస్తరించిపోయిందని వ్యవస్థీకృతమయిందని దీనివల్ల ధ్రువపడిన సంగతి మాత్రం చైనా ప్రభుత్వం వారు, దేశ విదేశాలలోని చైనా ప్రశంసకులు దాటవేస్తున్నారు. ఈ ప్రశంసకులు, చైనా ప్రగతిని అనుకరించాలని ప్రచారం చేస్తున్నవారు మన దేశంలో సైతం దండిగా ఉన్నారు. చైనాకు వెళ్లి ప్రగతి పాఠాలు నేర్చుకుని వస్తున్న మన దేశపు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అధికార అనధికార రాజకీయవేత్తలు చైనాను మనం అనుకరించాలని దశాబ్దులపాటు మన ప్రజలకు బోధిస్తున్నారు.

కశ్మీర్‌లో మిర్చీ ‘తూటాల’ ప్రయోగం!?

కశ్మీర్‌లో అల్లర్లు భారతదేశ అంతర్గత సమస్యయే. కాదని ఎవరంటారు? కాశ్మీరే భారత్ యొక్క అంతర్గత సమస్య అయినప్పుడు- నలభై ఎనిమిది రోజులుగా సాగుతున్న ఆందోళన అనండి- అల్లర్లు అనండి. ఏ పేరు పెట్టినా చాలామంది జనాలు భద్రతాదళాల ‘‘గన్ పెల్లెట్’’లను కంకర రాళ్లతో ఎదుర్కొంటున్నారు.
కశ్మీర్ హమారా అన్న గోల కాకిగోలగా యితరులకు అనిపిస్తే, అది పూర్తిగా వాళ్ల తప్పుకాదు. ఎంతసేపూ ‘‘కాశ్మీర్ మాదేనం’’టున్న రాజకీయ కంఠాలు- పాలకుల నినాదాలు- కశ్మీర్ రెండుముక్కలై వున్నదీ అన్న సంగతి గట్టిగా అనరు.

తెలుగుపై నిర్లక్ష్యం తగదు

తెలుగు మన మాతృభాష. మధురమైన భాష. వనె్న తరగని భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిన భాష. అచ్చ తెలుగు నుడికారాలు, ఛందస్సులు, పదప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాల వారీగా యాసలు మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ఆధునిక తెలుగుభాషా సాహిత్య యుగకర్త అయినటువంటి గిడుగు వెంకట రామమూర్తి జయంతి (ఆగస్టు 29)ని మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే.. 2025 సంవత్సరానికి హిందీ తప్ప మలయాళీ, బెంగాలీ, తమిళం మాత్రమే ప్రాంతీయ భాషలుగా ఉంటాయి. తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉందని యునెస్కోవారు చెపుతుంటే అది విన్న ప్రతీ తెలుగువాడి గుండె కలుక్కుమనక మానదు.

- కూసంపూడి శ్రీనివాస్ సెల్: 9000165971

Pages