S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా

ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని కోట్లాది మంది ఆంధ్రులు ధర్నాలు, నిరసనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లు ఆమోదించారు. 01-4-2014 కేంద్ర మంత్రి వర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఐదు కాదు, పది సంవత్సరాలు అడుగుతామని రాజ్యసభ దృశ్యాలు, వార్తలలో అందరూ చూసినదే. తిరుపతి సభలో ప్రధాని మోదీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ఆధారాలు ప్రజలు వేలెత్తి చూపుతున్నాయి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానంతో కోట్లాది మంది ఆంధ్ర ప్రజ లు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

‘దురంతో’లో సాంకేతిక లోపం

వరంగల్, ఆగస్టు 28: సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన దురంతో ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే అందులోని ఎసి కోచ్ మొరాయించింది. ఎసి పనిచేయకపోవడంతో ప్రయాణికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైలును అక్కడి నుంచి కాజీపేట వరకు తీసుకొచ్చారు. కాజీపేటలో మరమ్మతుకు ప్రయత్నించిన కాకపోవడంతో ఎసి కోచ్‌ను తొలగించి అందులో ఉన్న దాదాపు 70మంది ప్రయాణికులను కాజీపేట రైల్వేస్టేషన్‌లో దింపివేసి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వారందర్ని వరంగల్ రైల్వేస్టేషన్ తరలించారు.

మొక్కల పెంపకంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలి

నరుూంనగర్, ఆగస్టు 28: విద్యార్ధులకు పాఠశాల స్థాయి నుండి మొక్కల పెంపకంపై ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలపై వరల్డ్ పిస్ ఫెస్టివల్ సోసైటీ సభ్యులు ఆదివారం పోలీసు కమిషనర్‌ను క్యాంపుకార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

గోదావరి జలాలతోనే గ్రామాలు సస్యశ్యామలం

స్టేషన్ ఘన్‌పూర్, ఆగస్టు 28: గోదావరి జలాలతోనే నియోజకవర్గంలోని గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పధకంలో ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాలను తూం ద్వారా పంట పొలాలకు ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 1.58 టిఎంసి సామర్ధ్యం గల ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి దిగువనున్న 700 ఎకరాలకు సాగునీరు అందివ్వడం జరుగుతుందన్నారు.

మళ్లీ రియల్ బూమ్!

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేయనున్న కొత్త జిల్లాల ఏర్పాటు రియలెస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండటంతో ఆయా జిల్లాలో రియలెస్టేట్ రంగం మరింత ఊపందుకుంటోంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న మహాబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భూముల ప్రభావం ఎక్కువగాఉంది. ఈ రెండు జిల్లాల పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గత రెండు నెలల కాలంగా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక్కో ఎకరానికి కోటిన్నరకుపై ధర పలకడంతో రైతులు కూడా వ్యవసాయ పనులు మానేసి సాగు భూములు అమ్మకానికి పెడుతున్నారు.

వరంగల్‌ను విడదీస్తే చరిత్రహీనులే..

వరంగల్, ఆగస్టు28: హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం హన్మకొండలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదనలో హన్మకొండ జిల్లా ప్రతిపాదన ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ లేకుండానే ముఖ్యమంత్రి కెసిఆర్ హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తేవడంలో ఉద్ధేశమేమిటని ఆమె ప్రశ్నించారు.

శాయంపేట హవేలిలో వరంగల్ జిల్లా కేంద్రం?

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూనే మరోవైపు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. కొత్తగా ప్రతిపాదించిన హన్మకొండ జిల్లా కేంద్రాన్ని ఇప్పటి వరకు వరంగల్ జిల్లాగా కొనసాగుతున్న కార్యాలయాల్లోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటూ వరంగల్ జిల్లా కేంద్రాన్ని నగరానికి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న శాయంపేట హవేలిలో నూతన భవనాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శాయంపేట హవేలి- రాయనిగుంటూరుపల్లి-చింతలపల్లి మధ్య ఉన్న దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు.

భూముల ధరలకు రెక్కలు

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 28: పెద్దపల్లి జిల్లాగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా జారీ చేసిన నేపథ్యంలో పెద్దపల్లి ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 10 రోజుల కిందట భూమి కొనడానికి ముందుకు రాని వారు ఇప్పుడు నచ్చితే అంత అయిన పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ వ్యాపారులు అందినంత దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అన్నింటికి కేంద్ర బిందువుగా ఉండటంతో పాటు రైల్వే జంక్షన్, రాజీవ్ రహదారిలో 24 గంటల రవాణా సదుపాయం ఉండటంతో పాటు జిల్లాగా ఏర్పాటు అవుతుండటంతో అందరి చూపు పెద్దపల్లిపైన పడుతుంది.

టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదం

సిరిసిల్ల, ఆగస్టు 28: సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్ పార్కులోని తుక్కు గోదాములో షార్కు సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. గోదాములోని మూడు తుక్కు మిషనరీలు, భవనం, తుక్కు నిల్వలు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం కావడంతో పార్కులో యూనిట్లు మూసి ఉండడడంతో జన సంచారం లేరు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో తుక్కు లోడ్ అన్‌లోడ్ చేసిన కొద్ది సమాయానికే అగ్ని ప్రమాదం జరిగింది.

సిద్దిపేటలో కలుపొద్దు

కోహెడ, ఆగస్టు 28: నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలాన్ని చేర్చవద్దంటూ మండలంలోని వరికోలుకు చెందిన రైతు జాప మల్లారెడ్డి గ్రామ చావడి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో మండలాన్ని కలుపొద్దని ఆందోళనలు చేస్తున్నా స్పందన రాకపోవడంతో తానీ దీక్షకు పూనుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం దీక్షను ప్రారంభించిన ఆదివారం వెలుగులోకి రావడంతో మండలంలోని టిఆర్‌ఎస్ మినహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులు గ్రామం చేరుకొని మల్లారెడ్డికి సంఘీభావం ప్రకటించారు.

Pages