S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేతనాల చెల్లింపులో జాప్యం వద్దు

విశాఖపట్నం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు త్వరగా వేతనాలు చెల్లించడం ద్వారానే ఆ పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి తెలిపారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వద్దని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై 3వ అంతరాష్ట్ర అవగాహన సదస్సును ఆమె విశాఖలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 11 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పథకం దేశంలో 661 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, 12 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు.

వాయుసేన విమానం కోసం ఏజెన్సీలో గాలింపు

రాజవొమ్మంగి, ఆగస్టు 4: గల్లంతైన వాయుసేవ విమానం కోసం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గురువారం కూడా హెలీకాప్టర్ల సహాయంతో గాలింపు చేపట్టారు. గత నెల 22న చెన్నై నుండి ఎఎన్ 32 అనే విమానం గల్లంతైన విషయం విదితమే. దాని జాడ నేటివరకు తెలియకపోవడంతో పలుమార్లు వాయుసేన, నేవీ అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లా సరిహద్దున ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలినట్టు అధికారులు భావించడంతో పలుమార్లు గాలింపు చేపడుతున్నారు.

తెలంగాణలో మరో ఐదు మద్యం డిపోలు

ఖమ్మం, ఆగస్టు 4: మద్యాన్ని దుకాణాలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కొత్తగా ఐదు మద్యం డిపోలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల పరిధిలో ఇప్పటికే 17మద్యం డిపోలు ఉండగా, కొత్తగా మరో 5ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోనే కొత్త డిపోలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, నల్గొండ జిల్లా సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట, రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, మెదక్ జిల్లా సిద్ధిపేటలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

పుష్కరాల్లో సమర్థత నిరూపించుకోండి

విజయవాడ, ఆగస్టు 4: పుష్కరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమర్థత నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాత్రికుల సేవకు, ప్రజా సేవకు కృష్ణా పుష్కరాలు ఒక అవకాశం అని అన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. పుష్కర పనులను అధికారులు అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. ఘాట్‌ల వద్ద బారికేడింగ్ పగడ్బందీగా ఉండాలని చెప్పారు. ఘాట్‌లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, సుందరీకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు.

వాల్తేరు డివిజన్‌లో తొలి మహిళా గూడ్స్ గార్డ్

విశాఖపట్నం, ఆగస్టు 4: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రప్రథమంగా మహిళ తొలిసారిగా గూడ్స్ గార్డుగా విధుల్లో చేరి వార్తల్లో నిలిచారు. విశాఖ మర్రిపాలెం మార్షలింగ్ యార్డు నుంచి రాయగడకు వెళ్ళే గూడ్స్‌రైలులో ఆమె గార్డుగా గురువారం విధులు ప్రారంభించారు. యుహెచ్ లక్ష్మి గూడ్స్ గార్డుగా అర్హత పొంది డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన ఈమె 2015 నవంబర్‌లో ఎస్‌ఐఎన్‌ఐ, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందింది. రైల్వేలో పనిచేస్తున్న భర్త చనిపోవడంతో ఆ ఉద్యోగాన్ని ఈమెకు ఇవ్వగా 2011లో వాల్తేరు డివిజన్‌లో ట్రైనీ క్లర్క్‌గా ఉద్యోగంలో చేరింది.

హోటళ్లలో గదుల కేటాయంపుపై శ్రద్ధ వహించాలి

విజయవాడ, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాల సందర్భంగా హోటళల్లో రూములు కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారి దిశానిర్దేశం మేరకు కేటాయింపులు జరపాలని అందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని హోటల్ యజమానులకు సబ్ కలెక్టర్ జి సృజన తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నగరంలోని 105 హోటళ్ల ప్రతినిధులతో ఆమె, ట్రైనీ కలెక్టర్ డికె బాలాజీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 12 నుండి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన్నట్లు ఆమె పేర్కొన్నారు.

విద్యాభివృద్ధికి పెద్దపీట

కైకలూరు, ఆగస్టు 4: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని, విద్య, వైద్యం రెండూ సమాజానికి కళ్లులాంటివని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కైకలూరు జూనియర్ కళాశాలలో రూ.65 లక్షలతో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు గదులను మంత్రి డా.కామినేని శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి రూ.21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు.

పల్లెర్లమూడిలో మంత్రి ఉమ మకాం!

నూజివీడు, ఆగస్టు 4: రాష్ట్ర మంత్రి మండలిలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన మంత్రి, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ద్వారా జలాలు గలగలా పారించి, లక్షలాది ఎకరాల వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తూ, దేశంలోనే ప్రప్రథమంగా నదులను అనుసంధానం చేసిన ఘనత పొందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు రోజులుగా నూజివీడులో తిష్టవేసి అధికారులను, గుత్తేదారులను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రివేళ సైతం ఇక్కడే మకాం వేసి, మడత మంచంపైనే నిద్రిస్తూ, అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. జలవనరుల శాఖ పేషీ నూజివీడు వచ్చిందా?..

విద్యాభివృద్ధికి పెద్దపీట

కైకలూరు, ఆగస్టు 4: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని, విద్య, వైద్యం రెండూ సమాజానికి కళ్లులాంటివని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కైకలూరు జూనియర్ కళాశాలలో రూ.65 లక్షలతో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు గదులను మంత్రి డా.కామినేని శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి రూ.21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు.

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి

నాగాయలంక, ఆగస్టు 4: మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండల పరిధిలోని భావదేవరపల్లి గ్రామంలో గురువారం మండలి వెంకట కృష్ణారావు ఫిషరీష్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్ర నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మత్స్య పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.34 వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుందన్నారు. కోస్తా తీరప్రాంతంలోని మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

Pages