S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/22/2017 - 03:26

నెల్లూరు/విజయవాడ, డిసెంబర్ 21: నెల్లూరులోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న కృష్ణకిషోర్ ఇంట్లో గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ఆర్టీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనపై అవినీతి ఆరోపణలు రావటంతో ఇటీవల విజయవాడలోని రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి తాత్కాలికంగా బదిలీ చేశారు.

12/22/2017 - 03:23

తిరుపతి, డిసెంబర్ 21: సిఫార్సు ఉత్తరాలపై శ్రీవారి దర్శించుకోడానికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ, వడ ధరలను గురువారం నుంచి టీటీడీ అయితే, సాధారణ భక్తులకు విక్రయించే లడ్డూలకు ఈ పెంపు వర్తించదని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు విలేఖరులకు తెలిపారు. శ్రీవారిని కాలినడకన, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవ, వీఐపీ దర్శనం చేసుకునే భక్తులకు లభించే లడ్డూల ధరలను యథాతథంగా ఉంచామన్నారు.

12/22/2017 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 21: మరో ప్రేమోన్మాది ఘాతుకమిది. తనను ప్రేమించని ఓ యువతిపై పెట్రోలు పోసి తగులబెట్టిన హృదయ విదారక సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లాలాగూడకు చెందిన యువతి సంధ్యారాణి (22) తనను ప్రేమించడం లేదంటూ కార్తీక్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

12/20/2017 - 23:28

భాషా వికాసంపై పెరుగుతున్న అంచనాలు తెలుగు మహాసభలు విజయంపై ఆనందం
భవిష్యత్ భాషా ప్రణాళకలపై సర్కారు దృష్టి విజయోత్సవ స్ఫూర్తితో మరింత ముందుకు

12/20/2017 - 23:27

ఎక్కడ వేసిన విభజన గొంగళి అక్కడే మూడేళ్లు గడచినా ఎటూతేలని వ్యవహారం
9, 10 షెడ్యూల్స్ నిధులు బ్యాంకుల్లోనే.. నీటి వినియోగంపై కరవైన సమన్వయం

12/20/2017 - 23:24

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలకు తోటి తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు పిలిచారా? లేదా? పిలవకపోతే ఎందుకు పిలవలేదు? పిలిస్తే బాబెందుకు రాలేదు? అన్న ప్రశ్నలు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రజల్లో పజిల్‌లా మారాయ. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ సీఎం కేసీఆర్ తరఫున ఒకరు చంద్రబాబుకు అత్యంత అనుంగు అనుచరుడితో మాట్లాడారు.

12/20/2017 - 03:35

భద్రాచలం టౌన్, డిసెంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలక్కం కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంపై స్వామిని ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/20/2017 - 03:33

తిరుపతి, డిసెంబర్ 19: టీటీడీ నిర్వహిస్తున్న గోసంరక్షణ పథకానికి ముంబైకి చెందిన ఒక ప్రవాస భారతీయుడు రూ.11.11 కోట్లను విరాళంగా ఇచ్చాడు. చెక్కు రూపంలో ఇచ్చిన ఈ మొత్తాన్ని టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఎస్వీ డైరీ ఫాం డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి మంగళవారం స్వీకరించారు. తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని పేరు చెప్పడానికి కూడా ఆభక్తుడు ఇష్టపడలేదు.

12/20/2017 - 01:47

హుస్నాబాద్, డిసెంబర్ 19: ఆర్థిక ఇబ్బందులు రైతు కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాయ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలంలోని తురుకవాణికుంటలో మంగళవారం ఈ సంఘటన పలువురిని కంటతడిపెట్టించింది. మృతుల బంధువుల వివరాల ప్రకారం..

12/20/2017 - 01:47

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణలో తెలుగుభాష పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలోని డాక్టర్ యశోధారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికపై జరిగిన ప్రవాస తెలుగు వారి భాష సాంస్కృతిక విద్యా విషయాల గోష్టికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి యుఎస్ నుండి వచ్చిన జాగృతి అధ్యక్షుడు నారాయణస్వామి వెంకటయోగి అధ్యక్షత వహించారు.

Pages