S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2017 - 02:14

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తన వందవ నోటిఫికేషన్‌ను సోమవారం నాడు విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, కార్యదర్శి ఎ వాణి ప్రసాద్‌లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చైర్మన్ సోమవారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడారు.

12/19/2017 - 02:13

హైదరాబాద్, డిసెంబర్ 18: కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదటి, రెండవ దశకు ఇప్పటికే అటవీశాఖ అనుమతి లభించగా అతి కీలకమైన పర్యావరణ అనుమతి కూడా సోమవారం లభించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని ప్రాజెక్టుల ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఇఎసి) సోమవారం స్పష్టం చేస్తూ పర్యావరణ అనుమతిని జారీ చేసింది. ఇది తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు.

12/19/2017 - 01:58

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా లఘు చిత్రాల కేటాగిరిలో మొదటి ఉత్తమ లఘు చిత్రంగా ‘తంగేడు పూవులు’ ఎంపికయ్యిందని, రెండవ ఉత్తమ లఘు చిత్రం అద్దిలు, మూడవ ఉత్తమ లఘు చిత్రంగా నది ఎంపికైనట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

12/19/2017 - 01:54

హైదరాబాద్, డిసెంబర్ 18: శతక, సంకీర్తనా, గేయ సాహిత్యం రసరమ్యమైనదని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో శతకాలకు, సంకీర్తనలకు, గేయసాహిత్యానికి కొరత లేదని పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై శతక సంకీర్తనా, గేయ సాహిత్యం అంశంపై జరిగిన చర్చా గోష్టిలో దేవాదాయ మంత్రి సి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు.

12/19/2017 - 01:53

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి 12 వరకు తెలుగును తప్పని సరిచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిఎం కెసిఆర్ తెలుగు గురించి ఎంత ఆలోచిస్తున్నారో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతుందని అన్నారు.

12/19/2017 - 01:21

ధర్మవరం, డిసెంబర్ 18: రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెచ్చి ప్రజలను కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్ర 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో కొనసాగింది. నడిమిగడ్డపల్లి క్రాస్‌నుంచి బిల్వంపల్లి, నేలకోటతండా, నేలకోట గ్రామాల్లో మహిళలు జగన్‌ను చుట్టుముట్టి సమస్యలు విన్నవించారు.

12/19/2017 - 01:19

అనంతపురం, డిసెంబర్ 18: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీప్రసన్న (24) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. గోరంట్లకు చెందిన లక్ష్మీప్రసన్న యూనివర్సిటీ గోదావరి హాస్టల్‌లో ఉంటూ ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం 306వ నెంబరు గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

12/19/2017 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రముఖ సంస్కృత పండితురాలు డాక్టర్ ముదిగొండ ఉమాదేవి (71) సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. డాక్టర్ ఉమాదేవి ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ సతీమణి. ఎన్నో పుస్తకాలు, ఉపనిషత్‌లు, సంస్కృత కావ్యాలను ఉమాదేవి రాశారు.

12/19/2017 - 00:53

హైదరాబాద్, డిసెంబర్ 18: హిందీలో విద్వాన్, భూషణ్ డిగ్రీలు ఉన్న వారు సంప్రదాయ డిగ్రీతో సమానంగా తెలంగాణ ప్రభుత్వం భావించిన పక్షంలో వారిని సైతం హిందీ పండిట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టునకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

12/19/2017 - 00:48

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించి నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది డిసెంబర్ 19న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో 21 ఫిబ్రవరి 2013లో జరిగిన బాంబు దాడిలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Pages