S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/21/2017 - 02:56

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో అతిపెద్ద జౌళి పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వరంగల్‌లో 22న సిఎం కెసిఆర్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్ధాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి కెటి రామారావు శుక్రవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఫైబర్ టు ఫ్యాషన్ పద్ధతిలో (నూలు పోగు నుంచి బట్టల తయారీ వరకు) కావాల్సిన అన్ని అధునాతన వసతులను పార్కులో ఏర్పాటు చేయనున్నట్లు కెటి రామారావు చెప్పారు.

10/21/2017 - 03:01

హైదరాబాద్, అక్టోబర్ 20: ‘నీ సంగతి చంద్రబాబు వద్దే తేల్చుకుంటాం’ అని టి.టిడిపి సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, ‘మీ సంగతీ బాబు వద్దే తేలుస్తా’ అని రేవంత్ రెడ్డి పరస్పరం ధ్వజమెత్తారు.

10/21/2017 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 20: శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి తెరాస సన్నహాలు మొదలెట్టింది. అదే సమయంలో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను ప్రజలకు కూలంకషంగా వివరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

10/21/2017 - 03:03

అమరావతి, అక్టోబర్ 20: సేద్యాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షలు చేయించి, ఏ ప్రాంతానికి ఏ పంట వేయాలో కర్షకులకు కచ్చితమైన మార్గదర్శనం చేస్తామని అన్నారు.

10/21/2017 - 02:37

అమరావతి, అక్టోబర్ 20: అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం న్యూయార్క్ చేరుకున్నారు. అయోవా నుంచి న్యూయార్క్ చేరుకున్న ఆయన బృందానికి ఘన స్వాగతం లభించింది. తెలుగువారు బాబు బృందానికి స్వాగతం పలికారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా టవర్స్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.

10/21/2017 - 02:36

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: రాష్డ్ర డిజిపిగా నండూరి సాంబశివరావును కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి డిజిపిగా వ్యవహరిస్తున్న సాంబశివరావునే పూర్తిస్థాయి హోదాలో మరో రెండేళ్ల పాటు కొనసాగించే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

10/21/2017 - 02:33

అమరావతి, అక్టోబర్ 20: ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే ప్రసక్తిలేదని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ఆందోళనలు తీరేవరకూ ఈ బహుళార్థక నీటి పారుదల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఒడిశా చేస్తున్న అభ్యర్థనను తాము పట్టించుకునేది లేదన్న సంకేతాలను ఆయన అందించారు.

10/21/2017 - 02:30

విశాఖపట్నం, అక్టోబర్ 20: మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె పద్మలత, రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం లొంగిపోయాడు. గేదెల రాజు హత్య కేసులో ఇప్పటికే రవిబాబు ఏ1గా ఉన్నాడు. పద్మలత అనుమానాస్పద కేసులో కూడా రవిబాబు ప్రధాన నిందితుడు.

10/21/2017 - 02:22

గంగాధర, అక్టోబర్ 20: ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఉన్మాది వేధింపులకు గురి చేయడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లిలో విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా సర్వారెడ్డిపల్లి గ్రామ శివారు నర్సింహులపల్లి గ్రామానికి చెందిన తూడి రచన (19) గంగాధర మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది.

10/19/2017 - 01:02

హైదరాబాద్, అక్టోబర్ 18: జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో పని చేస్తున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ), ఎయిర్‌పోర్టు సర్వీసెస్ క్వాలిటీ (ఎఎస్‌క్యూ) అవార్డు లభించింది. ఈ నెల 17న మారిషస్‌లోని పోర్టులూయిస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రోపిని బహూకరించారు.

Pages