S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/22/2017 - 01:36

అమరావతి, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన అప్పుడే ఫలితాలనిస్తోంది. శుక్రవారం న్యూయార్క్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్లిల్లించ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అమరావతిలో ప్రపంచస్థాయి వర్శిటీ ఏర్పాటుకు నలందా 2.0 సంస్థ సంసిద్ధత తెలియజేసింది.

10/22/2017 - 01:33

చిత్రం..అనంతపురం జిల్లా సోమందేపల్లిలో శనివారం చేనేత కార్మికుడు చంద్రశేఖర్ ఇంటిలో చీర నేసే విధానం గురించి
తెలుసుకుంటున్న రాష్ట్ర చేనేత ప్రచారకర్త, సినీనటి పూనంకౌర్

10/22/2017 - 01:19

అమరావతి, అక్టోబర్ 21: కొత్త రాజధాని నిర్మాణానికి డబ్బులేకున్నా తాము మేధస్సు పెట్టుబడిగా ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి 30వేల ఎకరాలు సమీకరించి చరిత్ర సృష్టించామన్నారు.

10/22/2017 - 00:43

హైదరాబాద్, అక్టోబర్ 21: హైదరాబాద్‌కు చెందిన జైన్ గ్రూపు ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన విద్యార్ధులు ఈ నెల 18వ తేదీన ఎవరెస్టు శిఖరారోహణను పూర్తి చేసి ఎవరెస్టు బేస్ క్యాంపును చేరుకున్నట్లు ఆ సంస్థలకు చెందిన గ్రూప్ చైర్మన్ డాక్టర్ రాయ్‌చంద్‌జీ చెన్ రాజ్ తెలిపారు.

10/21/2017 - 04:50

శ్రీశైలం, అక్టోబర్ 20: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లకు మహానివేదన కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగించారు. కార్తీకమాసం నెల పొడవునా ఈ దీపాన్ని వెలిగిస్తారు.

10/21/2017 - 04:39

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి శ్రీనివాసన్ (94) కన్నుమూశారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారని తెలిసింది. మరణ వార్త తెలిసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్ నుండి రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమె పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.

10/21/2017 - 04:37

హైదరాబాద్, అక్టోబర్ 20: భారత రైల్వేలో 2016-17లో చేపట్టిన ఉన్నత ఆవిష్కరణలు (బెస్ట్ ఇన్నోవేన్) స్కీంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ‘్ఫస్ట్ బెస్ట్ ఇన్నోవేషన్’ అవార్డును దక్కించుకుంది. రైళ్ల రాకపోకల నిర్వహణలో కీలకమైన ‘ఆటోమేటిక్ సింగిల్ కార్ టెస్ట్ రిగ్’ను తయారు చేసి ప్రయోగాత్మకంగా మంచి ఫలితాలను రాబట్టినందుకు గాను బెస్ట్ ఇన్నోవేషన్స్‌లో ఫస్ట్ అవార్డును ద.మ.రైల్వే సొంతం చేసుకుంది.

10/21/2017 - 04:21

శ్రీశైలం, ఆక్టోబర్ 20: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో గురువారం గేట్లు మూసివేశారు. ఎగువ నుంచి 49 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు 39 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

10/21/2017 - 04:07

హైదరాబాద్, అక్టోబర్ 20: వచ్చే నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న సందర్భంగా కోర్టు కేసులకు హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరుతూ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. తీర్పు 23వ తేదీన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

10/21/2017 - 02:55

హైదరాబాద్, అక్టోబర్ 20: బీసీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీపావళి కానుకను అందజేశారు. బీసీ రుణాల సబ్సిడీ 102.8 కోట్ల రూపాయిలు మంజూరు చేస్తూ దానికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం నాడు సంతకం చేశారు. ఈ సబ్సిడీ రుణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12,218 మందికి లబ్ది చేకూరనుందని అన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు కావడం వల్ల బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం

Pages