S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/23/2017 - 02:27

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలో 2017-18 రబీలో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గత రెండు, మూడు వారాల నుండి వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతోపాటు ప్రధాన జలాశయాల్లోకి భారీ ఎత్తున జలాలు చేరడంతో ప్రభుత్వంలోనూ, రైతాంగంలోనూ ఆశలు రేకెత్తాయి.

10/23/2017 - 02:25

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కెసిఆర్ కల కార్యరూపంలో పరుగందుకుంది. పేదల ఇళ్ల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2బిహెచ్‌కెలపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు 14 రెట్లు పెరిగి, 378.48 కోట్ల నుంచి రూ.529.84 కోట్లకు చేరింది.

10/23/2017 - 02:22

హైదరాబాద్/ చిక్కడపల్లి, అక్టోబర్ 22: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబుపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ఓ మాజీ సర్పంచ్‌తో కలసి గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ కరీంనగర్ జిల్లా ముత్తారం తెరాస నేత కిషన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీ్ధర్‌బాబు, మాజీ సర్పంచ్ సుదర్శన్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

10/23/2017 - 02:19

వరంగల్, అక్టోబర్ 22: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్రంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఐదువందల జనాభా ఉన్న ప్రతి గిరిజన తండా, చెంచుగూడెం, ఆదివాసీ ప్రాంతాలు, శివారు గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామని పునరుద్ఘాటించారు. కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేస్తామని హామీ ఇచ్చారు.

10/23/2017 - 02:17

వరంగల్, అక్టోబర్ 22: తెలంగాణ ఆవిర్భావంతో తెరాస అధికారంలోకి వచ్చి పారిశ్రామిక విధానానికి కొత్తరూపు కల్పించిందని, టిఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రంలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించామని సిఎం కె చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌విండో విధానం అమలులో ఉన్నా, అవి పరిమితులు, షరతులతో కూడుకున్నవన్నారు.

10/23/2017 - 01:44

విజయవాడ, అక్టోబర్ 22: విద్యుత్ చౌర్యరహిత రాష్ట్రంగా ఏపీని రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంధన మంత్రి కళా వెంకటరావు అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలను పరిష్కరించేందుకు త్రిముఖ వ్యూహం అమలుకు, ‘మీ వినియోగదారులను కలవండి’ కార్యక్రమం ప్రారంభానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇంధన రంగానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో విజయవాడ నుంచి ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

10/23/2017 - 01:42

ఖమ్మం, అక్టోబర్ 22: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో రబీలో సాగర్ ఆయకట్టుకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎనె్నస్పీ ఎడమ కాల్వ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

10/23/2017 - 03:59

పాల్వంచ, అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కెటిపిఎస్ పాత ప్లాంట్ కర్మాగారంలో 8 యూనిట్లను త్వరలో మూసివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 30 సంవత్సరాలు నిండిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూసివేసేందుకు అనుమతివ్వాలని టిఎస్ జెన్కో ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రకారం కెటిపిఎస్ పాత ప్లాంట్‌లో 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 యూనిట్లు 30 ఏళ్లు నిండిన జాబితాలో చేరాయి.

10/23/2017 - 01:35

విజయవాడ, అక్టోబర్ 22: ‘మీ దగ్గర నైపుణ్యం ఉంది. పెట్టుబడులు ఉన్నాయి. మా దగ్గర అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఓడరేవుల అభివృద్ధి రంగంలో ఉభయులం కలిసి పనిచేసే అవకాశం మనముందు ఉంది’ అని సిఎం చంద్రబాబు డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్, సిఈవో సుల్తాన్ అహ్మద్ బిన్ సులేమాన్‌ను ఆహ్వానించారు. ఆదివారం ఐదోరోజు విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యుఏఇలో పర్యటిస్తోంది.

10/23/2017 - 01:33

తిరుపతి, అక్టోబర్ 22: చేసిన అప్పులు తీర్చుకోలేక సొంత ఊరులో తలెత్తుకుని తిరగలేక తల్లీకొడుకు తిరుమలలో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. తిరుమలలోని పిఏసి-3 (మాధవ నిలయం) వద్ద ఓ యువకుడు, ఓ మహిళ విగతజీవులై పడి ఉండటాన్ని భక్తులు గుర్తించి కలవరపాటుకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టిటిడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Pages