S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/28/2016 - 05:37

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపిఎస్‌ఆర్టీసీ) విభజన వివాదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజనకు ఇంకా ఐదారు నెలలు పట్టే అవకాశం కనపడుతోంది. ఆర్టీసీ విభజన సాంకేతికంగా పూర్తయ్యే వరకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నుంచి టిఎస్, ఆంధ్ర ఆర్టీసీకి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.

03/28/2016 - 06:20

హైదరాబాద్, మార్చి 27: రాష్ట్రంలో బిసిల సంక్షేమానికి నిధులు ఖర్చు చేయడంలో రాజీపడే ప్రసక్తిలేదని, నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించి రుణాలు ఇవ్వడం వల్ల బిసిలకు అన్యాయం జరుగుతుందని బిసిలు భావించరాదన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఉన్నతాధికారులతో బిసి సంక్షేమంపై సమీక్షించారు.

03/27/2016 - 06:30

తిరుమల, మార్చి 26: లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు కేటాయించే అంశంలో శనివారం తలెత్తిన సాంకేతిక లోపంతో టిడిడి భక్తులకు సేవా టిక్కెట్లు కేటాయించలేకపోయింది. పరిస్థితిని వివరించి సహకరించాలని జె ఇ ఓ శ్రీనివాసరాజుభక్తులను అభ్యర్ధించారు. ఐతే లక్కీడిప్ ద్వారా లభించే ఆర్జితసేవా టిక్కెట్లపై ఆవలు పెట్టుకున్న భక్తులు ఆందోళనకు దిగారు.

03/27/2016 - 02:23

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. ఆ ప్రకారం మంత్రులు, విప్‌లు, ఇతర పదవుల్లో ఉన్న వారి వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం కనీసం రెండు లక్షలకు పెంచాలని ఎమినిటీస్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు అసెంబ్లీ హాలులో సమావేశమైన ఎమినిటీస్ కమిటీ సిఫార్సులు చేసింది.

03/27/2016 - 02:22

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు వేముల రాజా చైతన్యలను భద్రతా సిబ్బంది మెయిన్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి భద్రతా సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగారు. తమను లోపలికి అనుమతించాల్సిందేనని రాధిక వాదించారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

03/27/2016 - 02:21

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కు అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమం ద్వారానే తెలంగాణ సాకారం అయిందని, అలాంటి దళిత విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలో అన్యాయం జరిగితే ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడుతుందని ఆశిస్తే అలా జరగలేదని బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

03/27/2016 - 02:20

హైదరాబాద్, మార్చి 26: ఫైబర్ గ్రిడ్ అంశంపై శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును ముఖ్యమంత్రి తన సన్నిహితుడు, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఇచ్చారని జగన్ ధ్వజమెత్తారు. అయితే ఆయన దొంగ కాదు... త్యాగశీలి అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.

03/27/2016 - 02:15

హైదరాబాద్, మార్చి 26: కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ఓరుగల్లును వశపర్చుకున్న తుగ్లక్ కుమారుడు, మహ్మద్ బీన్ తుగ్లక్ హయాంలో చెలామణి అయిన అరుదైన బంగారు నాణ్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టిఆర్‌ఎస్‌ఎమ్ ఫౌండేషన్ బహుకరించింది. పురాతన నాణాలను సేకరించే అలవాటు ఉన్న టిఆర్‌ఎస్‌ఎమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు శనివారం శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రిని కలిశారు.

03/27/2016 - 02:12

హైదరాబాద్, మార్చి 26: ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి బదిలీల ప్రక్రియ జరుగనుందని టిఎన్‌జివో నేతలు వెల్లడించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల బదిలీ అంశాన్ని చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే నెల నుంచి బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు వారు తెలిపారు.

03/27/2016 - 02:11

కడప/మార్కాపురం, మార్చి 26: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఇంగ్లీషు పేపర్ -1 ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లీషు పేపర్-1 పరీక్ష పత్రంలో 13వ ప్రశ్నకు సంబంధించిన పేరా ‘ది డియర్ డి పార్టెడ్-2’ అనే పాఠ్యాంశానికి చెందినదిగా బ్రాకెట్‌లో ఇచ్చారు. అయితే వాస్తవంగా ఆ పేరాలో ఇచ్చిన వాక్యం ‘స్టోర్డ్‌హౌస్’కు చెందినదిగా ఉపాధ్యాయులు గుర్తించారు.

Pages