S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/23/2016 - 00:44

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పండ్ల పక్వానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఫిబ్రవరి 1వ తేదీన రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

01/22/2016 - 02:25

కాకినాడ, జనవరి 21: నిరుపేద రోగులు, వారి వెంట వచ్చే సహాయకుల సౌకర్యార్థం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పది రూపాయలకే భోజనం పథకం ప్రారంభించారు. టచ్‌స్టోన్ ఛారిటీస్, అక్షయపాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు.

01/22/2016 - 02:24

కడప,జనవరి 21: తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ శిశువుకు శాపంగా మారాయి. సాక్షాత్తు న్యాయమూర్తి ఎదుటే అభంశుభం తెలియని చిన్నారిని తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులు వదిలివెళ్లిపోయారు. విడాకుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈలోగా భరణంగా నెలకు 3వేల 500 రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇందుకు సంతృప్తిచెందని బాలిక తల్లి ఎన్.విజయభారతి జడ్జి ఎదుటే బిడ్డను వదిలివెళ్లింది.

01/22/2016 - 02:23

నెల్లూరు/గూడూరు, జనవరి 21: రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించిన ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారులకు సూచించారు.

01/22/2016 - 02:23

తిరుమల, జనవరి 21 : కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని 2015వ సంవత్సరంలో 2.45 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా, వారు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 897.55 వందల కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. 2014తో పోలిస్తే గత ఏడాది 20 లక్షల మంది భక్తులు అదనంగా స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 63.29 కోట్ల రూపాయలు అదనంగా లభించింది.

01/22/2016 - 02:22

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో డిఎడ్ విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. డిఎడ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించి నెలలు గడుస్తున్నా నేటి వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయితేనే రెండో సంవత్సరం తరగతులకు అనుమతిస్తారు. దీంతో 2014లో చేరిన విద్యార్థులు ఇప్పటికీ మొదటి సంవత్సరం తరగతులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

01/22/2016 - 02:22

గుంటూరు, జనవరి 21: రాజధాని అమరావతి ప్రకటించిన నాటి నుంచి అన్ని విధాలా రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తున్న తుళ్లూరు ప్రజలు తొలిసారిగా మాస్టర్‌ప్లాన్ సదస్సును బహిష్కరించి సంచలనం సృష్టించారు. గురువారం సదస్సును నిర్వహించేందుకు సిఆర్‌డిఎ అధికారులు చేసిన యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్థులు రెండు గంటల సేపు రహదారిపై బైఠాయించారు.

01/22/2016 - 02:21

కొత్తపేట, జనవరి 21: ఒక అభిమాని మొక్కును తీర్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం పటికబెల్లంతో తులాభారం తూగారు. నియోజకవర్గంలోని రావులపాలెంకు చెందిన పచ్చిపులుసు సుబ్బారావు అనే వ్యాపారి 2014 ఎన్నికల్లో జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీ షిరిడీ సాయినాథునికి పటికబెల్లంతో తులాభారం వేసి సమర్పిస్తానని మొక్కుకున్నారు.

01/22/2016 - 02:21

అనపర్తి, జనవరి 21: సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో గురువారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో సుమారు 20 నిముషాల పాటు నిలిచిపోయింది. డి-1 బోగి కింద బ్రేకుల వద్ద పొగ రావడంతో రైలును అనపర్తి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. సిబ్బంది చిన్నపాటి మరమ్మతులు చేపట్టిన అనంతరం తిరిగి బయల్దేరింది.

01/22/2016 - 02:20

తిరుపతి, జనవరి 21 : పురాణాలను సరళమైన భాషలో అనువదించి, త్వరితగతిన ముద్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి డా. డి సాంబశివరావు ఉద్ఘాటించారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రముఖ పండితులతో ‘పండిత పరిషత్’ సమావేశం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం నిర్వహించారు.

Pages