S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/13/2018 - 12:47

విజయవాడ: ఏపీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు.

08/13/2018 - 04:33

శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాజెక్టుల నుండి శ్రీశైల రిజర్వాయర్‌కు వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రానికి 885అడుగులకు గాను 869.70 అడుగులుగా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 2015.8 టీఎంసీలకు గాను 140.310 అడుగులుగా నీటి నిల్వ నమోదైంది.

08/13/2018 - 04:26

ఖమ్మం, ఆగస్టు 12: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా ఉభయ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి ఒకేరోజు రెండడుగుల మేర పెరిగి, తిరిగి ఒక అడుగు తగ్గగా కినె్నరసాని, తాలిపేరు, పెద్దవాగు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదిలారు. వైరా రిజర్వాయర్ పూర్తిగా నిండి అలుగు పారుతోంది.

08/13/2018 - 04:10

హైదరాబాద్, ఆగస్టు 12: అనవసరంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న జీవీఎల్‌కు నిబద్దత ఉంటే యూపి సమస్యలపై గవర్నర్‌కు లేఖ రాయాలని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడీ అకౌంట్లపై అవగాహన లేకుండా మాట్లాడిన జీవీఎల్ పంజరంలో చిలుకలా ఇరుక్కొని గిలగిలా కొట్టుకుంటున్నారని అన్నారు.

08/13/2018 - 04:34

విశాఖపట్నం, ఆగస్టు 12: ఉత్తర ఒడిశాను ఆనుకుని 7.6 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. రాగల 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.

08/13/2018 - 01:36

హైదరాబాద్, ఆగస్టు 12: ఎన్నో సృజనాత్మక కథలు, నాటకాలకు ప్రాణం పోసిన ప్రముఖ నాటక రచయిత పీసపాటి శేషుబాబు (పీసపాటి శేషాచల శాస్ర్తీ) ఆదివారం కన్నుమూశారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తూనే నాటక రంగంపై ఉన్న మక్కువతో ఆయన ఎన్నో నాటకాలు రాశారు. కథకుడిగా, విమర్శకుడిగా కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ, ఆయన కలం నుంచి జాలువారిన నాటకాలు విశేష ఆదరణ పొందాయి. ఎన్నో బహుమతులను అందుకున్నాయి.

08/13/2018 - 01:33

తిరుపతి, ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు.
బంగారు కూర్చ సిద్ధం

08/13/2018 - 01:25

శ్రీకాకుళం, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ అసలైన యుద్ధాన్ని ఇప్పుడే ప్రారంభించిందని, మొదటి స్థానానికి పోటీ పడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

08/13/2018 - 00:32

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకంలో భాగంగా రైతుల పేర్లతో సర్ట్ఫికెట్ల పంపిణీ యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ నెల 14 వరకు వీటి పంపిణీని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది యావత్తూ ఇదే పనిపై నిమగ్నమై ఉంది. రెండో శనివారం, ఆదివారం సెలవులు కూడా వినియోగించుకోకుండా సిబ్బంది గ్రామాల్లో తిరుగుతున్నారు.

08/13/2018 - 00:42

హైదరాబాద్: తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో పార్టీ ఊతమివ్వడంతో పాటు నాయకులను, కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు రాహుల్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే.

Pages