S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/12/2018 - 01:54

వరంగల్ క్రైం, ఆగస్టు 11: వందలకోట్ల రూపాయల టర్నోవర్ దాటిన కంపెనీల లక్ష్యంగా గురువారం మోక్ష ఇన్‌ఫ్రా కంపెనీపై ప్రారంభమైన ఇన్‌కాంటాక్స్ అధికారుల దాడులు శనివారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి. ‘ఆంధ్రభూమి’ కథనంతో అధికార యంత్రాం కదిలి, ఐటీ సోదాలు ముమ్మరం చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బడా కాంట్రాక్టర్లు, బిల్డర్ల వెన్నులో వణుకు పుడుతున్నది.

08/12/2018 - 01:53

తిరుపతి, ఆగస్టు 11: ప్రతి పుష్కర కాలానికి శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణ జరుగుతున్న సమయంలో వరుణుడు పులకరించి పూల జల్లులు కురిపించాడు.

08/12/2018 - 01:50

పుట్టపర్తి, ఆగస్టు 11: న్యాయవ్యవస్థ మానవతా విలువలతో ముడిపడి ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా పేర్కొన్నారు. సమాజాన్ని గాడిలో పెట్టేది ధర్మమేనన్నారు. మానవ మనుగడకు విలువలు, ధర్మం పట్టుకొమ్మల్లాంటివన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నైతిక విలువలు, న్యాయానుసార ప్రపంచం అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ న్యాయసదస్సు శనివారం ప్రారంభమైంది.

08/12/2018 - 01:39

ధర్మపురి, ఆగస్టు 11: శ్రావణ శుక్ల పక్ష పంచమికి ‘నాగ పంచమి’తోపాటు ‘గరుడ పంచమి’ అని కూడా పేరు. ఈ దినం నాడు గరుడ పూజ ఆచారంగా ఉంది. గరుత్మంతుడు మహా విష్ణువుకు వాహనంగా ప్రసిద్ధుడు. మహాబలశాలి. విష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా గురుడవాహనుడై వెళ్ళి, ఆపన్నుల రక్షణనిస్తాడు.

08/12/2018 - 01:17

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణలోని చాలా జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది.

08/12/2018 - 01:14

హైదరాబాద్, ఆగస్టు 11: ఎరుకల, రజకులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌లో రజకులు, ఎరుకల సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు. రజక సంఘం ప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడుతూ, రజకులకు వాషింగ్ మిషన్లు పంపిణీ చేస్తామని అన్నారు.

08/12/2018 - 01:04

హైదరాబాద్, ఆగస్టు 11: జ్యోతిష శాస్త్ర వైభవాన్ని, విశిష్టతను సమాజానికి తెలియచేయడానికి, జ్యోతిష, ఆగమ, ఆలయ, ధర్మసంబంధమైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వచ్చే శ్రీ వికారి నామ సంవత్సరం పండగలను నిర్ణయించి, ఆ జాబితాను ప్రభుత్వానికి అందించేందుకు వీలుగా ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జ్యోతిష మహాసభలు నిర్వహిస్తున్నారు.

08/12/2018 - 01:03

రామచంద్రాపురం, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను 15 నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

08/12/2018 - 01:33

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అణచి వేతలు మినహా ప్రభుత్వం చేసింది, సాధించింది శూన్యమని సీఎల్‌పీ కే. జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎల్‌పీ సమావేశమై చర్చించింది.

08/12/2018 - 00:42

హైదరాబాద్, ఆగస్టు 11: హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌కు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు మంజూరు చేసింది. చాలాకాలంగా బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ గుర్తింపు లేదు. అయినా, పరిశ్రమ గుర్తింపు ఉండటంతో విద్యార్థులు చేరుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన బిట్స్ యాజమాన్యం ఇటీవల యూజీసీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది.

Pages