S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/12/2018 - 01:31

పెనుమంట్ర: ఆడపడుచుల భద్రతే లక్ష్యంగా చట్టసభల్లో వారికి 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ పార్టీ గట్టిగా కృషి చేస్తుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టంచేశారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో ప్రకటించే జనసేన మేనిఫెస్టోలో దీన్ని మొదటి అంశంగా చేరుస్తానని ప్రకటించారు.

08/12/2018 - 00:33

తుని, ఆగస్టు 11: తునిలో రైలు తగలబెట్టింది ముమ్మాటికీ చంద్రబాబేనని, ఆ సమయంలో కాపులపై పెట్టిన కేసులన్నీ తమ ప్రభుత్వం ఏర్పడగానే పూర్తిగా ఎత్తివేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

08/11/2018 - 13:38

ఖమ్మం: జిల్లాను వర్షాలు ముంచెత్తటంతో కినె్నరసాని ప్రాజెక్టుల గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దిగువకు 50వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయ నీటిమట్టం 407 అడుగులు కాగా ఇప్పటివరకు 406.8 అడుగులకు చేరుకుంది. దీంతో తొమ్మిది గేట్లును ఎత్తివేశారు.

08/11/2018 - 12:56

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు కూలటంతో పదిమందికి గాయాలు అయ్యాయి. ఇక్కడ భారీ వర్షాలు విస్తత్రంగా కురుస్తున్నాయి. బస్సులో 45మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

08/11/2018 - 12:52

ఖమ్మం: ఖమ్మం, భద్రాది, కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇల్లందు, మణుగురు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు రాయగూడెం ప్రాంతం నదిలో చిక్కుకుపోయారు.

08/11/2018 - 02:42

హైదరాబాద్, ఆగస్టు 10: సింగరేణి యాజమాన్యం సామాజిక సేవలను చేపట్టడంతో పాటు అమలుకు కృషి చేయడంలో సఫలం అవుతోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు.శుక్రవారం హైదరాబాద్ రాజభవనంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు.

08/11/2018 - 02:42

హైదరాబాద్, ఆగస్టు 10: పోలీస్ శాఖ నిర్వహించనున్న రాత పరీక్షలు వాయిదా వేశారు, సెప్టెంబర్ 2వ తేదీన పోలీస్ శాఖలో రెండు విభాగాలకు చెందిన పరీక్షలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే అదే రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 475 పోస్టులకు రాత పరీక్షలకు తేదీలను ప్రకటించింది. దీంతో ఇటు పోలీస్ శాఖ అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన రాత పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

08/11/2018 - 02:09

వరంగల్, ఆగస్టు 10: తెలంగాణలో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహకాలు, పెట్టుబడులు, ప్రాధాన్యత మరే రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రొత్సహం వల్ల చదువుకున్న యువత కూడా నేడు వ్యవసాయం వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు.

08/11/2018 - 02:04

చిత్రాలు..రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను శుక్రవారం చీఫ్ పోస్టుమాస్టార్ జనరల్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రశాంత కుమారి, వాకాటి కరుణ వేరు వేరుగా కలిసిన దృశ్యలు

08/11/2018 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 10: ఉన్నత విద్యలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివిధ రాష్ట్రాల్లో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అలాగే స్థానిక సంప్రదాయ యూనివర్శిటీలు సైతం విదేశీ యూనివర్శిటీలతో కలిసి ఉమ్మడిగా పరిశోధనలకు, కోర్సుల నిర్వహణకు వీలుకలుగుతుంది.

Pages