S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/13/2018 - 00:30

హైదరాబాద్, ఆగస్టు 12: భారీ వరదల నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ఆదివారం భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వరద నీటి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరలపై మంత్రి హరీష్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు.

08/13/2018 - 00:28

హైదరాబాద్, ఆగస్టు 12: ఉత్తర తెలంగాణ కుంభవృష్టితో అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల నుండి 32 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలు రికార్డు నెలకొల్పాయి. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. పంటపొలాలతో పాటు రోడ్లు కూడా జలమయం అయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని నివాసప్రాంతాల్లోని రోడ్లు వర్షపునీటితో నిండిపోయాయి.

08/13/2018 - 00:24

తణుకు, ఆగస్టు 12: ఎందుకూ కొరగాని రేషన్ పథకానికి బదులుగా మహిళలకు ఖాతాల్లో నేరుగా నెలకు రూ.2500 నుండి రూ.3000 నగదు జమ చేసే పథకం అమలు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీయిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న కిలో రూపాయి బియ్యం పేదలు తినడానికి పనికి రావడం లేదని, వాటిని మళ్లీ డీలర్లు, వ్యాపారులు కొనేసి, వేల కోట్లు ఆర్జిస్తున్నారన్నారు.

08/13/2018 - 00:11

అమరావతి, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పనుల వేగంలో జోరు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనుల్లో అనతికాలంలోనే గణనీయమైన పురోగతి సాధించామని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

08/13/2018 - 03:56

ఇటు కృష్ణ, అటు గోదావరి నదులకు వరద నీరు పోటెత్తింది. రెండూ ఉప్పొంగడంతో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజి 20 గేట్లు ఎత్తివేసి వరద పోటు తీవ్రత తగ్గించారు.
అలాగే.. ఎగువ నీటి ప్రవాహం వల్ల గోదావరి నీటి మట్టం పెరగడంతో కాటన్ బ్యారేజీ నుంచి ఇప్పటికే రెండు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేశారు.
*

08/12/2018 - 04:24

విజయవాడ: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు ప్రకాశం బ్యారేజీని ముంచెత్తుతోంది. గత కొద్ది రోజులుగా బ్యారేజీ వద్ద నీరు లేక కృష్ణా డెల్టా ఆయకట్టు చివరి భూములకు సాగునీరందక నారుమడులు ఎండు మొఖం పడుతుండటంతో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

08/12/2018 - 04:22

తిరుపతి, ఆగస్టు 11: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారికి నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవలు, విఐపీ దర్శనాలు, రూ.300, సర్వదర్శనం, దివ్యదర్శనం, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చే సౌకర్య దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

08/12/2018 - 03:34

ఖమ్మం, ఆగస్టు 11: ఈ ఏడాదిలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక శాతం చెరువులు నిండగా వాగులు పొంగిపొర్లాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండంతో అనేకచోట్ల రహదారి వ్యవస్థ స్తంభించిపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులైన వైరా, తాలిపేరు, కినె్నరసాని, పెద్దవాగు నిండటంతో దిగువకు నీటిని వదిలారు. కొత్తగూడెం, ఇల

08/12/2018 - 02:23

గోదావరిఖని, ఆగస్టు 11: నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఏ మాత్రం తగ్గకుండా వర్షం కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.

08/12/2018 - 01:57

విశాఖపట్నం, ఆగస్టు 12: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశాఖ మహా నగర సమ్మేళన్ విశాఖలో శనివారం ఉదయం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అంతే గోప్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మంది సంఘ్ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్యఅతిథిగా సందేశమిచ్చారు.

Pages