S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/05/2018 - 05:40

హైదరాబాద్, ఆగస్టు 4: సరిపడా నిధులిస్తాం, అవసరమైతే అదనంగా నిధులు ఇస్తాం అని కేంద్రం హామీ ఇస్తున్నప్పటికీ, దివ్యాంగుల విద్యపై నిధులు వెచ్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎక్కువ నిధులు పొందితే దామాషాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ మేరకు నిధులు విడుదల చేయాల్సి వస్తుందనే భయమే ఇందుకు ప్రధాన కారణమన్న అనుమానాలు ఉన్నాయి.

08/04/2018 - 21:49

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ విద్య, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సంస్థ (టిఈఎస్‌సిల్‌ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ గతం- వర్తమానం- భవిష్యత్ అంశాలపై 17 సదస్సులు ఏర్పాటు చేసినట్టు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ వెల్చాల కొండలరావు తెలిపారు. తొలుత జర్నలిజంలో పరిణామాలపై 5వ తేదీ ఉదయం 9 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు.

08/04/2018 - 21:48

హైదరాబాద్, ఆగస్టు 4: సిద్దిపేటలో సెంట్రల్ వర్శిటీకి కేంద్రీయ విద్యాలయాలకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా 13 సెంట్రల్ వర్శీటీను నెలకొల్పనున్న విషయం తెలిసిందే. కాగా, మధ్యప్రదేశ్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.

08/04/2018 - 12:47

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసు ప్రధాన నిందితుడు మల్లికార్జున్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వివరాలు వెల్లడించనున్నారు. కరక్కాయ పొడి చేసి ఇస్తే కిలోకు రూ.300 ఇస్తామని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడి, భారీ ఎత్తున మోసం చేసిన సంగతి తెలిసిందే.

08/04/2018 - 12:28

అమరావతి: కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్ వద్ద నిన్న రాత్రి జరిగిన క్వారీ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేశారు. ఘటనాస్థలానికి వెళ్లాలని హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఆలూరు జిల్లా హత్తిబెళగల్ వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి పదిమంది అక్కడికక్కడే చనిపోగా..

08/04/2018 - 06:11

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం నాడు నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

08/04/2018 - 06:10

నాగార్జునసాగర్, ఆగస్టు 3: భారతదేశ భాండాగారం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జునసాగర్ నందికొండ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేసి నేటికి 51 వసంతాలు నిండి 52వ వసంతంలోకి అడుగు పెట్టింది.

08/04/2018 - 05:01

ఖమ్మం, ఆగస్టు 3: టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నామా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నామా..

08/04/2018 - 05:32

తిరుపతి, ఆగస్టు 3: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే, సతీమణి ప్రొఫెసర్ మైత్రి విక్రమ్‌సింఘే దంపతులు శుక్రవారం ఉదయం విరామ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సింఘే కుటుంబ సభ్యులకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఇస్తికపాల్ స్వాగతం పలికి ఆలయంలోనికి ఆహ్వానించారు.

08/04/2018 - 05:33

మడకశిర, ఆగస్టు 3: యువత ఓట్లు దండుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ భృతి ప్రకటన చేశారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడిచిన తరువాత నిరుద్యోగ భృతి అంశం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్ల కోసమే బాబు ఈ ఎత్తుగడ వేశారన్నారు. నెలకు రూ.

Pages