S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/04/2018 - 02:35

రేణిగుంట, ఆగస్టు 3: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపులకు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు చిత్తూరు జిల్లా కాపు సంఘం వైకాపా నేతలు ఘనస్వాగతం పలికారు.

08/04/2018 - 05:35

ఏలూరు, ఆగస్టు 3: బీజేపీకి 2019 ఎన్నికల్లో అసలైన సినిమా చూపించబోతున్నామని పంచాయితీరాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. బీజేపీ, జగన్, పవన్ కలిసి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని వేలివెన్ను గ్రామంలో శుక్రవారం ఆయన గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు.

08/04/2018 - 02:32

అమరావతి, ఆగస్టు 3: రాష్ట్రాల్లో అశాంతిని ప్రేరేపించి బలమైన నాయకత్వాన్ని అణచివేయడం ద్వారా పెత్తనం చలాయించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘ప్రజల సెంటిమెంట్లతో కేంద్రం ఆడుకుంటోంది..

08/04/2018 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా,విభజన హామీల అమలుపై ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లును సుప్రీం కోర్టు స్వీకరించింది.

08/04/2018 - 05:37

ఆదోని, ఆగస్టు 3: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో క్వారీలో భారీ పేలుడు సంభవించి 10 మందికి కూలీలు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటల్లో కాలిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఘటన ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామ శివారులోని కొండల్లో శుక్రవారం రాత్రి జరిగింది.

08/04/2018 - 05:40

హైదరాబాద్, ఆగస్టు 3: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయకర్తలే కీలకమని, ఈ దిశగా వారు కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా సమన్వయకర్తలు పని చేయాలని, పది రోజుల్లో పోలింగ్ కేంద్రాలకు కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది.

08/04/2018 - 02:11

నిజామాబాద్, ఆగస్టు 3: రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తెరాస ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికల్లో ఎంపీ కవిత పోటీ చేస్తే కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలువడం కష్టంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

08/04/2018 - 02:09

నిజామాబాద్, ఆగస్టు 3: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌పై పోలీసు కేసు నమోదైంది.

08/04/2018 - 05:43

నిజామాబాద్, ఆగస్టు 3: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ దురుద్దేశంతో తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ తనయుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అనుమానాలు వెలిబుచ్చారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఖండించారు.

08/03/2018 - 22:02

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో జరుగుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వాన్ని నడుపుతున్నవ వారికి కల్పతరువులా, కాంట్రాక్టర్లకు కామధేనువులా మారాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చంధ్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages