S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/06/2018 - 01:27

చిత్రం..హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు తీసుకెళుతున్న మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

08/06/2018 - 01:17

విశాఖపట్నం, ఆగస్టు 5: ఇతర రాష్ట్రాల నుంచి నక్షత్ర తాబేళ్ళను విశాఖ మీదుగా విదేశాలకు తరలిస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1,125 నక్షత్ర తాబేళ్ళను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులకు అందిన సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లో కాపుకాసి గుట్టును రట్టు చేశారు.

08/06/2018 - 01:14

తిరుపతి, ఆగస్టు 5: తిరుత్తణి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ ఆదివారం సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆడికృత్తికను పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి టీటీడీ పట్టువస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది.

08/06/2018 - 01:59

వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్‌విప్, జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర వెంకట రమణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయంకోసం వెళ్లే మహిళలను లొంగదీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

08/06/2018 - 00:35

హైదరాబాద్, ఆగస్టు 5: పాతనగరం బోనమెత్తింది. చారిత్రక లాల్ దర్వాజా బోనాలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

08/06/2018 - 04:49

సంగారెడ్డి: కుటుంబ అవసరాలకన్నా సమాజానికి అవసరమైన సరికొత్త ఆవిష్కరణలు సృష్టించగల శక్తి సామర్థ్యాలు నేటి యువతలో అపారంగా ఉన్నాయని భారత రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది గ్రామ శివారులోని ఐఐటీహెచ్‌లో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

08/06/2018 - 00:25

హైదరాబాద్, ఆగస్టు 5: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారన్న వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. పార్టీ కార్యకర్తల్లో కదనోత్సాహం ప్రారంభమైంది. పరిస్థితి మరింత మెరుగవుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఊతమిచ్చే అంశాలు పెరుగుతాయని పార్టీ వర్గాలు ఆశపడుతున్నాయి.

08/06/2018 - 00:22

అమరావతి, ఆగస్టు 5: ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ్ధ్యాయం లిఖించేలా విజయాలు సాధిస్తూ తాజాగా రజత పతకం సొంతం చేసుకున్న పీవీ సింధు దేశ క్రీడాకారులకు స్ఫూర్తిప్రదాత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో స్పెయిన్ క్రీడాకారిణి

08/06/2018 - 01:55

విజయవాడ (కార్పొరేషన్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రానున్న ఎన్నికలకు బహుముఖ వ్యూహంతో ముందుకు నడిపిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాలు, సమన్వయకర్తలతో సమావేశమై విధివిధానాలు రూపొందించనున్నట్టు తెలిపారు.

08/06/2018 - 01:54

విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ అటు టీడీపీకి, ఇటు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా మారబోతోంది. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ, తానే తెస్తానని విశాఖ ఎంపీ హరిబాబు పదే పదే చెబుతున్నారు. రైల్వే జోన్ తెచ్చిన పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పడతారన్నది రాజకీయ పార్టీల్లో ఉంది. జోన్ విషయాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ కేవలం హోదాపైనే ఆధారపడి ఎన్నికలకు వెళుతోంది.

Pages